హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

IIT Madras: ఐఐటీ మద్రాస్‌లో మూడు కొత్త మాస్టర్స్ ప్రోగ్రామ్స్.. వచ్చే ఏడాది నుంచి ప్రారంభం

IIT Madras: ఐఐటీ మద్రాస్‌లో మూడు కొత్త మాస్టర్స్ ప్రోగ్రామ్స్.. వచ్చే ఏడాది నుంచి ప్రారంభం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్(IIT, Madras) మరో మూడు పీజీ కోర్సులను లాంచ్ చేస్తోంది. ఈ జాయింట్ మాస్టర్స్ ప్రోగ్రామ్స్ కోసం యూకే‌కు చెందిన బర్మింగ్‌హామ్ యూనివర్సిటీతో ఒప్పందం చేసుకుంది.

  • Trending Desk
  • Last Updated :
  • Chennai, India

నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ-2022కి అనుగుణంగా అకడమిక్ ఇన్స్టిట్యూట్స్ సరికొత్త కోర్సులను ప్రవేశపెడుతున్నాయి. జాబ్ మార్కెట్‌ డిమాండ్ తీర్చే కోర్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ముఖ్యంగా ఐఐటీల్లో ఇలాంటి కోర్సుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్(IIT, Madras) మరో మూడు పీజీ కోర్సులను లాంచ్ చేస్తోంది. ఈ జాయింట్ మాస్టర్స్ ప్రోగ్రామ్స్ కోసం యూకే‌కు చెందిన బర్మింగ్‌హామ్ యూనివర్సిటీతో ఒప్పందం చేసుకుంది. దీంతో ఈ రెండు యూనివర్సిటీలు అందించే సింగిల్ డిగ్రీ కోసం చెన్నై, బర్మింగ్ హామ్‌లో చదువుకోవచ్చు. ప్రధానంగా డేటా సైన్స్, ఎనర్జీ సిస్టమ్స్, బయో మెడికల్ ఇంజనీరింగ్‌పై ఈ రెండు యూనివర్సిటీలు జాయింట్ మాస్టర్స్ ప్రోగ్రామ్‌లను అందిస్తాయి.

డేటా సైన్స్, ఎనర్జీ సిస్టమ్స్, బయోమెడికల్ ఇంజినీరింగ్‌లో పొటెన్షియల్ రీసెర్చ్ పార్టనర్‌షిప్స్ ఎక్స్‌ఫ్లోర్ చేయడానికి అకడమిక్స్, రీసెర్చర్స్‌కు సపోర్ట్‌గా జాయింట్ రీసెర్చ్ ఫండ్‌ను కూడా ఈ రెండు ఇన్‌స్టిట్యూట్స్ క్రియేట్ చేయనున్నాయి. ఫస్ట్ జాయింట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ వచ్చే ఏడాది ప్రారంభం కావచ్చు.

వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్‌..

బర్మింగ్‌హామ్ యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఆడమ్ టిక్కెల్ మాట్లాడుతూ.. తమ సంస్థ గ్లోబల్ సివిక్ యూనివర్సిటీ, భారత్‌లో అర్ధవంతమైన ఎడ్యుకేషన్ , రీసెర్చ్ పార్ట్నర్‌షిప్ రూపొందించడానికి కట్టుబడి ఉందన్నారు. ఐఐటీ మద్రాస్, బర్మింగ్‌హామ్‌ యూనివర్సిటీ మధ్య ఈ ఇన్నోవేటివ్ జాయింట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ అనేవి రెండు దేశాల్లోని గ్లోబల్ లీడింగ్ ఇన్‌స్టిట్యూట్స్‌లో వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్‌ను అభ్యసించడానికి విద్యార్థులకు అవకాశాన్ని అందిస్తాయన్నారు.

విద్యార్థులకు అకడమిక్ ఫెక్సిబులిటీ..

జాయింట్ ప్రోగ్రామ్స్‌ను రెండు ఇన్‌స్టిట్యూట్‌ల క్యాంపస్‌ల్లో డెలివరీ చేయనున్నారు. ప్రతి ఇన్‌స్టిట్యూట్ జారీ చేసే అకడమిక్ క్రెడిట్స్ మ్యూచువల్ రికగ్నేషన్ ద్వారా ఒకే డిగ్రీ సర్టిఫికేట్‌కు దారి తీస్తుంది. ఐఐటీ, UK రస్సెల్ గ్రూప్ యూనివర్సిటీ మధ్య మాస్టర్స్ స్థాయిలో ఎడ్యుకేషన్ పార్టనర్‌షిప్ జరగడం ఇదే మొదటిసారని ఐఐటీ మద్రాస్ పేర్కొంది. గ్లోబల్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ భవిష్యత్తును నిర్వచించే డేటా సైన్స్, ఎనర్జీ సిస్టమ్స్, బయోమెడికల్ ఇంజినీరింగ్‌ వంటి రంగాల్లో లెర్న్, వర్క్ చేయడానికి విద్యార్థులకు అకడమిక్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుందని, తద్వారా ఎంతో ప్రయోజనం పొందుతారని ఐఐటీ మద్రాస్ పేర్కొంది.

మరింత ప్రయోజనం చేకూర్చేలా..

బర్మింగ్‌హామ్ యూనివర్సిటీ సహకారంతో విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చే ఒక అద్భుతమైన ఆఫర్‌ను అందించడానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్నామని ఐఐటీ మద్రాస్ ఇంటర్నేషనల్ అకడమిక్ ప్రోగ్రామ్స్ (గ్లోబల్ ఎంగేజ్‌మెంట్) ఫ్యాకల్టీ అడ్వైజర్, ప్రొఫెసర్ ప్రీతి అఘాలయం అన్నారు. ఐఐటీ మద్రాస్ డీన్ (గ్లోబల్ ఎంగేజ్‌మెంట్) ప్రొఫెసర్ రఘునాథన్ రంగస్వామి మాట్లాడుతూ.. బర్మింగ్‌హామ్ యూనివర్సిటీతో ఫలవంతమైన ఈ అనుబంధం సుదీర్ఘకాలంగా ఉంటుందని ఆశించారు. దానికి ఈ ప్రోగ్రామ్స్ గొప్ప ప్రారంభమన్నారు.

Published by:Nikhil Kumar S
First published:

Tags: Career and Courses, IIT Madras, JOBS

ఉత్తమ కథలు