ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ (IIT Roorkee) జాతీయ స్థాయిలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న సంస్థ. భారతీయ డ్రోన్(Drone) ఎకోసిస్టమ్‌లో దేశీయ డ్రోన్ పైలట్‌ల(Drone Pilot) కోసం పెరుగుతున్న డిమాండ్‌ను సంయుక్తంగా పరిష్కరించడానికి పలు సంస్థలతో దీర్ఘకాలిక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. చెన్నైకి(Chennai) చెందిన ప్రముఖ డ్రోన్ కంపెనీ(Drone Company) గరుడ ఏరోస్పేస్(Aero Space), గుర్గావ్ చెందిన AGROB ఇందులో భాగస్వామ్య సంస్థలుగా ఉన్నాయి. పరస్పర ప్రయోజనం కోసం ప్రయత్నాలను సమన్వయం చేయడానికి, నిపుణుల సేవలను పొందేందుకు ఎంఓయూ(MOU)పై సంతకం చేసిన ఈ మూడు సంస్థలు, కలిసి పనిచేయడానికి త్రైపాక్షిక కూటమిగా ఏర్పడ్డాయి. సాంకేతిక, పరిశోధన రంగాలైన సాఫ్ట్‌వేర్(Software), రోబోటిక్స్(Robotics), డిజిటల్ సొల్యూషన్స్(Digital Solutions), డ్రోన్ పైలట్ ట్రైనింగ్, డెమో వంటి వాటిల్లో అప్‌కమింగ్ డ్రోన్ టెక్నాలజీని ప్రమోట్ చేయడం కోసం ఈ మూడు సంస్థలు కలిసి పనిచేయనున్నాయి. అలాగే AI-ఆధారిత పరిష్కారాల కోసం ఉమ్మడి (పైలట్) ప్రాజెక్టులను చేపట్టేందుకు ఈ మూడు సంస్థలు చొరవ తీసుకోనున్నాయి.
మూడు సంస్థల ప్రధాన విధులు
ఐఐటీ రూర్కీIIT రూర్కీ, అప్లికేషన్-బేస్డ్ సొల్యూషన్స్‌ను అందించనుంది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన విషయాలను పర్యవేక్షిస్తుంది. ఆగ్రోబ్, గరుడు సంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆప్లికేషన్లను అమలు చేయనున్నాయి.
ఆగ్రోబ్ఇది వ్యవసాయానికి సంబంధించిన టెక్నికల్ ప్రొడక్ట్స్, సేవలను నిర్మించడంపై ప్రధానంగా దృష్టి సారిస్తుంది. ఎగుమతి-దిగుమతి, ఇ-మార్కెట్‌ప్లేస్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా తన ఉనికిని చాటుకుంది. సరికొత్త పరిశోధన మద్దతుతో తక్కువ ఖర్చుతో కూడిన డ్రోన్‌లను తయారు చేయడం, విక్రయించడం, సర్వీస్ చేయడం అలాగే మానవరహిత వైమానిక వాహనాల (UAV) పరిశ్రమలో డ్రోన్ పైలట్ శిక్షణను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా డ్రోన్ ఇంటిగ్రేషన్ అండ్ అడాప్షన్ ఖర్చు సమర్థవంతమైన నిర్వహణకు కృషి చేయనుంది.
గరుడ ఏరోస్పేస్ వివిధ అప్లికేషన్‌ల కోసం మానవరహిత వైమానిక వాహనాలు లేదా డ్రోన్‌ల డిజైన్, రూపకల్పనపై ఇది దృష్టి పెడుతుంది. వ్యవసాయ సర్వే, మ్యాపింగ్, నిఘా వంటి విభిన్న అవసరాలను తీర్చడం కోసం పనిచేయనుంది. డ్రోన్ పైలట్ శిక్షణ, డ్రోన్ల విక్రయం, డెమోలను కూడా నిర్వహిస్తుంది గరుడ ఏరోస్పేస్.IIT రూర్కీ డైరెక్టర్ ప్రొఫెసర్ అజిత్ కె చతుర్వేది మాట్లాడుతూ.. ఈ మూడు సంస్థల భాగస్వామ్యం వినూత్న పరిష్కారాలను అందించడం ద్వారా డ్రోన్‌ల సహకార అభివృద్ధిని మేక్ ఇన్ ఇండియా మరింత సులభతరం చేస్తుందన్నారు. హార్డ్‌వేర్, డ్రోన్ ఫ్లయింగ్ స్ట్రాటజీల అభివృద్ధిలో విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు.
గరుడ ఏరోస్పేస్ వ్యవస్థాపకుడు అగ్నిశ్వర్ జయప్రకాష్ మాట్లాడుతూ.. 2023 నాటికి మేక్ ఇన్ ఇండియా ద్వారా లక్ష డ్రోన్‌లను తయారు చేయాలనే తమ కంపెనీ లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగు పడిందన్నారు. అందుకు ఈ త్రైపాక్షిక కూటమిగా వేదికగా కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ త్రైపాక్షిక కూటమి సహకారంతో తదుపరి తరానికి డ్రోన్ యుగం విప్లవాన్ని తీసుకురానుందని AGROB వ్యవస్థాపకుడు హర్ష్ ఉపాధ్యాయ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా డ్రోన్‌ల వినియోగంపై రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5g technology, Career and Courses, Drone technology, Technology