Home /News /jobs /

IIT MANDI INVITES START UP IDEAS TO INCUBATE WITH SEED FUNDING UP TO RS 50 LAKH HERE DETAILS NS GH

IIT Mandi: స్టార్టప్ ఐడియాలను ఇన్వైట్ చేస్తున్న ఐఐటీ మండి.. రూ.50 లక్షల వరకు సీడ్ ఫండింగ్‌.. వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మండి క్యాటలిస్ట్ (IIT Mandi Catalyst) 'స్టార్టప్ ఎక్స్‌ప్లోరేషన్ ప్రోగ్రామ్' ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఐఐటీ సంస్థ నెక్స్ట్ బ్యాచ్ కోసం స్టార్టప్స్, ఎస్పైరింగ్‌ పారిశ్రామికవేత్తల (Entrepreneurs) నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఇంకా చదవండి ...
ఈ నెలలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మండి క్యాటలిస్ట్ (IIT Mandi Catalyst) 'స్టార్టప్ ఎక్స్‌ప్లోరేషన్ ప్రోగ్రామ్' ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఐఐటీ సంస్థ నెక్స్ట్ బ్యాచ్ కోసం స్టార్టప్స్, ఎస్పైరింగ్‌ పారిశ్రామికవేత్తల (Entrepreneurs) నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బిజినెస్ (Business) బిల్డ్ చేసే విషయంలో హెల్ప్ చేసే ఈ ప్రోగ్రామ్ మూడు నెలల వ్యవధి కలిగి ఉంటుంది. ఏదైనా రంగం/ఫోకస్ ఏరియాకు సంబంధించి టెక్నాలజీ బేస్డ్ ఇన్నోవేటివ్ స్టార్టప్ ఐడియా కలిగిన భారతీయ పౌరులందరికీ ఈ ప్రోగ్రామ్ అందుబాటులో ఉంటుందని ఇన్‌స్టిట్యూట్ పేర్కొంది. ఆసక్తి ఉన్న స్టార్టప్‌లు https://iitmandicatalyst.typeform.com/to/V1MGkg లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. స్టార్టప్ ఎక్స్‌ప్లోరేషన్ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 15, 2022.

ఈ మూడు నెలల ప్రోగ్రామ్ లో స్టార్టప్‌ బిజినెస్ లు బిల్డ్ చేయడానికి హెల్ప్ అయ్యే బేసిక్ టాపిక్స్ పై ఇండస్ట్రీ మెంటార్లు, నిపుణులు గ్రూప్ మెంటరింగ్ సెషన్‌లు/వర్క్‌షాప్‌లను నిర్వహిస్తారు. అంతేకాదు ప్రోగ్రామ్ పూర్తయిన తర్వాత అభ్యర్థులు వివిధ ఫండింగ్ స్కీమ్స్ కి యాక్సెస్ పొందుతారు. ఈ ప్రోగ్రామ్ సెలక్షన్ ప్రాసెస్ మల్టీ స్టేజ్ ప్రాసెస్ గా ఉంటుంది. ఇందులో ఆన్‌లైన్ అప్లికేషన్, స్క్రీనింగ్, సెలక్షన్ ప్యానెల్‌కు పిచ్ చేయడం, ఫైనల్ డిస్కషన్ వంటివి ఉంటాయి. టెక్నాలజీ బేస్డ్ ఐడియాలు/స్టార్టప్స్ కాన్సెప్ట్ వాలిడేషన్ సాధించడంలో, మార్కెట్ సామర్థ్యాన్ని నిరూపించడంలో సహాయపడటం ఈ ప్రోగ్రామ్ ముఖ్య లక్ష్యం. ఇది 'స్టార్టప్ ఎక్స్‌ప్లోరేషన్ ప్రోగ్రామ్' 12వ బ్యాచ్ అని ఇన్‌స్టిట్యూట్ జతచేస్తుంది.
Business Idea - Farming: ఈ పండును సాగు చేస్తే ఎకరానికి అరకోటికి పైగా ఆదాయం.. ఎలానో తెలుసుకోండి

ఐఐటీ మండి క్యాటలిస్ట్ ఫ్యాకల్టీ ఇన్‌చార్జి డాక్టర్ పురాన్ సింగ్ మాట్లాడుతూ, “ఐఐటీ మండి క్యాటలిస్ట్ ఈ సంవత్సరం 100 స్టార్టప్‌లకు సపోర్ట్ ఇవ్వాల్సి ఉంది. ఎర్లీ స్టేజ్ ల్లో ఉండి ఐడియా వాలిడేషన్, ప్రోటోటైప్ డెవలప్‌మెంట్ కోసం సెర్చ్ చేస్తున్న స్టార్టప్‌లకు ఈ ప్రోగ్రామ్ చాలా అనుకూలంగా ఉంటుంది." అని తెలిపారు. హ్యూమన్-కంప్యూటర్ ఇంటరాక్షన్, బిల్డింగ్ ఫర్ ది హిమాలయాస్, ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబిలిటీ వంటి ఫోకస్ ఏరియాస్ నుంచి వచ్చిన ఐడియాలకి ఈ ప్రోగ్రామ్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది.
Business Ideas: అన్ని సీజన్స్‌లో చేయగలిగే అద్భుతమైన వ్యాపారం.. నెలకు లక్ష రూపాయలు పక్కా

“ఎక్స్‌ప్లోరేషన్ ప్రోగ్రామ్ విజయవంతంగా పూర్తిచేస్తే క్యాటలిస్ట్ తో అందుబాటులో ఉన్న వివిధ స్కీమ్స్ కింద వివిధ ఫండింగ్ ఆపర్చునిటీస్ కి తలుపులు తెరుచుకుంటాయి. ఇంక్యుబేటర్‌లో రూ. 50 లక్షల వరకు సీడ్ ఫండింగ్, రూ.10 లక్షల వరకు ప్రోటోటైపింగ్ ఫండింగ్ ఉంటుంది. అలాగే వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ-నిధుల పథకాల కింద నెలవారీ రూ.30,000 మద్దతుతో ఒక వ్యవస్థాపకుడు-నివాస కార్యక్రమం ఉంటుంది. ఇంకా, వాలిడేషన్ సాధించే లేదా మార్కెట్ ట్రాక్షన్‌ను చూపించే స్టార్టప్‌లు ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ దశ IIకి చేరుకుంటాయి" అని ఇన్‌స్టిట్యూట్ పేర్కొంది.
Published by:Nikhil Kumar S
First published:

Tags: IIT, Start-Up

తదుపరి వార్తలు