హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

IIT Patna: ఐఐటీ పాట్నా నుంచి ఆరు కొత్త కోర్సులు.. అడ్మిషన్ ఇలా పొందవచ్చు..

IIT Patna: ఐఐటీ పాట్నా నుంచి ఆరు కొత్త కోర్సులు.. అడ్మిషన్ ఇలా పొందవచ్చు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

IIT Patna: కంప్యూటర్ సైన్స్ (Computer Science), బిజినెస్ మేనేజ్‌మెంట్ (Business Management)స్ట్రీమ్స్‌లో మూడు చొప్పున కొత్త ప్రోగ్రామ్‌లను త్వరలోనే ప్రారంభించనుంది. మూడు సంవత్సరాల యూజీ పోగ్రామ్‌ను 10+2 పాస్ అవుట్ విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేశారు.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ(NEP-2020)కి అనుగుణంగా ఆరు కొత్త ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్‌(Courses)ను ప్రారంభించేందుకు ఐఐటీ పాట్నా (IIT Patna) కసరత్తు చేస్తోంది. ఈమేరకు కంప్యూటర్ సైన్స్ (Computer Science), బిజినెస్ మేనేజ్‌మెంట్ (Business Management)స్ట్రీమ్స్‌లో మూడు చొప్పున కొత్త ప్రోగ్రామ్‌లను త్వరలోనే ప్రారంభించనుంది. మూడు సంవత్సరాల యూజీ పోగ్రామ్‌ను 10+2 పాస్ అవుట్ విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేశారు. జేఈఈ మెయిన్ (JEE Main), సీయూసీఈటీ (CUCET), ఎస్‌ఏటీ(యూఎస్), ఎన్‌టీఎస్‌ఈ, కేవీపీవై, ఇన్‌స్పైర్, స్టేట్ లెవల్ ఎంట్రన్స్, ఐఐటీపీ-ఎస్‌ఏటీ వ్యాలిడ్ స్కోర్ ఆధారంగా ఈ ప్రోగ్రామ్‌లో అడ్మిషన్ పొందవచ్చు. ప్రపంచ‌వ్యాప్తంగా ప్రతి పరిశ్రమలో డిమాండ్ అనుగుణంగా నైపుణ్యాలను అందించడం కోసం ఈ ప్రోగ్రామ్‌లను డిజైన్ చేసినట్లు ఐఐటీ పాట్నా పేర్కొంది.

ICAI, ICSE, CIMA, ACCA, CPA, NSE వంటి ప్రొఫెషనల్ బాడీ ఫ్రేమ్‌వర్క్ కోర్సుల డిజైన్ అవసరాలతో సమానంగా ఈ ప్రోగ్రామ్‌ను బ్యాలెన్స్ చేశారు. ఇతర ప్రోగ్రామ్‌లోని డే స్కాలర్‌లను ఎనేబుల్ చేయడానికి ‘హైబ్రిడ్ మోడ్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్’ అనేది ఈ ప్రోగ్రామ్ యూనిక్ ఫీచర్. అండర్ గ్రాడ్యుయేట్ హైబ్రిడ్ ప్రోగ్రామ్స్ కోసం అడ్మిషన్స్ ఓపెన్ అయ్యాయి. వాటి వివరాలు ఇలా..

* కంప్యూటర్ సైన్స్

B.Sc. (ఆనర్స్): కంప్యూటర్ సైన్స్ అండ్ డేటా అనలిటిక్స్ (CSDA)

B.Sc. (ఆనర్స్): ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ (AICS)

B.Sc. (ఆనర్స్): మ్యాథ్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ (MCS)

* బిజినెస్ మేనేజ్‌మెంట్

B.Sc. (ఆనర్స్): అకౌంటింగ్ అండ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ (AFM)

B.Sc. (ఆనర్స్): బిజినెస్ మేనేజ్‌మెంట్ అండ్ అనలిటిక్స్ (BMA)

బ్యాచిలర్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (BBA)

* ప్రోగ్రామ్ ఫీచర్స్

- నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ- 2020 ఫ్రేమ్‌వర్క్ నిర్మాణానికి పూర్తిగా అనుగుణంగా ఉంటుంది.

- పరిశ్రమ నైపుణ్యం-ఆధారిత పాఠ్యాంశాలు, కోర్సు నిర్మాణం

- అంతర్జాతీయంగా ఆమోదించిన కోర్సు క్రెడిట్ నిర్మాణం (US/UK/EU)

- కోర్సులను లెర్నింగ్ అవుట్‌కమ్ పరిశ్రమ డిమాండ్‌తో మ్యాప్ చేశారు.

- బిజినెస్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్ పాఠ్యప్రణాళిక, కోర్సు నిర్మాణం.. జాతీయ, అంతర్జాతీయ వృత్తిపరమైన సంస్థల(ICAI, ICSI, ACCA, NSE, CIMA) అర్హతలతో బ్యాలెన్స్ చేశారు.

- ఐఐటీ పాట్నా ద్వారా దేశంలో ఇటువంటి ప్రోగ్రామ్‌ ప్రారంభించడం ఇదే మొదటిసారి.

- తక్కువ ఫీజుతో ప్రపంచ ప్రమాణాలతో సమానంగా అందిస్తున్న డిగ్రీ ప్రోగ్రామ్ పాఠ్యాంశాలు.

ఇది కూడా చదవండి : ఇలా పని చేస్తే మీకు ప్రమోషన్ గ్యారెంటీ.. ఉద్యోగుల కోసం ఈ టిప్స్.. ఓ లుక్కేయండి

రెండు స్ట్రీమ్‌లలోని ఒక్కో ప్రోగ్రామ్‌కు 250 మంది చొప్పున మొత్తంగా 1500 మంది విద్యార్థులను తీసుకుంటారు. కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్, మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌లకు సెమిస్టర్ ఫీజు వరుసగా రూ. 40,000, రూ.50,000గా నిర్ణయించారు. మూడేళ్ల డిగ్రీ ప్రోగ్రామ్‌ను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత, అభ్యర్థులకు ఐఐటీ పాట్నా పూర్వ విద్యార్థుల హోదాను అందజేస్తారు. అయితే, క్రెడిట్ బ్యాంక్ సదుపాయంతో తర్వాత మళ్లీ ప్రవేశించే అవకాశంతో ప్రతి సంవత్సరం ఎంట్రీ, ఎగ్జిట్‌కు అవకాశం ఉంటుంది

Published by:Sridhar Reddy
First published:

Tags: CAREER, Career and Courses, EDUCATION, IIT, JOBS

ఉత్తమ కథలు