హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

IIT Madras: CAT స్కోరు అవసరం లేకుండానే ఐఐటీ మద్రాస్ నుంచి ఎంబీఏ కోర్సు.. అర్హతలివే..

IIT Madras: CAT స్కోరు అవసరం లేకుండానే ఐఐటీ మద్రాస్ నుంచి ఎంబీఏ కోర్సు.. అర్హతలివే..

IIT Madras: CAT స్కోరు అవసరం లేకుండానే ఐఐటీ మద్రాస్ నుంచి ఎంబీఏ కోర్సు..  అర్హతలివే..

IIT Madras: CAT స్కోరు అవసరం లేకుండానే ఐఐటీ మద్రాస్ నుంచి ఎంబీఏ కోర్సు.. అర్హతలివే..

IIT Madras: ఐఐటీ మద్రాస్‌లోని మేనేజ్‌మెంట్ స్టడీస్ డిపార్ట్‌మెంట్ ఈ కోర్సును రూపొందించింది. రెండేళ్ల పాటు కొనసాగే ఈ కోర్సులో ప్రాక్టీస్ ఓరియెంటెడ్ విధానంలో పాఠాలు చెప్పనున్నారు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

టాప్ ఐఐటీస్‌లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (IIT Madras) ఒకటి. ఐఐటీల్లో చదవడం చాలా మంది విద్యార్థుల (Students) కల. అయితే ఇది అందరికీ సాధ్యం కాదు. ఐఐటీల్లో సీట్ లభించని విద్యార్థుల కోసం, ఐఐటీ మద్రాస్ పలు ఆన్‌లైన్ కోర్సులు, సర్టిఫికేషన్ ప్రోగ్రామ్, స్కిల్డ్ ప్రోగ్రామ్స్‌కు ఇటీవల శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా మిడ్-కెరీర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్‌ కోసం ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ (EMBA) కోర్సును ఆఫర్ చేస్తోంది. ఐఐటీ మద్రాస్‌లోని మేనేజ్‌మెంట్ స్టడీస్ డిపార్ట్‌మెంట్ ఈ కోర్సును రూపొందించింది. రెండేళ్ల పాటు కొనసాగే ఈ కోర్సులో ప్రాక్టీస్ ఓరియెంటెడ్ విధానంలో పాఠాలు చెప్పనున్నారు. ప్రోగ్రామ్‌ కోసం క్యాట్ స్కోరు కూడా అవసరం లేదు.

ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ(EMBA) కోర్సు తరగతులు బ్లెండెడ్ విధానంలో(ఫిజికల్ అండ్ వర్చువల్) నిర్వహించనున్నారు. అది కూడా వారాంతాల్లోనే ఆల్టర్‌నేటివ్‌గా క్లాసులు జరుగుతాయి. అంటే ఒకవారం ఫిజికల్‌గా, మరోవారం వర్చువల్‌గా కొనసాగుతాయి. కాగా, కోర్సు జనవరి 2023 నుంచి ప్రారంభం కానున్నట్లు ఐఐటీ మద్రాస్ వెల్లడించింది.

* అప్లికేషన్ చివరి తేదీ

ఈ కోర్సుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే (సెప్టెంబర్ 5)ప్రారంభమైంది. అర్హత ఉన్న అభ్యర్థులు ఐఐటీ మద్రాస్ అధికారిక వెబ్ సైట్ doms.iitm.ac.in/emba ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబర్ 10గా నిర్ణయించారు.

* కోర్సు పరిధిలోని అంశాలు..

ఈ ప్రోగ్రామ్ ద్వారా సోషల్ మీడియా, ఇంటర్నెట్ మార్కెటింగ్‌‌పై అభ్యర్థులకు అవగాహన కల్పించనున్నారు. మోడ్రన్ మాన్యుప్యాక్చరింగ్ ప్రాసెస్, త్రీడీ ప్రింటింగ్ వంటి టెక్నికల్ అంశాలపై కూడా అభ్యర్థులకు లోతైన పరిజ్ఞానాన్ని అందించనున్నారు. సమకాలీన బిజినెస్, ఫైనాన్షియల్ ప్లాట్‌ఫారమ్స్, వరల్డ్ బిజినెస్ మేనేజ్‌మెంట్, సైబర్ సెక్యూరిటీ అండ్ అప్లికేషన్స్, బిజినెస్ మోడల్స్ అండ్ ఇన్నొవేషన్ రిలేటెడ్ టాపిక్స్‌పై ఈ కోర్సు దృష్టి సారించనుంది.

ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ప్రోగ్రామ్‌కు ఇండస్ట్రీ నుంచి చాలా సపోర్ట్ లభిస్తోందన్నారు ఐఐటీ మద్రాస్‌ మేనేజ్‌మెంట్ స్టడీస్ డిపార్ట్‌మెంట్ హెడ్ ప్రొఫెసర్ ఎం. తేన్‌మొళి. వివిధ డొమైన్‌ల నుంచి సగటున 11 సంవత్సరాల విభిన్న ఎక్స్‌పీరియన్స్‌తో అభ్యర్థులు ఉంటారని చెప్పారు. మేనేజ్‌మెంట్ స్టడీస్ డిపార్ట్‌మెంట్ బలమైన అధ్యాపక బృందం కోర్సులో భాగంగా పాఠాలు చెప్పనుందని తేన్‌మొళి తెలిపారు.

ఇది కూడా చదవండి : నిరుద్యోగులకు అలర్ట్.. ఈ వారం అప్లై చేసుకోవాల్సిన జాబ్స్ లిస్ట్ ఇదే.. త్వరపడండి..

* అర్హతలు

ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు, ఏదైనా విభాగంలో ఫస్ట్-క్లాస్ మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి. అలాగే కనీసం మూడు సంవత్సరాల ఇండస్ట్రీ ఎక్స్‌పీరియన్స్ కూడా తప్పనిసరి.

* ఎంపిక ప్రక్రియ

ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ (EMBA) కోర్సులో ప్రవేశం పొందాలంటే, ఐఐటీ మద్రాస్‌లోని మేనేజ్‌మెంట్ స్టడీస్ డిపార్ట్‌మెంట్ నిర్వహించే ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ రెండు దశల్లో క్వాలిఫై అయిన వారు కోర్సులో చేరడానికి అడ్మిషన్ పొందుతారు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Career and Courses, EDUCATION, IIT Madras, JOBS, Mba

ఉత్తమ కథలు