దేశంలోనే ఉత్తమ ర్యాంకింగ్ ఐఐటీల్లో ఒకటి ఐఐటీ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (Indian Institute of Technology), మద్రాస్. ఈ ఏడాది ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ (EMBA) ప్రోగ్రాం కోసం ఐఐటీ మద్రాస్ నోటిఫికేషన్ (Notification) విడుదల చేసింది. ముఖ్యంగా వర్కింగ్ ప్రొఫెషనల్స్ (Professionals) కోసం ఈ ప్రోగ్రాం ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రొగ్రాంలో చేరేందుకు దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 20న ప్రారంభమై.. అక్టోబర్ 19, 2021 వరకు అవకాశం ఉంది. కేవలం ఆన్లైన్ (Online) పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరింత వివరాల కోసం అధికారిక వెబ్సైట్ doms.iitm.ac.in/emba/ ను సందర్శించాలి. ఈ కోర్సుకు సంబంధించి తరగతులు జనవరి 2022న ప్రారంభం అవుతుంది. తరగతులు కూడా ఆల్టర్నేట్ (Alternate) వారాంతాల్లో జరుగుతాయి.
ఈఎంబీఏ కోర్సు సమాచారం..
అప్లికేషన్లు ప్రారంభం | సెప్టెంబర్ 20, 2021 |
దరఖాస్తుకు చివరి తేదీ | అక్టోబర్ 19, 2021 |
ఇంటర్వ్యూ తేదీలు | నవంబర్ 12, 13, 14 తేదీల్లో |
కోర్సు ప్రారంభం | జనవరి 2022 |
అధికారిక వెబ్ సైట్ | https://doms.iitm.ac.in/emba/ |
అర్హతలు.. ఎంపిక విధానం
- దరఖాస్తు చేసకొనే అభ్యర్థి కనీసం మూడు సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి.
- ఫస్ట్ క్లాస్‌లో గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసి ఉండాలి.
- అభ్యర్థులను డిఓఎంఎస్ ప్రవేశ పరీక్ష అనంతరం వ్యక్తిగత ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
- వర్చువల్ పద్ధతిలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
కోర్సు విధానం..
- ఇది 24 నెలల కోర్సు
- ఇందులో మూడు ప్రాజెక్టులు ఉంటాయి.
- ఈ కోర్సు ఐఐటీ మద్రాస్ మేనేజ్మెంట్ స్టడీస్ (Management Study) విభాగంలో అందిస్తారు.
NIT Agarthala: ఎన్ఐటీ అగర్తలాలో నాన్ టీచింగ్ ఉద్యోగాలు.. అర్హతలు ఇవే
అందించే కోర్సులు..
ఈ ప్రొగ్రాంలో సోషల్ మీడియా అండ్ ఇంటర్నెట్ (Internet) మార్కెటింగ్, సైబర్ సెక్యూరిటీ మరియు అప్లికేషన్స్‌తో పాటు గ్లోబల్ బిజినెస్ కోర్సులకు కూడా అవకాశం కల్పిస్తున్నట్లు ఐఐటీ-మద్రాస్ పేర్కొంది. అంతే కాకుండా మోడరన్ మ్యానిఫాక్చురింగ్ ప్రాససెస్ అండ్ 3డీ ప్రింటింగ్ (3D Printing) అంశాలపై విద్యార్థులకు నైపుణ్యం అందిస్తారు. ఈ కోర్సు విధానంపై ఐఐటి మద్రాస్‌లో మేనేజ్మెంట్ స్టడీస్ విభాగాధిపతి ప్రొఫెసర్ జి. అరుణ్ కుమార్ మాట్లాడుతూ, ఈఎంబీఏ కోర్సు విధానం క్రమంగా అభివృద్ధి చెందుతోంది. ఈ ప్రోగ్రాంలో చేరిన విద్యార్థుల సగటు అనుభవం 11ఏళ్లుగా ఉందని ఆయన అన్నారు. పబ్లిక్, ప్రైవేటు రంగాల్లో పని చేసివారు ఈ కోర్సుల్లో చేరుతున్నారని తెలిపారు.
దరఖాస్తు విధానం..
- కేవలం ఆన్లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి.
- అప్లికేషన్ కోసం https://doms.iitm.ac.in/admission/ వెబ్సైట్ లోకి వెళ్లాలి.
- ఇన్స్ట్రక్షన్లు చదివి అప్లె ఆప్షన్ ఎంచుకోవాలి.
- విద్యార్హతల ధ్రువపత్రాలు, పని అనుభవం సర్టిఫికెట్లు పీడీఎఫ్(PDF) ఫార్మెట్లో అప్లోడ్ చేయాలి.
- అనంతరం పరీక్ష ఫీజు రూ.1,500 చెల్లించాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: EDUCATION, Exams, IIT Madras, NOTIFICATION, Study