Home /News /jobs /

IIT MADRAS LAUNCHES 6 MONTH CERTIFICATE COURSE ON NEXT GENERATION MOBILE WIRELESS NETWORKS FOR STUDENTS PROFESSIONALS GH VB

IIT Madras: మొబైల్​ వైర్​లైస్​ నెట్​వర్క్​పై ఐఐటీ మద్రాస్​ ఆరు నెలల సర్టిఫికెట్​ కోర్సు.. అర్హత, కోర్సు వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఐఐటీ మద్రాస్ 'నెక్స్ట్ జనరేషన్ మొబైల్ వైర్‌లెస్ నెట్‌వర్క్​' పై 6 నెలల సర్టిఫికేట్​ కోర్సును ప్రారంభించింది. ప్రవర్తక్ టెక్నాలజీస్ ఫౌండేషన్​తో పాటు మెగామ్ సొల్యూషన్స్ సహకారంతో ఐఐటీ మద్రాస్​ ఈ కోర్సును ఆఫర్​ చేస్తుంది.

మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీలో(Technology) అనేక మార్పులొస్తున్నాయి. నూతన టెక్నాలజీపై పట్టు సాధించిన వారికే అవకాశాలు దక్కుతున్నాయి. అందుకే, ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు కొత్త కోర్సులకు శ్రీకారం చుడుతున్నాయి. తాజాగా ప్రతిష్టాత్మక ఐఐటీ మద్రాస్(IIT Madras) 'నెక్స్ట్ జనరేషన్ మొబైల్ వైర్‌లెస్ నెట్‌వర్క్​' పై 6 నెలల సర్టిఫికేట్​ కోర్సును(Certificate Course) ప్రారంభించింది. ప్రవర్తక్ టెక్నాలజీస్ ఫౌండేషన్​తో (Pravarthak Technology Foundation) పాటు మెగామ్ సొల్యూషన్స్ సహకారంతో ఐఐటీ మద్రాస్​ ఈ కోర్సును ఆఫర్​ చేస్తుంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఫిబ్రవరి 5లోపు www.pravartak.org.in వెబ్​సైట్​లో దరఖాస్తు చేసుకోవాలని కోరింది. కోర్సులో భాగంగా 5జీ, సాఫ్ట్‌వేర్ డిఫైన్డ్ నెట్‌వర్క్‌లు (SDN), నెట్‌వర్క్‌లైజేషన్ ఫంక్షన్​ విజువలైజేషన్​ (NFV), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) వంటి నూతన సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పిస్తుంది.

BOB Recruitment 2022: బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్.. ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ.. ఇలా అప్లై చేయండి

ఈ కోర్సులో ఇంజినీరింగ్​ అండర్ గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, ఎంఎస్సీ (ఎలక్ట్రానిక్స్), పీహెచ్​డీ స్కాలర్లు, ఫ్యాకల్టీ, స్టార్ట్-అప్‌ నిపుణుల చేరవచ్చు. ఈ ఆన్‌లైన్ కోర్సు ఫిబ్రవరి 12న ప్రారంభమవుతుంది. ఆల్టర్నేట్ వీకెండ్స్​లో క్లాసులు ఉంటాయి. "ప్రోగ్రామ్​లో పాల్గొనేవారు నెక్ట్స్​ జనరేషన్​ మొబైల్ వైర్‌లెస్ నెట్‌వర్క్‌లు, నెట్‌వర్క్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కాంపోనెంట్స్​, ప్రోటోకాల్స్​, మోడరన్​ మొబైల్ వైర్‌లెస్ నెట్‌వర్క్‌లకు సంబంధించిన ఆర్కిటెక్కర్​ను సులభంగా అర్థం చేసుకుంటారు. అంతేకాదు, 5G స్టాండర్డ్స్​​ గురించి అవగాహన పెంచుకునేందుకు, 5G టెక్నాలజీ విస్తరణకు ఈ కోర్సు ఉపయోగపడుతుంది.”అని ఐఐటీ మద్రాస్​ పేర్కొంది.

ఐఐటీ ప్రొఫెసర్లు, ఇండస్ట్రీ ఎక్స్​పర్ట్స్​తో క్లాసులు..
ఈ ప్రోగ్రామ్ ద్వారా వివిధ మొబైల్ వైర్‌లెస్ టెక్నాలజీలు, కాన్సెప్ట్‌ల గురించి లోతైన అవగాహనను పెంపొందించుకోవచ్చు. దీని కోసం ప్రాక్టికల్​ సెషన్లను కూడా నిర్వహిస్తారు. నెక్ట్స్​ జనరేషన్​ మొబైల్ వైర్‌లెస్ నెట్‌వర్క్​ కోర్సు పరిచయం ద్వారా 5జీ టెక్నాలజీ అమలులో ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించగలిగే అనుభవజ్ఞులైన నిపుణులను తయారు చేస్తామని చెబుతున్నారు ఐఐటీ మద్రాస్ ప్రవర్తక్ టెక్నాలజీస్ ఫౌండేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ MJ శంకర్ రామన్.

BSNL Recruitment 2022: నిరుద్యోగులకు అలర్ట్.. బీఎస్ఎన్ఎల్ లో రూ.75 వేల వేతనంతో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి


నెక్ట్స్​ జనరేషన్​ మొబైల్ వైర్‌లెస్ టెక్నాలజీలను ఉపయోగించుకోవడం ద్వారా డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ జర్నీని వేగవంతం చేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. నెట్‌వర్కింగ్ ఉత్పత్తుల తయారీలో గొప్ప అనుభవం ఉన్న నిపుణులచే ఈ ప్రోగ్రామ్​ను సులభంగా డిజైన్​ చేసినట్లు తెలిపారు. మొబైల్ వైర్‌లెస్ టెక్నాలజీ సంబంధిత పరిశోధనలో అనేక సంవత్సరాల అనుభవం ఉన్న ఐఐటీ ప్రొఫెసర్ల ద్వారా క్లాసులుంటాయని పేర్కొన్నారు.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, EDUCATION

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు