Home /News /jobs /

IIT MANDI RECRUITMENT APPLY FOR REGISTRAR AND NON TEACHING POSTS KNOW FULL DETAILS HERE VB

IIT Recruitment 2022: ఐఐటీలో ఉద్యోగ ఖాళీలు.. నాన్ టీచింగ్ తో పాటు ఇతర పోస్టులు..

IIT Recruitment 2022: ఐఐటీలో ఉద్యోగ ఖాళీలు.. నాన్ టీచింగ్ తో పాటు ఇతర పోస్టులు..

IIT Recruitment 2022: ఐఐటీలో ఉద్యోగ ఖాళీలు.. నాన్ టీచింగ్ తో పాటు ఇతర పోస్టులు..

IIT Recruitment 2022: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ IIT మండి నుంచి పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఆగస్టు 27 వరకు ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Secunderabad, India
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ IIT మండి నుంచి పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. రిజిస్ట్రార్ అండ్ ఇతర నాన్-అకడమిక్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పోస్టుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు ఆగస్టు 27 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. దీని కోసం వారు అధికారిక వెబ్‌సైట్ iitmandi.ac.in ని సందర్శించాలి. రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 16 ఖాళీలను భర్తీ చేస్తారు. ఇందులో 1 రిజిస్ట్రార్ అండ్ 15 ఇతర నాన్ అకడమిక్ పోస్టులు ఉన్నాయి.

UPSC Recruitment 2022: యూపీఎస్సీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్.. అర్హత, దరఖాస్తు విధానం ఇలా..


దరఖాస్తు ఫీజు..
అభ్యర్థులు రూ.100 దరఖాస్తు ఫీజు చెల్లించాలి.

అర్హతలు..
రిజిస్ట్రార్ పోస్టులకు మాస్టర్ డిగ్రీతో పాటు.. 15 ఏళ్ల అనుభవం మరియు మేనేజ్ మెంట్ ఏరియాలో ఇంజనీరింగ్ లేదా లా చేసి ఉండాలి. ఇతర పోస్టులకు ఎంసీఏ, ఇంజనీరింగ్ ఐటీ, సీఎస్ఈ, ఎలక్ట్రికల్ డిగ్రీలు పూర్తి చేసి ఉండాలి.



దరఖాస్తు ప్రక్రియ ఇలా..

-ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే.. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ iitmandi.ac.in ను సందర్శించాలి.

-దీని తర్వాత.. మీరు హోమ్ పేజీలో ఇచ్చిన కెరీర్ ట్యాబ్‌కు వెళ్లాలి. ప్రస్తుత ఖాళీపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత సంబంధిత రిక్రూట్‌మెంట్ ప్రక్కన ఇవ్వబడిన ఆన్‌లైన్‌లో దరఖాస్తు లింక్‌కి వెళ్లి దరఖాస్తు ఫారమ్‌ను పూరించాలి.

-దరఖాస్తు ఫీజు చెల్లించి ప్రక్రియను ముగించాలి. చివరగా దరఖాస్తు ఫారమ్ ను డౌన్ లోడ్ చేసుకొని భవిష్యత్ అవసరాల కొరకు ప్రింట్ తీసుకొని దగ్గర ఉంచుకోవాలి.

-అభ్యర్థులు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను చూడటానికి .. ఆన్‌లైన్ లో దరఖాస్తును సమర్పించడానికి ఈ లింక్‌ను https://iitmandi.ac.in/new/recruitment సందర్శించవచ్చు.

దీనికి సంబంధించి రిజిస్ట్రార్ కు ఒక నోటిఫికేషన్.. ఇతర పోస్టులకు మరో నోటిఫికేషన్ విడుదల చేశారు.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, Central Government Jobs, IIT, JOBS, Non teaching

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు