దేశంలోని ప్రతిష్టాత్మక సంస్థల్లో ఐఐటీ మద్రాస్ (IIT Madras) ఒకటి. ఇందులో చదువుకోవడం చాలా మంది విద్యార్థుల కల(Dream). అయితే చాలా తక్కువ మందికి మాత్రమే ఆ అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని అనేక సంస్థలు ఆన్‌లైన్ కోర్సులను(Online Courses) ప్రారంభిస్తున్నాయి. తద్వారా ఎవరైనా, ఎక్కడి నుంచైనా ఈ కోర్సుల్లో జాయిన్(Join) కావచ్చు. తాజాగా ఐఐటీ మద్రాస్ ‘అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్’ పేరుతో మ్యాథ్స్‌పై(Maths) ఆన్ లైన్ కోర్సును(Online Course) లాంచ్(Launch) చేసింది. ‘ ప్రాబ్లమ్ సాల్వింగ్ టూ మల్టిపుల్ అఫ్రోచ్(Multiple Approach)’ విధానంపై బోధించడమే ఈ కోర్సు లక్ష్యమని ఐఐటీ మద్రాస్(IIT Madras) పేర్కొంది. ఈ కోర్సును భారతీయులతో పాటు విదేశాల్లో ఉన్నవారు కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ ఆన్‌లైన్ కోర్సు కోసం రిజిస్ట్రేషన్ తుది గడువు జూన్ 24, 2022న ముగుస్తుంది. కోర్సు మొదటి బ్యాచ్ తరగతులు జూలై 1 నుంచి ఆన్‌లైన్ లో ప్రారంభం కానున్నాయి. ఆసక్తి ఉన్నవారు https://www.pravartak.org .in/out-of-box-thinking.html లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్‌లైన్‌లో ఉచితంగా అందుబాటులో..
IIT మద్రాస్ ప్రవర్తక్ టెక్నాలజీస్ ఫౌండేషన్, sec 8 కంపెనీ ద్వారా ఆన్‌లైన్ మోడ్‌లో ఈ కోర్సు ఉచితంగా డెలివరీ చేయనున్నారు. నామమాత్రపు ఫీజుతో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు గ్రేడ్ సర్టిఫికేషన్‌ను కూడా జారీ చేయనున్నారు. ఫైనల్ ఎగ్జామ్‌ను దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన నగరాల్లో నిర్వహిస్తామని ఐఐటీ మద్రాస్ వెల్లడించింది. గణిత విద్యావేత్త, ఆర్యభట్ట ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్ వ్యవస్థాపక డైరెక్టర్ సదా గోపాల్ రాజేష్ ఈ కోర్సు ద్వారా అభ్యర్థులకు గణితాన్ని బోధించనున్నారు.
ఐఐటీ మద్రాస్ డైరెక్టర్, ప్రొఫెసర్ వి. కామకోటి మాట్లాడుతూ...ఈ కోర్సు దేశంలో రాబోయే రోజుల్లో పెద్ద ప్రభావాన్ని చూపుతుందన్నారు. రాబోయే కొన్నేళ్లలో ఈ కోర్సు ప్రయోజనాలను తాము చూస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఉచితంగా అందిస్తున్న ఈ కోర్సు ద్వారా పాఠశాల, కళాశాల విద్యార్థులకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది కామకోటి అభిప్రాయపడ్డారు.
“ఈ కోర్సు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కోసం మల్టిపుల్ అఫ్రోచ్‌లను ప్రదర్శిస్తుంది. తద్వారా మ్యాథ్స్‌పై డౌట్లను తీర్చుకోవచ్చు. అలాగే ఈ కోర్సు సులభంగా అర్థం చేసుకునే పద్ధతుల్లో కొత్త టెక్నిక్‌లను పరిచయం చేస్తుంది. నిజ జీవిత ప్రాజెక్ట్‌లను నమ్మకంగా, సులభంగా ఎదుర్కోవడానికి అభ్యర్థులను సిద్ధం చేస్తుంది.’’ అని ప్రొఫెసర్ కామకోటి కోర్సు గురించి వివరించారు.
BJP|TRS : జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లకు మోదీ రాజకీయ సూచనలు .. కౌంటర్ ఇచ్చిన మంత్రి కేటీఆర్
ఇది ఇలా ఉంటే.. కంప్యూటర్ సైన్స్‌లో నాణ్యమైన కోర్సులను అందరికీ అందుబాటులో ఉంచడం కోసం ఐఐటీ మద్రాస్ ప్రత్యేక చొరవ తీసుకుంది. ఇన్‌స్టిట్యూట్‌లోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ఫ్యాకల్టీ... కోర్ కోర్సులకు సంబంధించి పోర్టల్‌ను రూపొందించింది. విద్యా సంస్థలు, విద్యార్థులతో పాటు ఆసక్తి ఉన్న వారు ఎవరైనా ఈ కోర్సులను యాక్సెస్ చేసుకోవచ్చని ఇన్‌స్టిట్యూట్ ప్రకటించింది. ప్రధానంగా ప్రోగ్రామింగ్, డేటా స్ట్రక్చర్స్, కంప్యూటర్ ఆర్గనైజేషన్, అల్గారిథమ్‌లపై కోర్ కంప్యూటర్ సైన్స్ కోర్సులు nsm.iitm.ac.in/cse/ పోర్టల్‌లో అందుబాటులో ఉన్నట్లు ఐఐటీ మద్రాస్ తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, IIT Madras, Students