దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఐఐటీ ఒకటి అన్న విషయం తెలిసిందే. ఈ ఐఐటీల్లో ఇటీవల తరచుగా టీచింగ్, నాన్ టీచింగ్ నియామకాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఉద్యోగం సాధించే అభ్యర్థులు వారికి వేలు, లక్షల్లో వేతనాలు పొందే అవకాశం ఉంటుంది. దీంతో ఇక్కడ ఉద్యోగం సాధించడానికి పోటీ అధికంగా ఉంటుంది. తాజాగా ఐఐటీ భువనేశ్వర్ (IIT Bhubaneswar) ఉద్యోగాల నియామకం కోసం ప్రకటన విడుదల చేసింది. మొత్తం 32 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. అయితే ఇవన్నీ నాన్ టీచింగ్ కు సంబంధించినవే. ప్రిన్సిపల్ నెట్వర్క్ ఇంజనీర్ విభాగంలో 1 పోస్టు, అసిస్టెంట్ రిజిస్టర్-1, అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్(సివిల్)-1, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్-1, సిస్టెం అడ్మినిస్ట్రేటర్-1, ప్రోగ్రామర్-1, స్పోర్ట్ర్స్ ఆఫీసర్-1, ప్రైవేట్ సెక్రటరీ-1, సిస్టం మేనేజర్-1 పోస్టులను భర్తీ చేస్తున్నారు.
ఈ పోస్టులతో పాటు జూనియర్ హిందీ ఆఫీసర్-1, స్టాఫ్ నర్స్-1, జూనియర్ టెక్నికల్ సూరింటెండెంట్-3, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్ స్ట్రక్టర్-2, అసోసియేట్ సిస్టం అడ్మినిస్ట్రేటర్-1, అసిస్టెంట్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్-1, వెబ్ డవలపర్-1, జూనియర్ టెక్నీషియన్-5, జూనియర్ లాబరేటరీ అసిస్టెంట్-4, జూనియర్ అసిస్టెంట్-3 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఎంపికైన అభ్యర్థులకు వారి విద్యార్హత ఆధారంగా రూ. 2.09 లక్షల వరకు వేతనం చెల్లించనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
టెన్త్, ఇంటర్ అర్హతతోనే ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..
ఎవరు దరఖాస్తు చేసుకోవాలంటే..
ఈ పోస్టులకు బీఈ, బీటెక్, ఎమ్మెస్సీ, పీజీ డిప్లొమో, ఎంసీఏ, బ్యాచలర్ డిగ్రీని సంబంధిత సబ్జెక్టుల్లో చేసిన వారు అర్హులు. అనుభవం, ఇతర విద్యార్హతల వివరాలను నోటిఫికేషన్లో చూసుకోవచ్చు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు జనవరి 15లోగా ఐఐటీ భువనేశ్వర్ అధికారిక వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుతో పాటు పలు విద్యార్హతల సర్టిఫికేట్ల స్కానింగ్ కాపీలను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ హార్డ్ కాపీలను జనవరి 29లోగా స్పీడ్ పోస్టులో పంపించాల్సి ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.