హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

IIT Madras : ఐఐటీ మ‌ద్రాస్‌లో ఉద్యోగాలు.. జీతం రూ.40,000, ద‌ర‌ఖాస్తుకు రేపే ఆఖ‌రు తేదీ

IIT Madras : ఐఐటీ మ‌ద్రాస్‌లో ఉద్యోగాలు.. జీతం రూ.40,000, ద‌ర‌ఖాస్తుకు రేపే ఆఖ‌రు తేదీ

ఐఐటీ మ‌ద్రాస్‌లో ఉద్యోగాలు

ఐఐటీ మ‌ద్రాస్‌లో ఉద్యోగాలు

IIT Madras : చెన్నైలోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (Indian Institute of Technology) మ‌ద్రాస్‌  ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా ప్రాజెక్టు స్టాఫ్ పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తారు. ద‌ర‌ఖాస్తుకు న‌వంబ‌ర్ 14, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

ఇంకా చదవండి ...

  చెన్నైలోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (Indian Institute of Technology) మ‌ద్రాస్‌  ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేష‌న్ (Notification) ద్వారా ఒప్పంద ప్రాతిప‌దిక‌న నాన్‌టీచింగ్ (Non Teaching) ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.  నోటిఫికేష‌న్ ద్వారా ప్రాజెక్ట్‌ ఆఫీసర్లు, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌లు, జూనియర్‌ టెక్నీషియన్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆన్‌లైన్ (Online) ద్వారా ఉంటుంది. ద‌ర‌ఖాస్తు వివ‌రాలు, నోటిఫికేష‌న్ స‌మాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ https://icandsr.iitm.ac.in/recruitment/ ను సంద‌ర్శించాల్సి ఉంటుంది. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి న‌వంబ‌ర్ 14, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

  పోస్టుల వివ‌రాలు.. అర్హ‌త‌లు

  పోస్టు పేరుఅర్హ‌త‌లుఖాళీలుజీతం
  ప్రాజెక్ట్‌ ఆఫీసర్లుసంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. వయసు: 28 ఏళ్లు మించకుండా ఉండాలి2జీతం: నెలకు రూ.27,500 నుంచి రూ.1,00,000
  ప్రాజెక్ట్‌ అసోసియేట్‌లుసంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌ ఉత్తీర్ణతతోపాటు గేట్‌ అర్హత సాధించి ఉండాలి. వయసు: 28 ఏళ్లు మించకుండా ఉండాలి5వేతనం నెలకు రూ.21,500 నుంచి రూ.40,000
  జూనియర్‌ టెక్నీషియన్సంబంధిత సబ్జెక్టుల్లో ఐటీఐ/డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలి. వయసు: 28 ఏళ్లు మించకుండా ఉండాలి8వేతనం నెలకు రూ.16,000 నుంచి రూ.38,000


  TCS Recruitment 2021 : ఫ్రెష‌ర్స్‌కు గుడ్ న్యూస్‌.. TCS జాబ్స్ ద‌ర‌ఖాస్తుకు గడువు పొడిగింపు


  ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, టెస్ట్‌/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

  దరఖాస్తు విధానం..

  Step 1 :  ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఆన్‌లైన్ ఆఫ్‌లైన్ ద్వారా ఉంటుంది.

  Step 2 : ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://icandsr.iitm.ac.in/recruitment/ ను సంద‌ర్శించాలి.

  Step 3:  నోటిఫికేష‌న్‌ను పూర్తిగా చ‌ద‌వాలి. (నోటిఫికేష‌న్ కోసం క్లిక్ చేయండి)

  Step 4:  New User Registration ఆప్ష‌న్‌లో పేరు న‌మోదు చేసుకొని ద‌ర‌ఖాస్తు ఫాం నింపాలి.

  Appsc Recruitment 2021 : ఏపీపీఎస్‌సీలో ఎక్స్‌టెన్ష‌న్ ఆఫీస‌ర్ ఉద్యోగాలు.. జీతం రూ.75,000


  Stpe 5: ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్త‌యిన త‌రువాత అప్లికేష‌న్‌ను ప్రింట్ తీసుకోవాలి.

  Step 6:  ప్రింట్ తీసుకొన్న అప్లికేష‌న్‌ల‌కు అవ‌స‌ర‌మైన ధ్రువ‌ప‌త్రాలు జోడించి

  డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్,

  ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ మద్రాస్,

  చెన్నై–600036 చిరునామకు పంపించాలి.

  Step 7 :  ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేదీ న‌వంబ‌ర్ 14, 2021

  Published by:Sharath Chandra
  First published:

  Tags: Govt Jobs 2021, IIT, IIT Madras, Job notification, JOBS

  ఉత్తమ కథలు