హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Artificial Intelligence : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ఎంటెక్‌ కోర్సును లాంచ్ చేసిన ఐఐటీ.. జేఈఈ, గేట్‌ అర్హత లేకుండానే..

Artificial Intelligence : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ఎంటెక్‌ కోర్సును లాంచ్ చేసిన ఐఐటీ.. జేఈఈ, గేట్‌ అర్హత లేకుండానే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇండస్ట్రియల్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌లో ఎంటెక్‌ డిగ్రీని లాంచ్‌ చేసింది ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (IIT) మద్రాసు. సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం టీసీఎస్‌ సహకారంతో ఈ కోర్సును ఐఐటీఎం అందిస్తోంది.

ఇండస్ట్రియల్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌లో ఎంటెక్‌ డిగ్రీని(Degree) లాంచ్‌ చేసింది ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (IIT) మద్రాసు(Madras). సాఫ్ట్‌వేర్‌(Software) దిగ్గజం టీసీఎస్‌(TCS) సహకారంతో ఈ కోర్సును ఐఐటీఎం అందిస్తోంది. 18 నెలల కోర్సును పూర్తిగా ఆన్‌లైన్‌లో(Online) వర్చువల్‌ క్లాస్ రూమ్‌ల ద్వారా బోధించనున్నట్లు ఐఐటీఎం నిర్వాహకులు తెలిపారు. కోర్సులో చేరిన విద్యార్థులకు టీసీఎస్‌ నుంచి సహకారం అందుతుంది. ఈ కోర్సులో చేరేందుకు జేఈఈ మెయిన్‌, గేట్‌ వంటి ప్రవేశ పరీక్షల్లో(Entrance Test) అర్హత సాధించాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రియల్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఎంటెక్‌ డిగ్రీలో మిడ్‌ టర్మ్‌, ఫైనల్‌ ఎగ్జామ్స్‌ ఆన్‌లైన్‌ తరహాలో జరుగుతాయి. ప్రాజెక్టు వర్క్‌(Project Work) కూడా ఉంటుంది. వారానికి దాదాపు 28 నుంచి 30 గంటల ఆన్‌లైన్‌ తరగతులు జరుగుతాయని నిర్వాహకులు చెప్పారు. అసైన్‌మెంట్లు, రీడింగ్‌, ప్రిపరేషన్‌ వంటి పోస్ట్‌ క్లాస్‌రూమ్‌ యాక్టివిటీస్‌కు వారానికి మరో 20 నుంచి 22 గంటల సమయం కేటాయిస్తారు.

ఈ కోర్సు లాంచింగ్‌పై ఐఐటీఎం డైరక్టర్‌, ప్రొఫెసర్‌ వి.కామకోటి మాట్లాడుతూ..‘టీసీఎస్‌తో చర్చించి ఈ కోర్సును ప్రారంభించాం. డేటాసైన్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌లో పట్టు సాధించేలా థియరీ క్లాసెస్‌, ముఖ్యమైన అంశాలనై ల్యాబ్‌లు నిర్వహిస్తాం. డేటాసైన్స్‌ అల్గారిథమ్స్‌ నుంచి అర్థం చేసుకొనేందుకు ఫండమెంటల్‌ మ్యాథమెటికల్‌ టెక్నిక్స్‌ను కోర్సులో థియరెటికల్‌ క్లాసెస్‌లో నేర్పిస్తారు. టైమ్‌ సిరీస్‌ అనాలసిస్‌, మల్టివేరియట్‌ డేటా అనాలసిస్‌, మెషిన్‌లెర్నింగ్‌, డీప్‌ లెర్నింగ్‌, రీఎన్ఫోర్స్‌మెంట్‌ లెర్నింగ్‌ వంటి అంశాలపై క్లాసులు నిర్వహిస్తారు. ఇండస్ట్రీ అవసరాలను తీర్చేలా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి పరిష్కారాలు చూపేలా కోర్సు ఉంటుంది.’ అని చెప్పారు.

AP Jobs: ఏపీలో ఎల్లుండి భారీ జాబ్ మేళా.. KIA Motorsతో పాటు మరో 4 సంస్థల్లో 400 జాబ్స్.. ఇలా రిజిస్టర్ చేసుకోండి

కొత్త కోర్సు గురించి ఐఐటీ మద్రాస్ అకడమిక్‌ కోర్సెస్‌ డీన్‌, ప్రొఫెసర్‌ ప్రతాప్‌ హరిదాస్‌ మాట్లాడుతూ.. ‘ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ విభాగంలో నైపుణ్యం ఉన్న హ్యూమన్‌ రిసోర్స్‌ అవసరం ఉంది. ఇండస్ట్రీ అవసరాలను తీర్చేలా ఈ కోర్సులో అభ్యర్థులను తీర్చిదిద్దుతాం. అందుకోసమే కోర్సును ప్రత్యేకంగా డిజైన్‌ చేశాం.’ అని తెలిపారు.

టీఎస్‌తో కలిసి కోర్సును అందించడంపై టీసీఎస్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ కె.అనంత్‌ క్రిష్ణన్‌ హర్షం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ..‘నూతన టెక్నాలజీస్‌ను పరిచయం చేసేందుకు, అవసరమైన నైపుణ్యాలను విద్యార్థులకు అందించేందుకు ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలతో కలిసి టీసీఎస్‌ పని చేస్తోంది. ఐఐటీమద్రాసుతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. టీసీఎస్‌ అకడమిక్‌ కో-ఇన్నోవేషన్‌ నెట్‌వర్క్‌లో ఐఐటీమద్రాసు ఉంది. డేటా సైన్సెస్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌లో వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌కు, విద్యార్థులకు పూర్తి అవగాహన కల్పించేందుకు ఎంటెక్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నాం.’ అని వివరించారు.

టీసీఎస్‌ సీనియర్‌ వైప్‌ ప్రెసిడెంట్‌, ఐవోటీ, డిజిటల్‌ ఇంజినీరింగ్‌ గ్లోబల్‌ హెడ్‌ రెగు అయ్యాస్వామి మాట్లాడుతూ.. ‘డేటా సైన్సెస్‌, ఫిజిక్స్‌ కలయిక ఇండస్ట్రియల్‌ అనలిటిక్స్‌. డిజిటల్‌ ట్విన్స్‌ను న్యూరల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ చేయడానికి అవసరమైన సామర్థ్యాన్ని, ఫ్లెక్సిబిలిటీని, ఉత్పత్తిని అంచనా వేసే నైపుణ్యాన్ని కల్పిస్తుంది. చివరికి అటానమస్ మాన్యుఫ్యాకర్చరింగ్‌గా అభివృద్ధి చెందుతుంది. ఐఐటీమద్రాసు, టీసీఎస్‌ భాగస్వామ్యంతో వస్తున్న ఎంటెక్‌ కోర్సు ఇండస్ట్రీకి నైపుణ్యమున్న అభ్యర్థులను అందిస్తుంది.’ అని వివరించారు.

First published:

Tags: Career and Courses, IIT Madras, Jee mains 2022

ఉత్తమ కథలు