హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

IIT Madras: ‘ప్రీమియర్ బ్యాంకర్’ ఆన్‌లైన్ కోర్సును అందిస్తున్న ఐఐటీ మద్రాస్.. అర్హత, దరఖాస్తు ప్రక్రియ వివరాలివే..

IIT Madras: ‘ప్రీమియర్ బ్యాంకర్’ ఆన్‌లైన్ కోర్సును అందిస్తున్న ఐఐటీ మద్రాస్.. అర్హత, దరఖాస్తు ప్రక్రియ వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బ్యాంకింగ్ సెక్టార్‌కు సంబంధించిన ఓ ఆన్ లైన్ కోర్సును ప్రారంభించనుంది. 'ప్రీమియర్ బ్యాంకర్' (Premier Banker) పేరుతో అందిస్తున్న ఈ ఆన్‌లైన్ కోర్సును IIT మద్రాస్ ‘డిజిటల్ స్కిల్స్ అకాడమీ’ నిర్వహిస్తుంది.

దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థలో IIT మద్రాస్ ఒకటి. NIRF ర్యాంకింగ్‌లో ఈ సంస్థ పేరు ఉంది. వివిధ రకాల కోర్సులను ఆఫర్ చేస్తున్న ఐఐటీ మద్రాస్.. తాజాగా బ్యాంకింగ్ సెక్టార్‌కు సంబంధించిన ఓ ఆన్ లైన్ కోర్సును ప్రారంభించనుంది. 'ప్రీమియర్ బ్యాంకర్' (Premier Banker) పేరుతో అందిస్తున్న ఈ ఆన్‌లైన్ కోర్సును IIT మద్రాస్ ‘డిజిటల్ స్కిల్స్ అకాడమీ’ నిర్వహిస్తుంది. IIT మద్రాస్‌కు సంబంధించిన సెంటర్ ఫర్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ (CCE) ద్వారా డిజిటల్ స్కిల్స్ అకాడమీ ఏర్పాటైంది. ఈ కోర్సు 4 నుంచి 6 నెలల పాటు జరగనుంది. మొత్తంగా 240 గంటలకు పైగా శిక్షణ ఇవ్వనున్నారు. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్‌‌ను కెరీర్‌గా ఎంచుకున్న విద్యార్థుల కోసం ఈ ఆన్‌లైన్ కోర్సు నిర్వహిస్తున్నారు. శిక్షణ సమయంలో విద్యార్థులకు వందలాది ప్రశ్నలతో కూడిన అనేక అసైన్ మెంట్‌లు ఇవ్వనున్నారు.

కోర్సులోని మాడ్యూల్స్‌ను విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు సెంటర్ ఫర్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్, సర్టిఫికెట్లను ప్రదానం చేయనుంది. అలాగే BFSI రంగంలో మరింత నైపుణ్యం కోసం ప్రముఖ బ్యాంకులతో అంతర్గత శిక్షణ కూడా పరిశీలనలో ఉన్నట్లు ఐఐటీ మద్రాస్ తెలిపింది.

IIT Madras: ఏప్రిల్ 14 నుంచి సర్టిఫికేట్ కోర్సు ప్రారంభం.. అర్హత, దరఖాస్తు ప్రక్రియ వివరాలు..

సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) స్థాపించిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్స్ మాజీ డైరెక్టర్, IIT మద్రాస్‌ మేనేజ్‌మెంట్ స్టడీస్ విభాగం ప్రొఫెసర్ M. తేన్‌మొళి ఈ కోర్సుకు లీడ్ ఫ్యాకల్టీగా వ్యవహరిస్తున్నారు. అలాగే ప్రముఖ బ్యాంకుల్లో రెండు దశాబ్దాల అనుభవం ఉన్న ICICI సెక్యూరిటీస్ మాజీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ బాలాజీ అయ్యర్ ఈ శిక్షణా కార్యక్రమంలో భాగం కానున్నారు. వీరు ప్రముఖ బ్యాంకింగ్ రంగ నిపుణుల బృందంతో కలిసి పనిచేయనున్నారు. ఈ బృందం బ్యాంకింగ్ సంబంధించి వివిధ కోణాల్లో శిక్షణ ఇవ్వనున్నారు.

Delhi University SOL: ఢిల్లీ ఓపెన్ యూనివర్సిటీలో స్కిల్ బేస్డ్ షార్ట్​టర్మ్ సర్టిఫికెట్ కోర్సులు.. అర్హత, దరఖాస్తు ప్రక్రియ వివరాలివే!

'ప్రీమియర్ బ్యాంకర్' ఆన్‌లైన్ కోర్సుపై ఐఐటీ మద్రాస్‌ సెంటర్ ఫర్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్, డిజిటల్ స్కిల్స్ అకాడమీ హెడ్ ప్రొఫెసర్ కె.మంగళ సుందర్ మాట్లాడుతూ.. కాలానుగుణంగా విద్యార్థుల నైపుణ్యం పెంపొందించడం ఈ కోర్సు ముఖ్య ఉద్దేశమన్నారు. అలాగే ప్రస్తుత మార్కెట్లు, వాటి అవసరాలపై ఫోకస్ చేసి మనదేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ వైపు వేగంగా పయనిస్తోందన్నారు. అకాడమీ ప్రతిపాదించిన విధంగా ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగ శిక్షణా సంస్థలలో ప్రీమియర్ ఫ్యాకల్టీలతో క్లాసులు నిర్వహించడం ముఖ్యమన్నారు.

ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ చేసినవారు BFSI డొమైన్‌లో రాణించాలనే పట్టుదలతో ఉన్నవారు ఈ కోర్సులో చేరవచ్చు. అలాగే సెకండ్, థర్డ్ ఇయర్ చదువుతున్న అండర్ గ్రాడ్యుయేట్లు కూడా ఈ కోర్సు చేయడానికి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. బ్యాకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్‌లో అనుభవం ఉన్న వారికి అధిక ప్రాధాన్యత ఉంటుంది. అయితే ఇది తప్పనిసరి కాదు.

ఈ కోర్సులో బ్యాంకింగ్, ఫైనాన్స్, డిజిటల్ బ్యాంకింగ్, మ్యూచువల్ ఫండ్స్‌పై అభ్యర్థులకు లోతైన అవగాహన కల్పించనున్నారు. ప్రస్తుత ఆర్థిక స్థితిగతులపై విశ్లేషణాత్మక ఇంటెన్సివ్ శిక్షణను అందిస్తున్నట్లు ఐఐటీ మద్రాస్ తెలిపింది. 2018 నుంచి డిజిటల్ స్కిల్స్ అకాడమీ 25 పైగా కోర్సులపై ఆన్‌లైన్ శిక్షణ అందిస్తున్నట్లు ఐఐటీ వర్గాలు తెలిపాయి. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ సంప్రదించవచ్చు.

First published:

Tags: Banking, Career and Courses, IIT Madras

ఉత్తమ కథలు