Home /News /jobs /

IIT MANDI LAUNCHES FIVE DIFFERENT SHORT FREE COURSES FOR THIS STATE YOUTH GH SRD

IIT Mandi: ఐఐటీ మండీ నుంచి ఐదు షార్ట్ టర్మ్ కోర్సులు.. యువతలో ఇంజనీరింగ్ స్కిల్స్ పెంచడమే లక్ష్యం..

IIT Mandi: ఐఐటీ మండీ నుంచి ఐదు షార్ట్ టర్మ్ కోర్సులు.. యువతలో ఇంజనీరింగ్ స్కిల్స్ పెంచడమే లక్ష్యం..

IIT Mandi: ఐఐటీ మండీ నుంచి ఐదు షార్ట్ టర్మ్ కోర్సులు.. యువతలో ఇంజనీరింగ్ స్కిల్స్ పెంచడమే లక్ష్యం..

IIT Mandi: యువతలో స్కిల్స్ పెంపొందించడానికి ఇటీవల ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ప్రత్యేక కోర్సులు, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్‌‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. తద్వారా వారికి కెరీర్ అవకాశాలు మరింత మెరుగుపడుతున్నాయి. తాజాగా ఈ జాబితాలో ఐఐటీ మండీ చేరింది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
వర్క్‌ఫోర్స్‌లో యువతను చేర్చుకునేందుకు చాలా సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ ట్రెండ్‌కు తగ్గట్లు అనేక స్పెషల్ కోర్సు (Special Courses) లను అందిస్తున్నాయి ప్రముఖ విద్యాసంస్థలు. యువతలో స్కిల్స్ పెంపొందించడానికి ఇటీవల ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ప్రత్యేక కోర్సులు, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్‌‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. తద్వారా వారికి కెరీర్ అవకాశాలు మరింత మెరుగుపడుతున్నాయి. తాజాగా ఈ జాబితాలో ఐఐటీ మండీ (IIT Mandi) చేరింది. స్కిల్స్‌ కోసం విభిన్నమైన ఐదు షార్ట్‌టర్మ్ కోర్సులను ఆఫర్ చేస్తోంది. ఇందుకోసం హిమాచల్‌ప్రదేశ్ కౌశల్ వికాస్ నిగమ్ (HPKVN) అనే సంస్థ సహకారం అందించనుంది. * కోర్సుల వివరాలు హ్యాండ్స్-ఆన్ ట్రైనింగ్ ఆఫ్ కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్; ఫైనైట్ ఎలిమెంట్ మోడలింగ్ ఆఫ్ ఇంజనీరింగ్; హ్యాండ్స్-ఆన్ కోర్స్ ఆన్ ఎంబెడెడ్ సిస్టమ్స్‌; మోడల్ ప్రిడిక్టివ్ కంట్రోల్ ఫర్ ఇండస్ట్రియల్ సిస్టమ్; హ్యాండ్స్-ఆన్ కోర్స్ ఆన్ ప్రొడక్ట్ డిజైన్ అండ్ మ్యానుప్యాక్చర్.. వంటి ఐదు కోర్సులను ఐఐటీ మండీ ఆఫర్ చేస్తోంది. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఎవరైనా ఐఐటీ మండీ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. రియల్ లైఫ్ ఇంజనీరింగ్ ప్రాబ్లమ్స్ పరిష్కాల కోసం అవసరమైన స్కిల్స్‌ను ఈ కోర్సుల ద్వారా పెంపొందించి యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడమే తమ లక్ష్యమని ఐఐటీ మండీ పేర్కొంది. * ఉచిత వసతి సదుపాయాలు కోర్సుల వ్యవధి ఒక నెల మాత్రమే ఉంటుంది. రిజిస్ర్టేషన్‌కు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. పైగా ఎంపికైన వారికి ఉచిత ఆహారం, వసతి, బోధనా సామగ్రిని అందజేస్తుంది. ఐఐటీ మండీకి చెందిన సెంటర్ ఫర్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ (CCE) ఈ కోర్సులను పర్యవేక్షిస్తుంది. * ఆ రాష్ట్రానికి చెందిన వారు మాత్రమే.. తాజా కోర్సుల కోసం హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఐటీ, డిప్లొమా ఇంజనీర్లు, ఇంజనీరింగ్ విద్యార్థులు, ప్రాక్టీస్/వర్కింగ్ ఇంజనీర్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, పీహెచ్‌డీ విద్యార్థులు, సాంకేతిక సంస్థల ఉపాధ్యాయులు/ అధ్యాపకులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. కోర్సులను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత అభ్యర్థులకు IIT మండికి చెందిన సెంటర్ ఫర్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ ద్వారా పార్టిసిపేషన్ సర్టిఫికేట్ కూడా లభిస్తుంది. ఇది కూడా చదవండి : అక్టోబర్ 20 వరకు గేట్‌ అప్లికేషన్ కరెక్షన్ విండో ఓపెన్.. ఆందోళన అక్కర్లేదు..! * ఇంజనీరింగ్‌లోని నిర్దిష్ట విభాగాల లక్ష్యంగా .. కోర్సుల ప్రారంభం సందర్భంగా ప్రత్యేకంగా మాట్లాడారు సెంటర్ ఫర్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ (CCE) హెడ్, ప్రొఫెసర్ తుషార్ జైన్. రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (PRAYAS 1.0)పై స్కూల్ క్యాంప్‌లో మొదటి కోర్సు సక్సెస్ కావడంతో, తాజాగా మరో ఐదు కొత్త కోర్సులను ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఇందుకు సిమ్లాలోని HPKVN సహకారం అందించనుందన్నారు. హిమాచల్ ప్రదేశ్ యువత‌కు నైపుణ్యాలను మరింత అభివృద్ధి చేయడానికి ఈ కోర్సులు కీలకంగా వ్యవహరిస్తాయన్నారు. ఇంజనీరింగ్ విభాగాలలోని నిర్దిష్ట శాఖలను లక్ష్యంగా చేసుకుని ఈ కోర్సులను డిజైన్ చేసినట్లు ఆయన తెలిపారు.
Published by:Sridhar Reddy
First published:

Tags: Career and Courses, EDUCATION, IIT, JOBS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు