IIT Madras: కొత్త కోర్సును ప్రారంభించిన ఐఐటీ మద్రాస్.. ఆన్లైన్లో అప్లై చేసుకోండిలా..

ప్రతీకాత్మక చిత్రం

టెక్నికల్ కోర్సులకు ప్రస్తుతం డిమాండ్ పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐఐటీ మద్రాసు కొత్త కోర్సులను ప్రారంభిస్తోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
టెక్నికల్ కోర్సులకు డిమాండ్ పెరుగుతున్న వేళ, ఐఐటీ మద్రాసు కొత్త కోర్సులను ప్రారంభిస్తోంది. సంస్థకు చెందిన రాబర్ట్ బాష్ సెంటర్ ఫర్ డేటా సైన్స్ అండ్ ఎఐ (RBCDSAI).. అప్లైడ్ డేటా సైన్స్ అండ్ మెషిన్ ఇంటెలిజెన్స్‌లో 12 నెలల పోస్ట్‌గ్రాడ్యుయేట్ స్థాయి అడ్వాన్స్‌డ్ ప్రోగ్రాంను తాజాగా ప్రారంభించింది. టాలెంట్‌స్ప్రింట్ సంస్థ పార్ట్నర్‌షిప్‌తో ఈ ప్రోగ్రాంను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆగస్టులో ప్రారంభమయ్యే పీజీ ప్రోగ్రాం మొదటి బ్యాచ్ కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. కోర్సు అర్హత, అప్లికేషన్ ఫీజు, ఇతర వివరాలు తెలుసుకోవడానికి iitm.talentsprint.com/adsmi/ వెబ్‌సైట్‌ చూడవచ్చు. ఆన్‌లైన్‌లోనే దీనికి సంబంధించిన అప్లికేషన్ సమర్పించవచ్చు. వచ్చే ఏడాది నాటికి డేటా సైన్స్, డేటా ఆర్కిటెక్చర్, డేటా ఎనాలసిస్, డేటా ఇంజనీరింగ్.. వంటి కోర్సులు మెరుగైన కెరీర్ మార్గాలుగా అవతరించనున్నాయని వరల్డ్ ఎకనామిక్ ఫోరం చెబుతోంది.
HCL Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. ప్రముఖ HCL సంస్థలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి
CBSE 10th Results: త్వరలో సీబీఎస్​ఈ పదో తరగతి ఫలితాలు.. మార్కులు ఎలా కేటాయిస్తారంటే..

2026 నాటికి ఈ రంగాలలో 11.5 మిలియన్ల కెరీర్ ఓపెనింగ్స్ ఉంటాయని యూఎస్ బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ సైతం అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఐఐటీ మద్రాసు ప్రారంభించిన కొత్త కోర్సుకు ప్రాధాన్యం ఏర్పడింది. కోర్సులో నమోదు చేసుకునే అభ్యర్థులకు RBCDSAI ఫ్యాకల్టీ, నిపుణులు డైరెక్ట్, ఇంటరాక్టివ్ ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తారు. ఫైనాన్స్, హెల్త్‌కేర్, మాన్యుఫ్యాక్చరింగ్, సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్, స్మార్ట్ సిటీస్.. వంటి విభిన్న ఇండస్ట్రీ డొమైన్‌లలో అభ్యర్థులు పట్టు సాధించేలా శిక్షణ ఉంటుంది.

మాస్టరింగ్ డేటా సైన్స్‌కు వ్యూహాత్మక విధానం అవసరమని చెబుతున్నారు RBCDSAI హెడ్, కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ రవీంద్రన్. పరిశ్రమలోని యువ నిపుణులు బలమైన ఫండమెంటల్స్‌ నేర్చుకోవాలని, వివిధ ఇండస్ట్రీ డొమైన్‌లలో వాస్తవ ప్రపంచ సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలపై దృష్టి పెట్టాలని సూచించారు. కొత్త కోర్సు, ఐఐటీ మద్రాసుతో ఒప్పందంపై టాలెంట్‌స్ప్రింట్ CEO, మేనేజింగ్ డైరెక్టర్ శంతను పాల్ స్పందించారు. అప్లైడ్ డేటా సైన్స్‌లో ప్రస్తుతం డిమాండ్, సరఫరా అంతరం ఎక్కువగా ఉంది. ఈ సమస్యను పరిష్కరించడానికి తాజా కోర్సును రూపొందించామని శంతను వివరించారు. డేటా సైన్స్ రంగంపై ఆసక్తి ఉన్న వృత్తి నిపుణులకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది అంటున్నరు ప్రోగ్రామ్ డైరెక్టర్ అరుణ్ రాజ్‌కుమార్. కేస్ స్టడీ ఆధారిత టీచింగ్ విధానం, ప్రోగ్రామ్ చివర్లో క్యాంపస్ విజిటింగ్ వంటి కార్యక్రమాలతో అభ్యర్థులు ప్రయోజనం పొందవచ్చని చెప్పారు.
Published by:Nikhil Kumar S
First published: