ఈ తరం విద్యా వ్యవస్థ కొత్త పుంతలు తొక్కుతోంది. డిజిటలైజేషన్ రావడంతో విద్యా వ్యవస్థలో కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొత్త టెక్నాలజీ వాడకంతో మరింత క్వాలిటీ ఎడ్యుకేషన్ (Quality Education) అందరికీ అందుబాటులోకి వస్తుంది. ఇదే అంశాలపై దేశ విదేశాలకు సంబంధించిన విద్యావేత్తలు, ప్రతినిధులు అంతా చర్చించుకున్నారు. అందుకు మద్రాస్ ఐఐటీ (IIT Madras) వేదికైంది.
‘విద్యలో డిజిటల్ టెక్నాలజీస్’ అనే అంశంపై ఐఐటీ మద్రాస్ జనవరి 31 నుంచి G20 కాన్ఫరెన్స్ నిర్వహిస్తోంది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2 వరకు ఐఐటీ మద్రాస్ రీసెర్చ్ పార్క్(IIT Madras Research Park)లో జరుగుతున్న షెర్పా ట్రాక్ కార్యక్రమంలో భాగంగా ఈ సెమినార్లు జరుగుతున్నాయి. దీంట్లో G20 సభ్య దేశాల ‘ఎడ్యుకేషన్ వర్కింగ్ గ్రూప్’ సభ్యులు పాల్గొన్నారు.
వీరితో పాటు గెస్ట్ కంట్రీస్, ప్రముఖ విద్యా సంస్థలకు సంబంధించిన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లు పాల్గొన్నాయి. మన దేశానికి చెందిన ప్రముఖ విద్యారంగ ప్రతినిధులతోపాటు యునెస్కో(UNESCO), యునిసెఫ్ (UNICEF), వరల్డ్ బ్యాంక్, ఓఈసీడీ వంటి అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
* అందరికీ సమాన విద్య
ఈ కార్యక్రమంలో ఐఐటీ మద్రాస్ (IIT Madras) డైరెక్టర్ వి.కామకోటి మాట్లాడారు. పాఠశాల విద్య, ఉన్నత విద్య, స్కిల్ డెవలప్‌మెంట్ అనే అంశాలపై ఎగ్జైటింగ్ సెషన్స్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ‘సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ కోసం ఏం చేయాలనేది మనందరి ముందు ఉన్న పెద్ద ప్రశ్న. ప్రపంచవ్యాప్తంగా అందరికీ నాణ్యమైన విద్య, అందరికీ సమానమైన విద్య అందుబాటులోకి రావాలి. పిల్లలంతా తక్కువలో తక్కువ గ్రాడ్యుయేషన్ వరకు చదువుకునే స్థితి రావాలి అని మనమంతా కలలు కంటున్నాం. అంతా కలిసి పని చేసినప్పుడు మాత్రమే ఆ డ్రీమ్స్ సాకారమవుతాయి.’ అని చెప్పారు.
వివిధ దేశాల నుంచి ఇన్‌పుట్స్ తీసుకుని సవాళ్లకు సొల్యుషన్లను అందిస్తున్నామని ప్రొ.కామకోటి చెప్పారు. అంతా కలిసి వర్క్ చేస్తే ఇలాంటి ఉపయోగాలు ఉంటాయని అర్థం అవుతుందన్నారు. ఇలా అన్ని విషయాలను కలిసి పంచుకున్నప్పుడే సవాళ్లకు చక్కని పరిష్కారాలు లభిస్తాయని చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి : ఇగ్నోలో మూడు భాషల్లో జర్నలిజం కోర్సులు .. దరఖాస్తు ప్రక్రియ ఇలా..
* ఇన్నోవేషన్ ఎగ్జిబిషన్ ఏర్పాటు
కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీలు, రీసెర్చ్, ఇన్నోవేషన్లను అందరికీ చూపేందుకు 50 స్టాల్స్‌తో కూడిన ఎగ్జిబిషన్ సైతం ఇన్‌స్టిట్యూట్‌లో ఏర్పాటు చేశారు. జీ20 దేశాల విద్యా సంస్థలతో రీసెర్చ్, కొలాబ్రేషన్‌లతో ఏఏ అంశాలపై దృష్టి సారించవచ్చు అన్న విషయంపై భారతీయ, అంతర్జాతీయ ప్రతినిధులంతా చర్చలు జరిపారు. క్వాలిటీ లెర్నింగ్ అవకాశాలు, డిజిటల్ టెక్నాలజీల (Digital Technologies) విషయంలో అవకాశాలను మెరుగుపరిచేందుకు ఏం చేయవచ్చు అనే దానిపై చర్చించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, EDUCATION, IIT Madras, JOBS