Semiconductors Degree: సెమీకండక్టర్స్, మైక్రోఎలక్ట్రానిక్స్ రంగాలలో భారత విద్యార్థులు రాణించేలా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) మద్రాస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంస్థ సెమీకండక్టర్లలో డ్యూయల్-డిగ్రీ ప్రోగ్రామ్ (Dual Degree Program) అభివృద్ధి చేయడానికి యూఎస్‌కి చెందిన పర్డ్యూ యూనివర్సిటీతో చేతులు కలిపింది. ఈ రెండు విద్యాసంస్థలు సెమీకండక్టర్లు (Semiconductors), మైక్రోఎలక్ట్రానిక్స్ (Microelectronics)లో విద్య, పరిశోధనలో సహకారానికి సంబంధించి గురువారం లెటర్ ఆఫ్ ఇంటెన్ట్‌పై సంతకం చేశాయి. సెమీకండక్టర్లలో ఈ డ్యూయల్-డిగ్రీ ప్రోగ్రామ్ ఇండస్ట్రీలో పెరుగుతున్న అవసరాలను తీర్చగల ఇన్నోవేటివ్, జాయింట్ యూనివర్సిటీల పాఠ్యాంశాలపై దృష్టి పెడుతుంది.
చిప్ ఇండస్ట్రీపై ఆసక్తి ఉన్నవారికి అవకాశం
ఈ సంస్థలు సెమీకండక్టర్ డివైజ్‌లు, చిప్ ఫాబ్రికేషన్, సర్క్యూట్, సిస్టమ్‌కు సంబంధించిన అంశాలపై బాగా ఆసక్తి ఉన్న అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం మాస్టర్స్ ప్రోగ్రామ్ తీసుకొచ్చాయి. మంచి అకాడమిక్ రికార్డు గల విద్యార్థులకు ఈ ప్రోగ్రామ్ అనుకూలంగా ఉంటుంది. ఇది నైపుణ్యం గల ప్రతిభావంతులను చిప్ ఇండస్ట్రీలో సహకారం అందించేలా తీర్చిదిద్దుతుంది. అంతేకాదు నెక్స్ట్ జనరేషన్ సెమీకండక్టర్ వర్క్‌ఫోర్స్‌ను సిద్ధం చేస్తుంది. ఈ కొలాబరేషన్‌లో ఫ్యాకల్టీ, రీసెర్చ్ స్కాలర్స్, కొలాబరేటివ్ రీసెర్చ్, డిస్కవరీ, టీచింగ్ ఎంగేజ్మెంట్ వంటివి ఈ రెండు విద్యా సంస్థలు ఎక్స్ఛేంజ్ చేసుకుంటాయి. ఈ కొలాబరేషన్‌లో సెమీకండక్టర్ సప్లై చైన్ మేనేజ్‌మెంట్, చిప్ డిజైన్, ప్యాకేజింగ్, సిస్టమ్ ఆర్కిటెక్చర్, అడ్వాన్స్‌డ్ మ్యానుఫ్యాక్చరింగ్ మెథడ్స్ వంటి రంగాలలో పరిశోధన సహకారం కూడా ఉంటుంది.
అందుబాటులో వరల్డ్ క్లాస్ ఫ్యాకల్టీ
ఈ ప్రత్యేక కొలాబరేషన్ మైక్రోఎలక్ట్రానిక్స్ కోసం పెరిగిన అవసరాలు, మ్యానుఫ్యాక్చరింగ్ ధోరణులు మారడం వల్ల ఉత్పన్నమయ్యే ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి శ్రామికశక్తిని తయారు చేస్తుందని రెండు విద్యాసంస్థల అధికారులు ఆశిస్తున్నారు. భారతదేశం సెమీకండక్టర్ మిషన్ మైక్రోఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల భారీ అభివృద్ధి, విస్తరణను పరిశీలిస్తోందని ఐఐటీఎం డైరెక్టర్ ప్రొఫెసర్ V.కామకోటి అన్నారు. పర్డ్యూతో ఈ కామన్ ప్రోగ్రామ్ సెమీకండక్టర్ ఎలక్ట్రానిక్స్‌లో మా నాణ్యమైన మానవ వనరుల అభివృద్ధి ప్రయత్నాలను కచ్చితంగా పెంచుతుందని పేర్కొన్నారు.
ఐఐటీ మద్రాస్‌లో ఎలక్ట్రానిక్ డివైజ్‌ల నుంచి సర్క్యూట్లు, సిస్టమ్‌ల వరకు సెమీకండక్టర్ల విభాగంలో వరల్డ్-క్లాస్ ఫ్యాకల్టీ ఉందని ఓ అధికారి పేర్కొన్నారు. సెమీకండక్టర్స్‌లో ఈ కొత్త డ్యూయల్-డిగ్రీ ప్రోగ్రామ్ విద్యార్థులకు ఈ రంగాలలో గట్టి పునాదిని అందిస్తుందని చెప్పారు. పర్డ్యూ యూనివర్సిటీతో ప్రోగ్రామ్ అనేది పరిశోధన, బోధనలో సహకారం కోసం కొత్త మార్గాలను తెరుస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
New Guidelines: ఇక SIM Card తీసుకోవడం.. బ్యాంక్ ఖాతా తెరవడం అంత సులువు కాదు..
పర్డ్యూ వర్సిటీలో 2,700 మంది ఇండియన్ స్టూడెంట్స్
పర్డ్యూ యూనివర్సిటీ 2,700 మంది భారతీయ విద్యార్థులకు నిలయమని పర్డ్యూ వర్సిటీకి చెందిన ఓ అధికారి చెప్పారు. ఈ విద్యాసంస్థ ఐఐటీ మద్రాస్‌తో సుదీర్ఘమైన పార్ట్నర్షిప్ కుదుర్చుకుందని, యూఎస్‌లో నైపుణ్యం గల సెమీకండక్టర్ ప్రతిభావంతులకు కేంద్రంగా మారాలనే లక్ష్యంతో కాంప్రహెన్సివ్ సెమీకండక్టర్స్ డిగ్రీస్ ప్రోగ్రామ్ (SDP)ని ప్రారంభించామని తెలిపారు. యూఎస్, భారతదేశం రెండింటిలోనూ పెద్ద సెమీకండక్టర్ పరిశ్రమ శ్రామికశక్తి అవసరాలకు వేగంగా తోడ్పడటానికి ఈ డ్యూయల్-డిగ్రీ ప్రోగ్రామ్‌లలో ఐఐటీ మద్రాస్‌తో భాగస్వామ్యం కావడంపై సంతోషం వ్యక్తం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, IIT Madras