దేశంలోని ప్రముఖ విద్యా సంస్థల్లో ఇండియన్ ఇనిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ముందు వరుసలో ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇటీవల దేశ వ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లో నాన్ టీచింగ్ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. తాజాగా ఐఐటీ మండి(IIT Mandi) లో ఉద్యోగాల భర్తీకి సంస్థ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 43 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అయితే కాంట్రాక్టు విభాగంలో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఎంపికైన అభ్యర్థులు నాలుగేళ్ల పాటు కాంట్రాక్టు పద్ధతిలో పని చేయాల్సి ఉంటుంది. అభ్యర్థుల పని తీరు ఆధారంగా వారిని రెగ్యులర్ చేసే అవకాశం ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు వారి విద్యార్హతల, అనుభవం, పోస్టు ఆధారంగా భారీ వేతనం అందించనున్నారు.
NHAI Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. NHAIలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..
విద్యార్హతల వివరాలు..
అధికారిక నోటిఫికేషన్ ప్రకారం ఈ ఉద్యోగాలకు బీఈ, బీటెక్, బ్యాచలర్ ఆఫ్ డిగ్రీ, మాస్టర్ డిగ్స్ చేసిన వారు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
ఖాళీల వివరాలు..
-టెక్నికల్ ఆఫీసర్ విభాగంలో 1 ఖాళీ ఉంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.56,100 నుంచి రూ.1,77,500 వరకు వేతనం చెల్లించనున్నారు.
-స్పోర్ట్స్ ఆఫీసర్ విభాగంలో 1 ఖాళీ ఉంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 56,100 నుంచి రూ.1,77,500 వరకు వేతనం చెల్లించనున్నారు.
-జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ విభాగంలో 5 ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు వేతనం చెల్లించనున్నారు.
-జూనియర్ సూపరింటెండెంట్ విభాగంలో 6 ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 35,400 నుంచి రూ.1,12,400 వరకు వేతనం చెల్లించనున్నారు.
-జూనియర్ సూపరింటెండెంట్(RajBhasha) విభాగంలో 1 ఖాళీ ఉంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.35, 400 నుంచి రూ.1,12,400 వరకు వేతనం చెల్లించనున్నారు.
-జూనియర్ ఇంజనీర్(సివిల్ ) విభాగంలో మరో 3 ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు నెలకు రూ. 34,400 నుంచి రూ.1,12,400 వరకు వేతనం చెల్లించనున్నారు.
-జూనియర్ లాబరేటరీ అసిస్టెంట్(టెక్నికల్) విభాగంలో 14 ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.25,500 నుంచి రూ.81,100 వరకు వేతనం చెల్లించనున్నారు.
-జూనియర్ అసిస్టెంట్ విభాగంలో 12 ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.21,700 నుంచి రూ. 69,100 వరకు వేతనం చెల్లించనున్నారు.
Official Website - Direct Link
Official Notification - Direct Link
ఎలా అప్లై చేయాలంటే..
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్లో జూన్ 4వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అభ్యర్థులు సెల్ఫ్ అటెస్ట్ చేసిన అర్హత, అనుభవం, డేట్ ఆఫ్ బర్త్, కుల ధ్రువీకరణ తదితర పత్రాలకు అప్ లోడ్ చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. అభ్యర్థులు పరీక్ష ఫీజుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Government jobs, IIT, Job Mela, Job notification, JOBS