ఇంజనీరింగ్ (Engineering)స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ , మద్రాస్ (IIT Madras). మోస్ట్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీలలో ఫ్రీగా కోర్సులను ఆఫర్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కోర్సులలో అత్యుత్తమ పనితీరు కనబరిచినవారు సోనీ ఇండియా సాఫ్ట్‌వేర్ సెంటర్‌లో ఉద్యోగానికి కూడా అర్హత సాధిస్తారు. ప్రవర్తక్ టెక్నాలజీస్ ఫౌండేషన్ విద్యార్థులకు IITM PTF ప్లేస్‌మెంట్ సెల్ ద్వారా ఉద్యోగ అవకాశాలు అందిస్తుంది. ఇందుకు వారి కోసం ఇతర కంపెనీలలో ఇంటర్వ్యూలను ఏర్పాటు చేస్తుంది. తద్వారా కోర్సులను పూర్తి చేసిన వారికి ఉద్యోగాలు దొరికే అవకాశాలు చాలా అధికంగా పెరుగుతాయి.
ఈ కోర్సులకు ఇంజనీరింగ్ డిగ్రీలలో అభ్యర్థులు సాధించిన అకడమిక్ మార్క్స్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 2020-2021, 2021-2022లో అన్ని పరీక్షల్లో కనీసం 60 శాతం మొత్తంతో గ్రాడ్యుయేట్ చేసిన విద్యార్థులు మాత్రమే ఈ కోర్సులలో జాయిన్ కావడానికి అర్హులు. అలానే వారి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.8 లక్షలు కంటే తక్కువ ఉండాలి. ఈ అర్హతలు ఉన్నవారు రాతపూర్వక ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూలో పాల్గొనాలి. ఈ అన్ని పరీక్షల్లో అత్యధిక స్కోర్ చేసిన విద్యార్థులు ఉచితంగా కోర్సులను పొందుతారు. అంతేకాకుండా, ట్రైనింగ్ ప్రోగ్రామ్ కింద అందించే స్టైఫండ్ పొందేందుకు అర్హత సాధిస్తారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఇండస్ట్రీల్లో జాబ్స్ తెచ్చుకునేందుకు వీలుగా టెక్నికల్ స్కిల్స్ నేర్పించడమే ఈ కోర్సుల ప్రధాన లక్ష్యం. సోనీ ఇండియా సాఫ్ట్‌వేర్ సెంటర్‌తో ప్రవర్తక్ టెక్నాలజీస్ ఫౌండేషన్ కలిసి ఉచిత కోర్సులను ఆఫర్ చేస్తోంది.
‘సోనీ ఇండియా ఫినిషింగ్ స్కూల్ స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్’ అని పిలిచే ఈ ప్రోగ్రామ్ కృత్రిమ మేధస్సు (AI), మెషిన్ లెర్నింగ్ (AI/ML), సైబర్ సెక్యూరిటీ (Cyber Security), కంప్యూటర్ గ్రాఫిక్స్ (Computer Graphics) వంటి ఎంపిక చేసిన రంగాలలో బిజినెస్ కమ్యూనికేషన్ స్కిల్స్‌తో పాటు ట్రైనింగ్ అందిస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు sonyfs.pravartak.org.in లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కో కోర్సు వ్యవధి దాదాపు ఆరు నెలలు ఉంటుంది. అభ్యర్థులు ఇదొక ఫుల్-టైమ్ కోర్సు అని గమనించాలి. ఈ కోర్సులు IITM ప్రవర్తక్ టెక్నాలజీస్ ఫౌండేషన్ అందించిన తరగతి గదులలో భౌతిక విధానంలో నిర్వహిస్తారు. ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ను విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేస్తారు.
“ఈ ప్రోగ్రామ్‌ను గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు, పరిశ్రమ అవసరాలకు మధ్య ఉన్న జ్ఞానం, నైపుణ్యాల అంతరాన్ని తగ్గించడానికి తీసుకొచ్చాం. భారతదేశంలోని పట్టణేతర ప్రాంతాల చాలా మంది విద్యార్థులు ఈ ప్రోగ్రామ్ ద్వారా ప్రయోజనం పొందుతారని మేం ఆశిస్తున్నాం." అని IIT మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్. V. కామకోటి పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, IIT, IIT Madras, JOBS