హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

IIT Mandi: ఐఐటీ మండి నుంచి స్పెషల్ కోర్సులు.. డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్‌లో సర్టిఫికేట్ కోర్సులు ప్రారంభం

IIT Mandi: ఐఐటీ మండి నుంచి స్పెషల్ కోర్సులు.. డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్‌లో సర్టిఫికేట్ కోర్సులు ప్రారంభం

డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్‌ కోర్సులు

డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్‌ కోర్సులు

డేటా సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్‌లో ఆరు నెలల సర్టిఫికేట్, తొమ్మిది నెలల అడ్వాన్స్‌డ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్‌ను ప్రారంభించింది ఐఐటీ మండి. నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NSDC) సాయంతో ఈ ప్రోగ్రామ్స్‌ను ఆఫర్ చేస్తోంది. 

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

ఇండస్ట్రీ అవసరాలను దృష్టిలో ఉంచుకుని, విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉండేలా సరికొత్త కోర్సులను డిజైన్ చేస్తున్నాయి ప్రముఖ విద్యా సంస్థలు. ఈ లిస్ట్‌లో ఐఐటీలు (IIT) ముందున్నాయి. అన్ని విభాగాల్లో జాబ్ (Jobs) మార్కెట్ డిమాండ్స్‌ తీర్చగలిగే స్పెషల్ సర్టిఫికేట్, ఆన్‌లైన్ కోర్సులను ఇన్‌స్టిట్యూట్స్ రూపొందిస్తున్నాయి. తాజాగా డేటా సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్‌లో ఆరు నెలల సర్టిఫికేట్, తొమ్మిది నెలల అడ్వాన్స్‌డ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్‌ను ప్రారంభించింది ఐఐటీ మండి. నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NSDC) సాయంతో ఈ ప్రోగ్రామ్స్‌ను ఆఫర్ చేస్తోంది.

ఈ కోర్సులు నవంబర్ మొదటి వారంలో ప్రారంభం కానున్నాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 15, 16 తేదీల్లో నిర్వహించే అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. కోర్సు పూర్తయిన తర్వాత ఐఐటీ మండి, NSDC సంయుక్తంగా ప్రోగ్రామ్ సర్టిఫికేట్‌ను జారీ చేస్తాయి

ఈరోజు నుంచి ఈ బ్యాంక్ కనిపించదు.. దీపావళి ముందు కస్టమర్లకు భారీ షాకిచ్చిన ఆర్‌బీఐ!

ఈ కోర్సుల ద్వారా అభ్యర్థులు డేటా సైన్స్‌‌లో స్ట్రాంగ్ ఫౌండేషన్ బిల్డ్ చేసుకోవచ్చు. అలాగే డేటా డ్రివెన్ డిసిజన్ మేకింగ్ కోసం మెషిన్ లెర్నింగ్‌లో ఫైథాన్ ద్వారా స్పెషలైజేషన్ చేయవచ్చని ఇన్‌స్టిట్యూట్ పేర్కొంది. ఐఐటీ మండి ఫ్యాకల్టీ సభ్యులు లైవ్ స్ట్రీమింగ్ సెషన్ల ద్వారా కోర్సును డెలివరీ చేయనున్నారు.

డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఇమేజ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లో ఉపయోగించే టూల్స్, టెక్నాలజీల ద్వారా బేసిక్ అండ్ అడ్వాన్స్‌డ్ స్కిల్స్ అభ్యర్థులకు నేర్పించడమే ఈ కోర్సుల లక్ష్యమని ఐఐటీ మండి పేర్కొంది.

ఎస్‌బీఐ కస్టమర్లకు శుభవార్త.. ఫోన్ కొంటే రూ.10 వేల డిస్కౌంట్!

ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన సెంటర్ ఫర్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ (సీసీఈ) హెడ్, ప్రొఫెసర్ తుషార్ జైన్ మాట్లాడుతూ.. ఐఐటీ మండి ప్రారంభించిన సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌లను వరల్డ్ వైడ్ ఇండస్ట్రీ డిమాండ్‌లకు అనుగుణంగా స్కిల్స్ పెంపొందించేలా డిజైన్ చేశామని చెప్పారు. స్కిల్ డెవలప్‌మెంట్ కోసం కొత్త మోడల్‌ను అనుసరిస్తున్నామని తెలిపారు. ‘విద్యార్థులు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఐఐటీ మండికి చెందిన బీ.టెక్ విద్యార్థుల మాదిరిగానే డేటా సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్‌లో కటింగ్ ఎడ్జ్ కాన్సెప్ట్స్ నేర్చుకునే ప్రత్యేక అవకాశాన్ని పొందనున్నారు. ఇండస్ట్రీలో పెరుగుతున్న డిమాండ్‌లకు అనుగుణంగా నైపుణ్యాలను అప్‌గ్రేడ్ చేయడానికి ఈ ప్రోగ్రామ్స్‌ను రూపొందించాం. ఈ కోర్సుల్లో చేరే విద్యార్థుల కెరీర్ బాగా వృద్ధి చెందుతుంది.’ అని చెప్పారు.

కోర్సులను విజయవంతంగా పూర్తిచేసిన తరువాత అభ్యర్థులు డేటా అనలిస్ట్, డేటా సైంటిస్ట్‌, బిజినెస్ అనలిస్ట్‌, బిజినెస్ ఇంటెలిజెన్స్ ప్రొఫెషనల్స్ అండ్ కన్సల్టెంట్స్‌గా కెరీర్ కొనసాగించవచ్చు. ఈ కోర్సులు ప్లేస్‌మెంట్ సపోర్ట్ అండ్ కెరీర్ గైడెన్స్‌తో పాటు వన్ ఆన్ వన్ స్టూడెంట్ మెంటార్‌షిప్‌ను కూడా అందిస్తుంది.

First published:

Tags: EDUCATION, JOBS, Students

ఉత్తమ కథలు