IIT Recruitment 2020: నిరుద్యోగులకు శుభవార్త.. IITలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

ప్రతీకాత్మక చిత్రం

దేశంలోనే ప్రసిద్ధి చెందిన విద్యా సంస్థ ఐఐటీ అన్న విషయం తెలిసిందే. తాజాగా ఐఐటీ డిల్లీ(IIT Delhi) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

 • Share this:
  దేశంలోనే ప్రసిద్ధి చెందిన విద్యా సంస్థ ఐఐటీ అన్న విషయం తెలిసిందే. తాజాగా ఐఐటీ డిల్లీ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ విభాగాల్లో దాదాపు 13 పోస్టులను భర్తీ చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. వీరికి పోస్టు ఆధారంగా రూ. 79 వేల వరకు వేతనం చెల్లించనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 10 ఆఖరు తేదీ. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ రోజు సాయంత్రం 5 గంటల లోగా దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.

  ఎవరు దరఖాస్తు చేసుకోవాలంటే..

  సీనియర్ ప్రాజెక్ట్ సైంటిస్ట్: ఈ విభాగంలో మొత్తం రెండు ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఫస్ట్ క్లాస్ లో PhD పూర్తి చేసిన వారు దరఖాస్తుకు అర్హులు. కావాల్సిన అనుభవం, ఇతర అర్హత వివరాలను నోటిఫికేషన్లో చూసుకోవచ్చు.
  ప్రాజెక్ట్ అసిస్టెంట్: గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసి సీనియర్ అసిస్టెంట్ గా ఐదేళ్ల అనుభవం కలిగిన వారు దరఖాస్తుకు అర్హులు. ఈ విభాగంలో ఒక పోస్టు భర్తీ చేస్తున్నారు.
  ప్రాజెక్టు సైంటిస్ట్: బీఈ, బీటెక్ ఫస్ట్ క్లాస్ లో పూర్తి చేసి ఆరేళ్ల అనుభవం కలిగిన వారు దరఖాస్తుకు అర్హులు. ఈ విభాగంలో ఒక పోస్టును భర్తీ చేస్తున్నారు.
  జూనియర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్: ఫస్ట్ క్లాస్ లో మెకానికల్ సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేట్ డిగ్రీని పూర్తి చేసిన వారు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ విభాగంలో ఒక పోస్టును భర్తీ చేయనున్నారు. ఇతర వివరాలను నోటిఫికేషన్ లో చూసుకోవచ్చు.

  జూనియర్ ప్రాజెక్ట్ అటెండెంట్: ఈ విభాగంలో ఒక పోస్టును భర్తీ చేస్తున్నారు. పదో తరగతి పూర్తి చేసిన వారు దరఖాస్తుకు అర్హులు. ఈ విభాగంలో ఒక పోస్టును భర్తీ చేస్తున్నారు.
  ప్రాజెక్టు సైంటిస్ట్: ఫస్ట్ క్లాస్ లో ఎంటెక్ పూర్తి చేసి మూడేళ్ల అనుభవం కలిగిన వారు దరఖాస్తుకు అర్హులు. ఈ విభాగంలో రెండు పోస్టులను భర్తీ చేస్తున్నారు.
  జూనియర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్: ఈ విభాగంలో ఒక పోస్టు భర్తీ చేస్తున్నారు. గ్రాడ్యుయేట్ డిప్లోమా పూర్తి చేసి అనుభవం కలిగిన వారు అర్హులు
  సీనియర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్: బీఈ, బీటెక్ పూర్తి చేసిన వారు ఈ పోస్టుకు అర్హులు. ఇతర వివరాలను నోటిఫికేషన్లో చూసుకోవచ్చు. ఈ విభాగంలో ఒక పోస్టును భర్తీ చేస్తున్నారు.
  ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ సైంటిస్ట్: ఈ విభాగంలో మొత్తం మూడు పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఎంటెక్ ఫస్ట్ క్లాసులో పూర్తి చేసి ఆరేళ్ల అనుభవం కలిగిన వారు దరఖాస్తుకు అర్హులు. ఇతర వివరాలు నోటిఫికేషన్లో ఉన్నాయి.

  ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

  అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు IIT డిల్లీ అధికారిక వెబ్ సైట్ నుంచి దరఖాస్తులను డౌన్ లోడ్ చేసుకోవాలి. అనంతరం ఆ దరఖాస్తులను నింపి crfiitdrecruitment@gmail.com వెబ్ సైట్ కు పంపించాల్సి ఉంటుంది. దరఖాస్తులను డిసెంబర్ 10 సాయంత్రం 5 గంటల లోపు పంపించాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
  Download Application-Direct Link
  Official Notification
  Published by:Nikhil Kumar S
  First published: