మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీ(Technology)లో సైతం అనేక మార్పులొస్తున్నాయి. ఈ నూతన టెక్నాలజీపై పట్టు సాధించిన వారికే కొలువులు(Jobs) దక్కుతున్నాయి. అందుకే, ప్రతిష్టాత్మక ఐఐటీ, ఎన్ఐటీ విద్యాసంస్థలు కొత్త కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. గ్రామీణ విద్యార్థులను సైతం ఐటీ సెక్టార్లో(IT Sector) నియమించుకునేలా ఉచిత ఆన్‌లైన్ కోర్సులను ఆఫర్(Offer) చేస్తున్నాయి. తాజాగా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) మద్రాస్ డేటా సైన్స్‌పై ఉచిత ఆన్‌లైన్ ట్రైనింగ్ కోర్సు(Online Training Course)ను ప్రారంభించింది. స్వయం NPTEL ప్లాట్‌ఫారమ్ సహకారంతో ఈ ఆన్‌లైన్ కోర్సును ఆఫర్ చేస్తోంది. ‘పైథాన్ ఫర్ డేటా సైన్స్’ ఉచిత ఆన్‌లైన్ కోర్సుకు అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఐఐటీ మద్రాస్ ఉచిత డేటా సైన్స్ కోర్సు జనవరి 24 నుంచి 18 ఫిబ్రవరి 2022 మధ్య నాలుగు వారాల పాటు నిర్వహిస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు జనవరి 31లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
స్వయం ఎన్పీటీఈఎల్ సహకారంతో..
మొత్తం నాలుగు వారాల వ్యవధి గల ఈ కోర్సులో డేటా సైన్స్‌కు సంబంధించిన అన్ని టాపిక్స్‌ను కవర్ చేస్తుంది. అయితే, కోర్సు నేర్చుకోవాలనుకునే విద్యార్థులకు బేసిక్ డేటా సైన్స్ అల్గారిథమ్‌పై బేసిక్ నాలెడ్జ్ ఉండాలని తెలిపింది. ఈ కోర్సును ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్ రేగునాథ్ రంగస్వామి నిర్వహిస్తున్నారు. ఆయన గతంలో అమెరికాలోని టెక్సాస్ టెక్ యూనివర్సిటీలో కెమికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్‌గా, ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆప్టిమైజేషన్ కన్సార్టియం కో-డైరెక్టర్‌గా పనిచేశారు. అంతేకాదు, అమెరికాలోని క్లార్క్సన్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ఐఐటీ బాంబేలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా కూడా పనిచేశారు.
ఏ టాపిక్స్‌పై శిక్షణ ఉంటుంది?
డేటా సైన్స్ ఇంట్రడక్షన్, వర్కింగ్ డైరెక్టరీని సెట్ చేయడం, స్క్రిప్ట్ ఫైల్‌ను సృష్టించడం, సేవ్ చేయడం, ఫైల్ ఎగ్జిక్యూషన్, కన్సోల్‌ను క్లియర్ చేయడం, ఎన్విరాన్‌మెంట్ నుండి వేరియబుల్స్ తొలగించడం, ఎన్విరాన్‌మెంట్ క్లియర్ చేయడం మొదలైన టాపిక్స్ నేర్పిస్తారు.
సీక్వెన్స్ డేటా టైప్స్, అసోసియేటెడ్ యాక్టివిటీస్ స్ట్రింగ్స్, జాబితాలు, శ్రేణులు, గొట్టాలు, నిఘంటువు, సెట్‌లు, పరిధిపై శిక్షణనిస్తారు.
టయోటా కరోలా డేటాసెట్‌లో పాండాస్ డేటా ఫ్రేమ్, డేటా ఫ్రేమ్ సంబంధిత కార్యకలాపాలపై పట్టు సాధించవచ్చు.
మ్యాట్‌ప్లాట్‌లిబ్, సీబోర్న్ లైబ్రరీలను ఉపయోగించి టయోటో కరోలా డేటాసెట్ డేటా విజువలైజేషన్ ఎలా చేయాలో తెలుసుకోవచ్చు.
టయోటా కరోలా డేటాసెట్‌ని ఉపయోగించి కంట్రోల్ స్ట్రక్చర్స్ నియంత్రించడంపై శిక్షణనిస్తారు.
కోర్సు పూర్తయ్యాక సర్టిఫికెట్..
కోర్సు నమోదు చేసుకోవడం, నేర్చుకోవడం అంతా ఉచితం. అయితే, కోర్సులో పాల్గొనేవారు సర్టిఫికేట్‌లను పొందేందుకు రూ. 1000 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. 2022 మార్చి 27న పరీక్ష రాయాలి. సర్టిఫికెట్‌లో విద్యార్థుల పేరు, ఫోటో, స్కోర్ వంటివి పొందుపరుస్తారు. NPTEL, ఐఐటీ మద్రాస్ సహకారంతో ఈ కొత్త కోర్సును ఆఫర్ చేస్తున్నారు. మరింత సమాచారం కోసం ఐఐటీ మద్రాస్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.