హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

IIT Madras: ఐఐటీ మద్రాస్‌ డేటాసైన్స్‌ కోర్సుకు మంచి డిమాండ్.. ఈ ఏడాది అప్లికేషన్స్ ప్రారంభం

IIT Madras: ఐఐటీ మద్రాస్‌ డేటాసైన్స్‌ కోర్సుకు మంచి డిమాండ్.. ఈ ఏడాది అప్లికేషన్స్ ప్రారంభం

IIT Madras

IIT Madras

IIT Madras: ఐఐటీ మద్రాస్ గతేడాది డేటా సైన్స్‌ అండ్‌ అప్లికేషన్స్‌లో బీఎస్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఈ నాలుగేళ్ల కోర్సుకు మంచి ఆదరణ లభించింది. ఈ ఏడాది కోర్సుకు సంబంధించి అప్లికేషన్లు స్వీకరిస్తోంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఇటీవల కాలంలో డేటా సైన్స్‌ (Data Science) కు పెరుగుతున్న ఆదరణ మనకు తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఈ కోర్సుకు డిమాండ్‌ పెరుగుతోంది. ఈ క్రమంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) మద్రాస్ గతేడాది డేటా సైన్స్‌ అండ్‌ అప్లికేషన్స్‌లో బీఎస్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఈ నాలుగేళ్ల కోర్సుకు మంచి ఆదరణ లభించింది. ప్రస్తుతం 17 వేల మందికి పైగా విద్యార్థులు ఈ విభాగంలో చదువుతున్నారు. వీరిలో కుటుంబ వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు ఉన్న ఎస్సీ, ఎస్టీ, పర్సనల్‌ డిసేబుల్డ్‌ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ కూడా ఇస్తున్నారు. ఈ ఏడాది కోర్సులో ప్రవేశాల కోసం ఐఐటీ మద్రాస్ అప్లికేషన్లు స్వీకరిస్తోంది.

* ఎవరు అర్హులు?

ఇంటర్‌ లేదా 12వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్‌ మొదటి ఏడాది లేదా 11వ తరగతి చివరి పరీక్షలు రాసినవారు కూడా ఈ కోర్సుకు అప్లై చేసుకోవచ్చు. వీరు క్వాలిఫైయింగ్‌ పరీక్షలో పాస్‌ అయితే, 12వ తరగతి పూర్తి చేసిన తర్వాత ఈ ప్రోగ్రాంలో చేరవచ్చు.

ఇంటర్‌ పూర్తయిన వారు కూడా ఈ కోర్సుకు సంబంధించి ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ రాయాలి. అందులో అర్హతను బట్టి సీటు కేటాయిస్తారు. జేఈఈ (JEE) స్కోర్‌ ద్వారా కూడా డేటా సైన్స్‌లో డిగ్రీ చేయొచ్చు. జేఈఈ అడ్వాన్స్‌కు అర్హత సాధించిన వారు ఎటువంటి ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ లేకుండా ఈ కోర్సులో జాయిన్‌ కావచ్చు. వీరు నేరుగా ఫౌండేషన్‌ స్థాయిలో ప్రవేశం పొందుతారు.

* అప్లికేషన్ ప్రాసెస్

డేటా సైన్స్‌ అండ్‌ అప్లికేషన్స్‌లో బీఎస్‌ డిగ్రీ చేద్దామనుకునే వారు అధికారిక వెబ్‌సైట్‌ study.iitm.ac.inలో దరఖాస్తు చేసుకోవచ్చు. మే 10లోగా అప్లై చేసుకోవాలి. ఆన్‌లైన్‌ విధానంలో తరగతులు జరుగుతాయి. ప్రోగ్రామ్ ఫౌండేషన్, డిప్లొమా లేదా BSc డిగ్రీ స్థాయిల్లో జరుగుతుంది. ఆసక్తి లేకపోతే ఏ స్థాయిలో అయినా తప్పుకునేందుకు అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి : స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్.. ప్రముఖ సంస్థల్లో స్కాలర్‌షిప్, ఫెలోషిప్ ఆఫర్స్!

* నాలుగు స్థాయిల్లో కోర్సు

ఐఐటీ మద్రాస్‌ నిపుణులు ఈ మొత్తం కోర్సును నాలుగు స్థాయిల్లో డిజైన్‌ చేశారు. అవి ఫౌండేషన్, డిప్లొమా (ప్రోగ్రామింగ్‌లో డిప్లొమా లేదా డేటా సైన్స్‌) ప్రోగ్రామింగ్, డేటా సైన్స్‌లో బీఎస్సీ డిగ్రీ, డేటా సైన్స్ అండ్ అప్లికేషన్స్‌లో బీఎస్‌ డిగ్రీ. మొత్తం పూర్తి చేసిన వారికి పట్టా ఇస్తారు. ఆసక్తి లేనివారు ఏ స్థాయిలో అయినా తప్పుకునేందుకు అవకాశం ఇచ్చారు. ప్రతి విద్యా సంవత్సరంలో నాలుగు నెలలను ఒక టర్మ్‌గా విభజించారు. జనవరి, మే, సెప్టెంబర్‌ టర్మ్‌గా విభజించి తరగతులు నిర్వహిస్తారు.

* ఫీజు

ఫౌండేషన్‌ లెవల్‌లో 32 క్రెడిట్లు (క్రెడిట్‌ అంటే బోధనా సమయం గంటలు) ఉంటాయి. ఇందుకు ఫీజు రూ.32 వేలు చెల్లించాలి. ఫౌండేషన్, ఒక డిప్లొమా కోర్సులో 59 క్రెడిట్లు ఉంటాయి. రూ.94,500 ఫీజు ఉంటుంది. ఫౌండేషన్, రెండు డిప్లొమాలో 86 క్రెడిట్లు ఉంటాయి. రూ.1,57,000 ఫీజు ఉంటుంది. బీఎస్సీ డిగ్రీలో 114 క్రెడిట్లు ఉంటాయి. ఫీజు రూ.2,21,000 నుంచి రూ.2,27,000 మధ్య ఉంటుంది. బీఎస్‌ డిగ్రీలో 142 క్రెడిట్లు ఉంటాయి. రూ.3,15,000 నుంచి రూ.3,51,000 ఫీజు ఉంటుంది.

First published:

Tags: Career and Courses, EDUCATION, IIT Madras, JOBS

ఉత్తమ కథలు