హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

IIT Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. ఐఐటీ తిరుపతిలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి

IIT Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. ఐఐటీ తిరుపతిలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇండియన్ ఇనిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(IIT) దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థలుగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. అయితే ఈ విద్యాసంస్థలు ఉద్యోగ నియామక ప్రకటనలు సైతం వరుసగా విడుదల చేస్తున్నాయి.

ఇండియన్ ఇనిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(IIT) దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థలుగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. అయితే ఈ విద్యాసంస్థలు ఉద్యోగ నియామక ప్రకటనలు సైతం వరుసగా విడుదల చేస్తున్నాయి. తాజాగా ఐఐటీ తిరుపతి పలు ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 24 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఇందులో ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజినీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్, డిప్యూటీ లైబ్రేరియన్, హార్టికల్చర్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, జూనియర్ టెక్నీషియన్, డిప్యూటీ రిజిస్టర్ తదితర పోస్టులు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులకు వారి అనుభవం, విద్యార్హత ఆధారంగా నెలకు రూ. 2,11,500 వరకు వేతనం చెల్లించనున్నారు.

ఎవరు అప్లై చేయాలంటే..

-ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్(సివిల్) విభాగంలో ఒక ఖాళీని భర్తీ చేయనున్నారు. సివిల్ ఇంజనీరింగ్ లో బీఈ, బీటెక్ చేసి ఆ విభాగంలో ఎనిమిదేళ్ల అనుభవం కలిగిన వారు దరఖాస్తుకు అర్హులు

-రెండు అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. సివిల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో బీఈ, బీటెక్ చేసిన వారు దరఖాస్తుకు అర్హులు. సంబంధిత విభాగంలో ఐదేళ్ల అనుభవం ఉండాలి.

-మూడు టెక్నికల్ ఆఫీసర్ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. సీఎస్సీ, ఈసీ, ఐటీ, సాఫ్ట్ వేర్ సైన్సెస్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఈఈఈ తదితర సబ్జెక్టుల్లో బీఈ, బీటెక్, ఎంఎస్సీ చేసిన వారు దరఖాస్తుకు అర్హులు. ఇతర వివరాలను నోటిఫికేషన్లో చూసుకోవచ్చు.

-ఒక మెడికల్ ఆఫీసర్ పోస్టును సైతం ప్రస్తుతం భర్తీ చేస్తున్నారు. ఎంబీబీఎస్ డిగ్రీతో పాటు మూడేళ్ల అనుభవం కలిగిన వారు దరఖాస్తుకు అర్హులు.

-ఇతర పోస్టులు అర్హతల వివరాలను నోటిఫికేషన్లో చూసుకోవచ్చు.

ఎలా అప్లై చేయాలంటే

-అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు IIT తిరుపతి అధికారిక వైబ్ సైట్లో జనవరి 29లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రూ.200 అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

Official Notification

First published:

Tags: Andhra Pradesh, IIT, Tirupati

ఉత్తమ కథలు