మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యావ్యవస్థలోనూ అనేక మార్పులొస్తున్నాయి. యూనివర్సిటీలు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కొత్త కొత్త కోర్సులను (New Courses) ప్రారంభిస్తున్నాయి. తాజాగా, దేశంలోనే ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) రూర్కీ క్లౌడ్‌ఎక్స్‌ల్యాబ్ (CloudxLab) సంస్థతో కలిసి కొత్తగా మూడు ఆన్‌లైన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్ ప్రోగ్రామ్‌లను (PG Certificate Courses) ప్రారంభించింది. డేటా సైన్స్ (Data Science), మెషిన్ లెర్నింగ్ (Machine Learning), డీప్ లెర్నింగ్ (Deep Learning), MLOps టెక్నాలజీస్‌లో విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో ఈ కోర్సులను ప్రారంభించింది. ఈ మూడు పీజీ సర్టిఫికెట్ కోర్సుల ద్వారా విద్యార్థులకు సమగ్రమైన హ్యాండ్- ఆన్- ఓరియెంటెడ్ లెర్నింగ్‌పై లోతైన అవగాహన ఏర్పడుతుంది.
అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసిన ఎవరైనా ఈ కోర్సులలో చేరడానికి అర్హులు. ఈ కోర్సు పూర్తిగా ఆన్లైన్లోనే అందిస్తున్నారు. అయితే, కోర్సులో భాగంగా ఒక వారం పాటు ఐఐటి రూర్కీ క్యాంపస్‌లో క్యాంపస్ ఇమ్మర్షన్ ప్రోగ్రామ్‌ని కూడా అనుభవించవచ్చు. కోర్సులో చేరిన విద్యార్థులకు పూర్తిగా ఆన్‌లైన్ క్లౌడ్ ల్యాబ్ యాక్సెస్ లభిస్తుంది. తద్వారా వారు కోర్సులో చేరిన మొదటి రోజు నుంచే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఈ కోర్సులకు సంబంధించిన మొదటి బ్యాచ్‌లు నవంబర్ 7 న ప్రారంభమవుతాయి. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 26 లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. cloudxlab.com/pg/iitr వెబ్సైట్లో దరఖాస్తులను సమర్పించాలి.
South Indian Bank Jobs 2021: సౌత్ ఇండియన్ బ్యాంక్‌లో ఉద్యోగాలు... రూ.63,840 వేతనం
ఈ కొత్త ఆన్‌లైన్ కోర్సులపై ఐఐటి రూర్కీ కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ రక్షా శర్మ మాట్లాడుతూ, ‘‘విద్యార్థులను ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ఈ కొత్త కోర్సులు ప్రారంభించాం. ఈ కోర్సుల ద్వారా సమగ్రమైన హ్యాండ్-ఆన్ -ఓరియెంటెడ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇది మీ ప్రొఫైల్‌కు గొప్ప విలువను జోడిస్తుంది. ఉద్యోగ వేటలో మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఐటీ ఇండస్ట్రీకి అవసరమయ్యే లేటెస్ట్ సిలబస్, మాడ్యూల్స్‌తో ఈ కోర్సులను డిజైన్ చేశాం. ఆన్లైన్లోనే అందిస్తుండటంతో సాధారణ డిగ్రీ విద్యార్థులు సైతం ఈ కోర్సులను నేర్చుకోవచ్చు.”అని అన్నారు.
Jobs in Network18: మీడియాలో జాబ్ మీ కలా? నెట్వర్క్18 లో ఫ్రెషర్ ఉద్యోగాలకు అప్లై చేయండి ఇలా
కాగా, ప్రస్తుత టెక్నాలజీ యుగంలో పెరుగుతున్న డిమాండ్‌ను పరిష్కరించే విధంగా ఈ కోర్సులను డిజైన్ చేశారు. డేటా సైన్స్, మెషీన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ వంటి లేటెస్ట్ టెక్నాలజీస్‌లో లోతైన అవగాహన ఏర్పర్చుకోవచ్చు. ఈ టెక్నాలజీస్‌లో రోజురోజుకూ ఉద్యోగాల సంఖ్య కూడా పెరుగుతోంది. వాటిని అందిపుచ్చుకోవడంలో ఈ కోర్సులు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IIT, Online classes, Online Education