హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

IIT Madras: ఐఐటీఎం టెక్నో సెంట్రల్ ఈవెంట్ గ్రాండ్‌ సక్సెస్‌.. రిజిస్టర్‌ చేసుకున్న 2,500 మంది పిల్లలు..

IIT Madras: ఐఐటీఎం టెక్నో సెంట్రల్ ఈవెంట్ గ్రాండ్‌ సక్సెస్‌.. రిజిస్టర్‌ చేసుకున్న 2,500 మంది పిల్లలు..

IIT Madras

IIT Madras

IIT Madras: దేశంలోని టాప్ ఇన్‌స్టిట్యూట్‌లలో ఐఐటీ మద్రాస్ ఒకటి. ఈ సంస్థకు చెందిన రీసెర్చ్ పార్క్ ఇటీవల, టెక్నో సెంట్రల్‌ను హోస్ట్ చేసింది. ఈ మెగా ఈవెంట్ ద్వారా పిల్లల కోసం ఆరు గేమిఫైడ్ లెర్నింగ్ పోటీలను నిర్వహించింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

దేశంలోని టాప్ ఇన్‌స్టిట్యూట్‌లలో ఐఐటీ మద్రాస్ (IIT Madras) ఒకటి. ఈ సంస్థకు చెందిన రీసెర్చ్ పార్క్ ఇటీవల, టెక్నో సెంట్రల్‌ను హోస్ట్ చేసింది. ఈ మెగా ఈవెంట్ ద్వారా పిల్లల కోసం ఆరు గేమిఫైడ్ లెర్నింగ్ పోటీలను నిర్వహించింది. ప్రధానంగా పైథాన్ కోడింగ్, రోబోటిక్స్, చెస్, క్విజ్, పోస్టర్ మేకింగ్, స్పీచ్ వంటి ఆరు అంశాలపై పోటీలను నిర్వహించారు. ఐఐటీ మద్రాస్ రీసెర్చ్ పార్క్, ఇంక్యుబేషన్ సెల్ ప్రెసిడెంట్ డాక్టర్ అశోక్ జున్‌జున్‌వాలా, బీఎన్‌ఐ చెన్నై ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సునీల్ సేథియా పోటీలను ప్రారంభించారు.

* సహకారం అందించిన ప్లాట్ ఫారమ్స్ ఇవే

ఈ మెగా ఈవెంట్‌ కోసం హ్యాకర్‌కిడ్(HackerKID), DIYA ల్యాబ్స్, Time2Chess వంటి ప్లాట్‌ఫారమ్స్ సహాయ సహకారాలు అందించాయి. ఆన్‌లైన్ కోడింగ్ గేమ్స్, మేకింగ్ రోబోటిక్ ప్రాజెక్ట్స్, చెస్ వంటివాటి ద్వారా ప్రాబ్లమ్-సాల్వింగ్, క్రియేటివిటీ, ఇన్నోవేషన్ వంటి కీలకమైన స్కిల్స్ పిల్లలు నేర్చుకోవడమే లక్ష్యంగా ఈ సంస్థలు తమ సహకారాన్ని అందించాయి.

* ప్రాంతీయ భాషల్లో కోడింగ్ తరగతులు

ఐఐటీ మద్రాస్ రీసెర్చ్ పార్క్, ఇంక్యుబేషన్ సెల్ ప్రెసిడెంట్ డాక్టర్ అశోక్ జున్‌జున్‌వాలా మాట్లాడుతూ.. పిల్లలు కోడింగ్ నేర్చుకోవడం, రోబోట్ ప్రాజెక్ట్‌లను తయారు చేయడం, చెస్‌లో గెలవడం వంటి యాక్టివిటీస్‌ను ఆస్వాదించారన్నారు. GUVIలో ప్రోగ్రామింగ్ తనను బాగా ఆకర్షించిందన్నారు. ప్రోగ్రామింగ్, లాంగ్వేజ్ వేర్వేరు విషయాలని పిల్లలకు అర్థమయ్యేలా GUVI ప్రాంతీయ భాషల్లో కోడింగ్ తరగతులను తీసుకు వచ్చిందన్నారు.

ఇది కూడా చదవండి : ఈ ఐదు దేశాల్లో తక్కువ ఖర్చుతో ఉన్నత విద్యను పూర్తి చేయవచ్చు..!

* దేశంలోనే మొట్టమొదటి గేమిఫైడ్ కోడింగ్

పైథాన్ కోడింగ్ కంటెస్ట్‌కు HackerKID వెబ్‌సైట్ సపోర్ట్ ఇచ్చింది. ఇది GUVI ఆధ్వర్యంలో పనిచేస్తుంది. GUVI అనేది ఐఐటీ మద్రాస్- ఐఐఎం అహ్మదాబాద్ ఇంక్యుబేటర్ EdTech కంపెనీ. HackerKID అనేది పిల్లల కోసం భారతదేశంలో మొట్టమొదటి గేమిఫైడ్ కోడింగ్అండ్ లెర్నింగ్ ఎన్విరాన్‌మెంట్.

* హై ఎనర్జీ లెవల్స్‌తో కోడింగ్

GUVI వ్యవస్థాపకుడు అరుణ్ ప్రకాష్ మాట్లాడుతూ.. చిన్న పిల్లలు గేమ్ ప్రాబ్లమ్స్ పరిష్కరించడానికి పోటీపడటం, ఈ సరదా ఛాలెంజ్‌ల ద్వారా సంతోషంగా నేర్చుకోవడం చాలా బాగుందన్నారు. పిల్లలు హై ఎనర్జీ లెవల్స్‌తో కోడింగ్ చేయడం చూసి ఆశ్చర్యపోయినట్లు ఆయన పేర్కొన్నారు. టెక్నో-సెంట్రల్ ఈవెంట్స్ తమ లక్ష్యాన్ని నెరవేర్చినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.

* పోటీల కోసం 2,500 మంది రిజిస్టర్

ఏడు నుంచి పదిహేడేళ్ల వయసు పిల్లలు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ పోటీల ద్వారా విద్యార్థుల్లో దాగి ఉన్న క్రియేటివిటీ, ఇన్నోవేషన్స్ బయటకు తీసుకురావడంపై దృష్టి పెట్టారు. పోటీల్లో గెలుపొందిన 100 మంది పిల్లలకు CUIC-అన్నా యూనివర్సిటీ మాజీ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ కలైసెల్వన్, ZOHO కార్ప్ ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ శ్రీమతి రాజలక్ష్మి శ్రీనివాసన్, స్టార్ ఇన్సూరెన్స్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ చిట్టిబాబు బహుమతులు ప్రదానం చేశారు. కాగా, ఈ పోటీల కోసం దాదాపు 2,500 మంది పిల్లలు రిజిస్టర్ చేసుకున్నారు.

First published:

Tags: Career and Courses, EDUCATION, IIT Madras, JOBS