Fellowship: ఫెలోషిప్‌కు దరఖాస్తుల ఆహ్వానం.. నెలకు రూ.55 వేల స్టైఫండ్.. పూర్తి వివరాలివే..

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) రూర్కీ.. హైడ్రో అండ్ రెనెవబల్ ఎనర్జీ విభాగం పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. గ్రీన్‌హౌస్ వాయువులను తగ్గిస్తూ, ఆల్గాల్ బయోమాస్ ఆధారిత శక్తితో నీటి వనరుల నిర్వహణ అనే అంశంపై ఈ పరిశోధన దృష్టి సారిస్తుంది. ఈ ఫెలోషిప్‌కు అప్లై చేసే అభ్యర్థులకు సంబంధిత విభాగంపై అవగాహన, అనుభవం తప్పనిసరిగా ఉండాలి. పూర్తి వివరాలివే..

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) రూర్కీ.. హైడ్రో అండ్ రెనెవబల్ ఎనర్జీ విభాగం పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. గ్రీన్‌హౌస్ వాయువులను తగ్గిస్తూ, ఆల్గాల్ బయోమాస్ ఆధారిత శక్తితో నీటి వనరుల నిర్వహణ అనే అంశంపై ఈ పరిశోధన దృష్టి సారిస్తుంది. ఈ ఫెలోషిప్‌కు అప్లై చేసే అభ్యర్థులకు సంబంధిత విభాగంపై అవగాహన, అనుభవం తప్పనిసరిగా ఉండాలి. పూర్తి వివరాలివే..

  • Share this:
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) రూర్కీ.. హైడ్రో అండ్ రెనెవబల్ ఎనర్జీ విభాగం పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. గ్రీన్‌హౌస్ వాయువులను తగ్గిస్తూ, ఆల్గాల్ బయోమాస్ ఆధారిత శక్తితో నీటి వనరుల నిర్వహణ అనే అంశంపై ఈ పరిశోధన దృష్టి సారిస్తుంది. ఈ ఫెలోషిప్‌కు అప్లై చేసే అభ్యర్థులకు సంబంధిత విభాగంపై అవగాహన, అనుభవం తప్పనిసరిగా ఉండాలి. ఎన్విరాన్‌మెంటల్ మైక్రోబయాలజీ, ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్, బయోగ్యాస్ టెక్నాలజీ, ఆల్గల్ బయో ప్రాసెసింగ్, ఎన్విరాన్‌మెంటల్ మేనేజ్‌మెంట్ ఆఫ్ వాటర్ బాడీస్ లేదా సంబంధిత అంశాలపై పరిశోధన చేసినవారు, Ph.D ఉన్నవారు ఈ ఫెలోషిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. బయోగ్యాస్, ఆల్గాల్ బ్లూమ్స్, మురుగునీటి నిర్వహణ, నీటి వనరులు పర్యావరణ నిర్వహణ లేదా సంబంధిత అంశాల్లో ఒకటి లేదా రెండు సంవత్సరాల అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. ఇటీవల థిసీస్ సమర్పించిన వారు కూడా ఈ ఫెలోషిప్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. దీనికి దరఖాస్తు చేసేందుకు చివరి తేదీ ఆగస్టు 20.

ఫెలోషిప్‌ స్టైఫండ్ ఎంత?
ఫెలోషిప్ వ్యవధి రెండేళ్లు ఉంటుంది. అవసరమైతే గడువును మరో ఏడాది పొడిగిస్తారు. మొదటి రెండేళ్లకు నెలకు రూ.55,000 కన్సాలిడేటెడ్ పెలోషిప్ అందిస్తారు. మూడో సంవత్సరానికి నెలకు రూ.60,000 చొప్పున స్టైఫండ్ ఇస్తారు. ఇవి కాకుండా ఏడాదికి రూ.50 వేలు కాంటిన్‌జెన్సీ ఫండ్ ఇస్తారు. ఈ ప్రాజెక్టు కింద పరిశోధన కార్యకలాపాలు మాత్రమే కాకుండా డిపార్ట్మెంట్ ద్వారా నిర్వహించే ఇతర ప్రాజెక్టులు, అకడమిక్ బాధ్యతలను అభ్యర్థికి అప్పగిస్తామని ఐఐటీ రూర్కీ స్పష్టం చేసింది.

దరఖాస్తులను ఎలా పంపాలి?
పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ కోసం దరఖాస్తులను ఈమెయిల్ ద్వారా మాత్రమే ఐఐటీ రూర్కీకి పంపించాలి. ఇందులో అభ్యర్థులు సీవీ, కవర్ లెటర్, ఇంతకు ముందు పబ్లిష్ చేసిన రిసెర్చ్ పేపర్ల జాబితా, రిసెర్చ్‌లో అనుభవం, భవిష్యత్తు పరిశోధన ప్రణాళికలతో సహా రిసెర్చ్ స్టేట్‌మెంట్ వంటివన్నీ ఉండాలి.
Published by:Veera Babu
First published: