హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

IIT Madras: ఐఐటీ మద్రాస్ స్పెషల్ కోర్సు.. అడ్వాన్స్‌డ్ క్వాంటమ్ కంప్యూటింగ్‌పై రెండు వారాల ప్రోగ్రామ్

IIT Madras: ఐఐటీ మద్రాస్ స్పెషల్ కోర్సు.. అడ్వాన్స్‌డ్ క్వాంటమ్ కంప్యూటింగ్‌పై రెండు వారాల ప్రోగ్రామ్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దేశంలోని ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్స్‌లో ఒకటైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (IIT Madras), మరో కొత్త కోర్సును ప్రారంభించింది. ప్రవర్తక్ టెక్నాలజీస్ ఫౌండేషన్ ద్వారా అడ్వాన్స్‌డ్ క్వాంటమ్ కంప్యూటింగ్‌పై రెండు వారాల కోర్సును సంస్థ ఆఫర్ చేస్తుంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Chennai, India

దేశంలోని ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్స్‌లో ఒకటైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (IIT Madras), మరో కొత్త కోర్సును ప్రారంభించింది. ప్రవర్తక్ టెక్నాలజీస్ ఫౌండేషన్ ద్వారా అడ్వాన్స్‌డ్ క్వాంటమ్ కంప్యూటింగ్‌పై రెండు వారాల కోర్సును సంస్థ ఆఫర్ చేస్తుంది. అలాగే IBM QISKITపై హ్యాండ్స్-ఆన్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. ఈ కోర్సు 2022 డిసెంబర్ 5 నుంచి 16వ తేదీ వరకు ఐఐటీ మద్రాస్ క్యాంపస్‌లో కొనసాగనుంది. అర్హత ఉన్న అభ్యర్థులు https://wsaqc.pravartak.org.in/ లింక్ ద్వారా డిసెంబర్ 2లోపు రిజిస్టర్ చేసుకోవాలి. ఇండస్ట్రీ, ప్రభుత్వ ఇన్‌స్టిట్యూట్స్‌కు చెందిన వారు ఈ కోర్సు కోసం అప్లై చేసుకోవచ్చు.

అడ్వాన్స్‌డ్ క్వాంటమ్ కంప్యూటింగ్ కోర్సు , క్వాంటమ్ కంప్యూటింగ్ ఫండమెంటల్స్‌పై అవగాహన ఉన్న వారికి స్పెషలైజ్డ్ టాపిక్స్‌ను పరిచయం చేయడంపై దృష్టి సారిస్తుంది. ఈ కోర్సు IBM QISKITపై ప్రోగ్రామింగ్ కోసం డిఫాల్ట్ మెథడ్ QISKIT రన్‌టైమ్‌ను కూడా పరిచయం చేస్తుంది. IBM క్వాంటమ్ కంప్యూటర్‌లలో ప్రోగ్రామింగ్ ఎక్స్‌పీరియన్స్ అందించే మొట్టమొదటి కోర్సు ఇదే కావడం గమనార్హం. మల్టిపుల్ డొమైన్‌లలో హై-పర్ఫార్మెన్స్ టాస్క్‌ల కోసం క్వాంటమ్ కంప్యూటర్‌లను ఉపయోగించే అవకాశాన్ని ఈ కోర్సు ఎక్స్‌ఫ్లోర్ చేయనుందని ఇన్‌స్టిట్యూట్ పేర్కొంది.

LSAT 2023: లా స్కూల్ అడ్మిషన్ టెస్ట్-2023 రిజిస్ట్రేషన్స్ ప్రారంభం.. ఎగ్జామ్ షెడ్యూల్ ఇదే..

ఈ సంస్థల సహకారంతో..

అసోసియేషన్ ఫర్ కంప్యూటింగ్ మెషినరీ (ACM) ఇండియా, Mphasis సెంటర్ ఫర్ క్వాంటమ్ ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ అండ్ కంప్యూటింగ్(MCQuICC) సహకారంతో ఈ కోర్సును ఐఐటీ మద్రాస్‌లో నిర్వహించనున్నారు. MCQuICC హెడ్ డాక్టర్ అనిల్ ప్రభాకర్ మాట్లాడుతూ... తమ ఇన్ స్టిట్యూట్ క్వాంటమ్ టెక్నాలజీలను పరిశ్రమలకు వాస్తవికంగా అందించడంపై దృష్టి సారింస్తుందన్నారు. ట్రైనింగ్, ఔట్‌రిచ్ యాక్టివిటిలో భాగంగా క్వాంటమ్ కంప్యూటింగ్‌పై ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తామని పేర్కొన్నారు. అడ్వాన్స్‌డ్ క్వాంటమ్ కంప్యూటింగ్‌లో ట్రైనింగ్ ఇవ్వడానికి IITM ప్రవర్తక్ టెక్నాలజీస్ ఫౌండేషన్స్, అసోసియేషన్ ఫర్ కంప్యూటింగ్ మెషినరీ ఇండియాతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని ప్రభాకర్ తెలిపారు.

ఈ ఏడాది జనవరిలో క్వాంటమ్ కంప్యూటింగ్‌పై నిర్వహించిన ప్రోగ్రామ్‌కు సీక్వెల్‌గా ఇది కొనసాగుతుందని ఆయన తెలిపారు. అడ్వాన్స్‌డ్ IBM QISKIT మాడ్యుల్స్ ఉపయోగించడం ద్వారా క్వాంటమ్ మెషీన్ లెర్నింగ్, క్వాంటమ్ ఫైనాన్స్, క్వాంటమ్ సిమూలేషన్స్‌పై ట్రైనింగ్ ఇవ్వడమే ఈ ప్రోగ్రామ్ లక్ష్యమని అనిల్ ప్రభాకర్ తెలిపారు.

ప్రోగ్రామింగ్ ఎక్స్‌పీరియన్స్ కోసం..

ఐఐటీ మద్రాస్ డైరెక్టర్, ప్రొఫెసర్ కామకోటి మాట్లాడుతూ..ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ప్రవర్తక్ టెక్నాలజీస్ ఫౌండేషన్, అసోసియేషన్ ఫర్ కంప్యూటింగ్ మెషినరీ ఇండియా, Mphasis సెంటర్ ఫర్ క్వాంటమ్ ఇన్ఫర్మేషన్, ఐబీఎం సంయుక్తంగా ఈ కోర్సును డెలివరీ చేయనున్నాయని తెలిపారు. IBM క్వాంటమ్ కంప్యూటర్‌లలో ఈ ప్రోగ్రామ్ ద్వారా ప్రోగ్రామింగ్ ఎక్స్‌పీరియన్స్ అందించనున్నట్లు చెప్పారు.

First published:

Tags: Career and Courses, IIT Madras, JOBS

ఉత్తమ కథలు