హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

IIT Madras: బ్యాంకింగ్, ఫైనాన్స్‌లో అప్‌స్కిల్లింగ్ సర్టిఫికేషన్ కోర్సులు.. లాంచ్ చేసిన ఐఐటీ మద్రాస్

IIT Madras: బ్యాంకింగ్, ఫైనాన్స్‌లో అప్‌స్కిల్లింగ్ సర్టిఫికేషన్ కోర్సులు.. లాంచ్ చేసిన ఐఐటీ మద్రాస్

బ్యాంకింగ్, ఫైనాన్స్ విభాగంలో కొత్త కోర్సులు

బ్యాంకింగ్, ఫైనాన్స్ విభాగంలో కొత్త కోర్సులు

ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (IIT Madras) బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో విద్యార్థుల కెరీర్ బిల్డ్ కోసం అప్ స్కిల్లింగ్ కోర్సులను ఆఫర్ చేస్తోంది. ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ‘ఐఐటీ మద్రాస్ ప్రవర్తక్ ఫౌండేషన్’ అప్‌స్కిల్లింగ్ సర్

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

ఈ రోజుల్లో మెట్రో సిటీస్‌తో పాటు టైర్ 2, టైర్ 3 నగరాల్లోనూ బ్యాంకింగ్ (Bank), ఫైనాన్షియల్ సేవలు విస్తృతంగా అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో ఈ రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నాయి. ఫలితంగా నిపుణులకు డిమాండ్ పెరుగుతుంది. దీన్ని ద‌ృష్టిలో ఉంచుకుని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (IIT Madras) బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో విద్యార్థుల కెరీర్ బిల్డ్ కోసం అప్ స్కిల్లింగ్ కోర్సులను ఆఫర్ చేస్తోంది. ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ‘ఐఐటీ మద్రాస్ ప్రవర్తక్ ఫౌండేషన్’ అప్‌స్కిల్లింగ్ సర్టిఫికేషన్ కోర్సులను పర్యవేక్షించనుంది.

ఈ సర్టిఫికేషన్ కోర్సులు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, మ్యూచువల్ ఫండ్స్ , ఈక్విటీ డెరివేటివ్స్, డిజిటల్ బ్యాంకింగ్, సెక్యూరిటీస్ ఆపరేషన్స్ అండ్ రిస్క్ మేనేజ్‌మెంట్ వంటి అంశాలపై లోతైన అవగాహనను అందిస్తాయి. ఈ సర్టిఫికేషన్ కోర్సులను పూర్తి చేసిన వారు ఎన్‌ఐఎస్‌ఎం(NISM), ఎన్‌ఎస్‌ఈ(NSE), బీఎస్‌ఈ (BSE) ఐఐబీఎఫ్(IIBF) వంటి సంస్థలు నిర్వహించే వివిధ సర్టిఫికేషన్ పరీక్షలను రాయటానికి అవకాశం ఉంటుంది.

ఈరోజు నుంచి ఈ బ్యాంక్ కనిపించదు.. దీపావళి ముందు కస్టమర్లకు భారీ షాకిచ్చిన ఆర్‌బీఐ!

ప్రస్తుతం బ్యాచిలర్ డిగ్రీని అభ్యసిస్తున్న వారు ఈ కోర్సుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిన చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్(BFSI) డొమైన్‌లో రాణించాలనే అభిరుచి ఉన్న అభ్యర్థులు సైతం ఈ కోర్సుల్లో జాయిన్ కావచ్చు.

మోస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఫ్యాకల్టీ ఆధ్వర్యంలో..

ఈ కోర్సులను ఇండస్ట్రీ, ఎడ్యుకేషన్ రంగంలో అత్యంత ఎక్స్ పీరియన్స్ ఫ్యాకల్టీ బోధించనున్నారు. ఐఐటీ మద్రాస్‌లోని మేనేజ్‌మెంట్ స్టడీస్ డిపార్ట్‌మెంట్ హెడ్, ప్రొఫెసర్ ఎం తేన్‌మొళి ఈ కోర్సులకు లీడ్ ఫ్యాకల్టీ మెంబర్‌గా వ్యవహరించనున్నారు. సెబీ(SEBI) స్థాపించిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్స్‌కు ఈయన గతంలో డైరెక్టర్‌గా పనిచేశారు. ఐసీఐసీఐ సెక్యూరిటీస్ మాజీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ బాలాజీ అయ్యర్ వివిధ కోర్సులకు కో-లీడ్ ఫ్యాకల్టీగా వ్యవహరించనున్నారు. ఈయనకు ప్రముఖ బ్యాంకుల్లో రెండు దశాబ్దాలకు పైగా పనిచేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది.

ఎస్‌బీఐ కస్టమర్లకు శుభవార్త.. ఫోన్ కొంటే రూ.10 వేల డిస్కౌంట్!

ట్రైనింగ్ పార్టనర్‌గా ఇన్‌ఫ్యాక్ట్ ప్రో..

ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన డిజిటల్ స్కిల్ అకాడమీ సహకారంతో చెన్నైలోని ప్రీమియర్ ఫైనాన్స్ సెక్టార్ సర్టిఫైడ్ ట్రైనర్.. ఇన్‌ఫ్యాక్ట్ ప్రో(InFactPro) ద్వారా కోర్సులను డెలివరీ చేయనున్నారు. ఇన్‌ఫ్యాక్ట్ ప్రో అనేది బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ సెక్టార్‌ స్కిల్ కౌన్సిల్‌‌కు సంబంధించిన ట్రైనింగ్ పార్టనర్. కేంద్ర నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్కిల్ కౌన్సిల్ పనిచేస్తుంది.

మారుమూల ప్రాంతాలే లక్ష్యంగా..

ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ V కామకోటి మాట్లాడుతూ.. ఈ కోర్సులు మన దేశంలోని అన్ని ప్రాంతాలకు, ముఖ్యంగా మారుమూల ప్రాంతాల అభ్యర్థులకు చేరువకానున్నాయన్నారు. డిజిటల్ లిటరసీ చాలా తక్కువగా ఉందని, ఎంచుకున్న కెరీర్ జర్నీలో ప్రతి ఒక్కరూ ముందుకు సాగడానికి ఈ కోర్సులు సహాయపడతాయని కామకోటి అభిప్రాయపడ్డారు. ‘మనదేశం 5-ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ వైపు వేగంగా పయనించాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్‌లో నైపుణ్యాభివృద్ధి కోర్సులను ప్రీమియర్ ఇన్‌స్టిట్యూట్స్, పరిశ్రమలు సంయుక్తంగా అందించడం ద్వారా విద్యార్ధుల కెరీర్‌కు ఎంతో ఉపయోగపడనుంది’ అని చెప్పారు.

First published:

Tags: EDUCATION, JOBS, Students

ఉత్తమ కథలు