ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ కోసం ఇన్నొవేటివ్ రిసెర్చ్ సెంటర్‌ను ప్రారంభించింది ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-మద్రాస్‌కు (IIT Madras) చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్. భారతదేశంలో గణితం- ఖగోళశాస్త్రం, ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్, వాస్తు అండ్ శిల్పశాస్త్రం, భారతీయ రాజకీయాలు - ఆర్థిక సమాలోచనలు, భారతీయ సౌందర్య శాస్త్రం - వ్యాకరణ సంప్రదాయాలు అనే నాలుగు అంశాలపై ఈ సెంటర్ దృష్టి సారించనుంది. ఈ సెంటర్ ఐఐటీ మద్రాస్‌లోని విద్యార్థుల కోసం థీమాటిక్‌కు సంబంధించిన కోర్సులను రూపొందించి, ఆఫర్ చేస్తుంది. తదనంతరం ఈ కోర్సులను విస్తృత వ్యాప్తి కోసం NPTEL ప్లాట్‌ఫారమ్‌లో అందించడానికి కూడా ప్రణాళికలు రచిస్తోంది.
ఈ కొత్త సెంటర్ ద్వారా భారతీయ నాలెడ్జ్ సిస్టమ్స్‌కు సంబంధించిన నాణ్యమైన పరిశోధనలను పబ్లిష్ చేయడమే ఐఐటీ మద్రాస్ లక్ష్యం. ఈ పరిశోధనల్లో అవుట్‌సైడ్ స్కాలర్స్, ఇన్‌స్టిట్యూట్స్ పాల్గొంటాయి. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులకు భారతీయ నాలెడ్జ్ సిస్టమ్స్‌కు సంబంధించిన వివిధ అంశాలపై పరిచయం చేయడానికి వర్క్‌షాప్‌లను నిర్వహించాలని ఈ సెంటర్ యోచిస్తోంది. అంతేకాకుండా ప్రముఖ రచనలు, సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా ప్రజలకు మరింత చేరువ కావడానికి ప్రణాళికలు రచిస్తోంది.
కాగా, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ సెంటర్‌ను న్యూఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్ (ICCR) ప్రెసిడెంట్ డాక్టర్ వినయ్ సహస్రబుద్ధే, డైరెక్టర్ జనరల్ కుమార్ తుహిన్ ప్రారంభించారు.
డాక్టర్ వినయ్ సహస్రబుద్ధే మాట్లాడుతూ.. సైన్స్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, భాషాశాస్త్రం, కళలు, సంస్కృతి, ఆర్థిక శాస్త్రం- రాజకీయాలు, ఇతర రంగాలలో ప్రపంచానికి భారతదేశం అందించిన సహకారాన్ని లోతుగా అధ్యయనం చేయడానికి, కనుగొన్న వాటిని ప్రజల్లో విస్తృత వ్యాప్తి చేయడం కోసం ఈ సెంటర్‌ను ప్రారంభించినట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి : Govt Jobs: ఉద్యోగ వేటలో ఉన్నారా? ఈవారం అప్లై చేసుకోవడానికి అందుబాటులో ఉన్న జాబ్స్ లిస్ట్ ఇదే..
* నాణ్యమైన పరిశోధనలే లక్ష్యం
ఐఐటీ మద్రాస్ డీన్ (గ్లోబల్ ఎంగేజ్‌మెంట్) ప్రొఫెసర్ రఘునాథన్ రెంగస్వామి మాట్లాడుతూ.. భారతీయ నాలెడ్జ్ సిస్టమ్స్‌లో నాణ్యమైన పరిశోధనలు చేయాలని ఈ సెంటర్‌కు విజ్ఞప్తి చేశారు. విదేశీ విద్యార్థులు భారతదేశంలో చదువుకోవడంతో పాటు భారతీయ క్యాంపస్‌ల అంతర్జాతీయకరణలో అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి ఈ సెంటర్ కృషి చేస్తుందని పేర్కొన్నారు.
ఈ సెంటర్‌కు డాక్టర్ ఆదిత్య కొలచన ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్‌గా వ్యవహరించనున్నారు. IIT మద్రాస్‌కు చెందిన ప్రొఫెసర్ అరుణ్ మీనన్, ప్రొఫెసర్ మనుసంతానం, ప్రొఫెసర్ సంతోష్ కుమార్ సాహు, ప్రొఫెసర్ సుదర్శన్ పద్మనాభన్, ప్రొఫెసర్ రాజేష్ కుమార్, ప్రొఫెసర్ జ్యోతిర్మయ త్రిపాఠి ఈ సెంటర్‌లో సభ్యులుగా ఉన్నారు. ఈ సెంటర్‌కు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖలోని ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ విభాగం నిధులు సమకూరుస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, EDUCATION, IIT Madras, JOBS