ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (Indian Institute of Technology) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ (Notification) ద్వారా ఒప్పంద ప్రాతిపదికన నాన్‌టీచింగ్ (Non Teaching) ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ విభాగంలో డిప్యూటీ రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, టెక్నికల్ ఆఫీసర్ (Technical Officer), మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్), ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్, పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల ఆధారంగా వేతనం రూ.35,000 నుంచి రూ.2,09,200 వరకు ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ (Online) ద్వారా ఉంటుంది. దరఖాస్తు వివరాలు, నోటిఫికేషన్ సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ https://www.iitmandi.ac.in/administration/recruitment.php ను సందర్శించాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి డిసెంబర్ 3, 2021 వరకు అవకాశం ఉంది.
పోస్టుల సమాచారం అర్హతలు..
పోస్టు పేరు | అర్హతలు | ఖాళీలు | వేతనం |
డిప్యూటీ రిజిస్ట్రార్ (Deputy Registrar) | గుర్తింపు పొందిన యూనివర్సిటీలో 55శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి. అసిస్టెంట్ పొఫెసర్‌గా 9 సంవత్సరాల అనుభవం ఉండాలి. గరిష్ట వయసు 50 ఏళ్లు మించి ఉండకూడదు. | 01 | L-12:(రూ.78,800-రూ.2,09,200) |
అసిస్టెంట్ రిజిస్ట్రార్ (Assistant Registrar) | గుర్తింపు పొందిన యూనివర్సిటీలో 55శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి. అసిస్టెంట్ పొఫెసర్‌గా 7 సంవత్సరాల అనుభవం ఉండాలి. గరిష్ట వయసు 40 ఏళ్లు మించి ఉండకూడదు. | 04 | L-10:(రూ.56,100-రూ.1,77,500) |
టెక్నికల్ ఆఫీసర్ (Technical Officer) | బీఈ, బీటెక్, ఎంఎస్సీ, ఎంసీఏ చేసి 5 సంవత్సరాలు పని అనుభవం ఉండాలి.లేదాఎంటెక్ చేసి ఒక సంవత్సరం పని అనుభవం ఉండాలి. గరిష్ట వయసు 40 ఏళ్లు మించి ఉండకూడదు. | 01 | L-10:(రూ.56,100-రూ.1,77,500) |
మెడికల్ ఆఫీసర్ (Medical Officer) | ఎంబీబీఎస్ చేసి మూడు సంవత్సరాల వృత్తి అనుభవం ఉండాలి. లేదా వైద్యరంగంలో పీజీ చేసి ఒక సంవత్సరం వృత్తి అనుభవం ఉండాలి. గరిష్ట వయసు 40 ఏళ్లు మించి ఉండకూడదు. | 02 | L-10:(రూ.56,100-రూ.1,77,500) |
అసిస్టెంట్ ఇంజనీర్ (Assistant Engineer) (ఎలక్ట్రికల్) | గుర్తింపు పొందిన యూనివర్సిటీలో బ్యాచ్‌లర్ డిగ్రీ లేదా డిప్లమా ఇన్ ఇంజనీరింగ్ చేసి మూడేళ్లు అనుభవం ఉండాలి. గరిష్ట వయసు 35 ఏళ్లు మించి ఉండకూడదు. | 01 | L-07 (రూ.44,900-రూ.1,42,400) |
ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్ (Physical Training Instructor) | గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో బ్యాచ్‌లర్ లేదా మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి. గరిష్ట వయసు 35 ఏళ్లు మించి ఉండకూడదు. | 01 | L-06:(రూ.35,400-రూ.1,12,400) |
ఎంపిక విధానం..
- దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థికి స్క్రీనింగ్/స్కిల్/రాత పరీక్ష నిర్వహిస్తారు.
- ఎంపికైన అభ్యర్థికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
- ఇంటర్వ్యూలో ప్రతిభకనబర్చిన వారిని పోస్టులకు ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం..
Step 1 - దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా ఉంటుంది.
DCCB Recruitment 2021: కడప డీసీసీబీలో 75 ఉద్యోగాలు.. అర్హతలు, జీతం వివరాలు
Step 2 - ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://www.iitmandi.ac.in/administration/recruitment.php ను సందర్శించాలి.
Step 3 - నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవాలి. (నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి)
Step 4 - అనంతరం ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్ https://oas.iitmandi.ac.in/instituteprocess/hr/Default.aspx ను క్లిక్ చేయాలి.
Step 5 - New Registration ఆప్షన్‌పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాలి.
Step 6 - దరఖాస్తుకు రూ.100 ఫీజు చెల్లించాలి.
Step 7 - అప్లికేషన్ పూర్తయిన తరువాత దరఖాస్తు ఫాంను ప్రింట్ తీసుకొని దాచుకోవాలి.
Step 8 - దరఖాస్తుకు డిసెంబర్ 3, 2021 వరకు అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Govt Jobs 2021, IIT, Job notification, JOBS