హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

IIT Madras:విద్యార్థులకు ఐఐటీ మద్రాస్ బంపర్ ఆఫర్.. డేటా సైన్స్ లో కొత్త కోర్సులు.. ఇది చదివితే జాబ్ గ్యారెంటీ!

IIT Madras:విద్యార్థులకు ఐఐటీ మద్రాస్ బంపర్ ఆఫర్.. డేటా సైన్స్ లో కొత్త కోర్సులు.. ఇది చదివితే జాబ్ గ్యారెంటీ!

 విద్యార్థులకు ఐఐటీ మద్రాస్ బంపర్ ఆఫర్.. డేటా సైన్స్ లో కొత్త కోర్సులు.. ఇది చదివితే జాబ్ గ్యారెంటీ!

విద్యార్థులకు ఐఐటీ మద్రాస్ బంపర్ ఆఫర్.. డేటా సైన్స్ లో కొత్త కోర్సులు.. ఇది చదివితే జాబ్ గ్యారెంటీ!

బీఎస్సీ ఇన్ ప్రోగ్రామింగ్ అండ్ డేటా సైన్స్‌లో ఆన్‌లైన్ కోర్సు(Course)లకు ఇటీవల డిమాండ్ బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో అగ్రశేణి సంస్థ ఐఐటీ(IIT) మద్రాస్, బీఎస్ డిగ్రీ కోర్సును ఆఫర్ చేస్తోంది. డేటా సైన్స్ అండ్ అప్లికేషన్‌లలో నాలుగు సంవత్సరాల BS డిగ్రీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఇంకా చదవండి ...

ఇన్ ప్రోగ్రామింగ్ అండ్ డేటా సైన్స్‌లో ఆన్‌లైన్ కోర్సులకు ఇటీవల డిమాండ్ బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో అగ్రశేణి సంస్థ ఐఐటీ(IIT) మద్రాస్, బీఎస్ డిగ్రీ కోర్సును ఆఫర్ చేస్తోంది. డేటా సైన్స్ అండ్ అప్లికేషన్‌లలో నాలుగు సంవత్సరాల BS డిగ్రీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దేశవ్యాప్తంగా విద్యార్థుల(Students) నుంచి బలమైన డిమాండ్‌ రావడంతో ఈ కోర్సును అందుబాటులోకి తెచ్చినట్లు ఇన్‌స్టిట్యూట్ పేర్కొంది. బీఎస్ డీగ్రీ(Degree)లో భాగంగా 8 నెలల అప్రెంటిస్‌షిప్ లేదా పరిశోధనా సంస్థలతో ఒక ప్రాజెక్ట్ ఉంటుంది.

ప్రస్తుతం 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు కూడా ఈ ఆన్‌లైన్ కోర్సు (Courses)కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అడ్మిషన్ పొందిన విద్యార్థులు తమ 12వ తరగతిని విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత ప్రోగ్రామ్‌ను ప్రారంభిస్తారు. ఏ స్ట్రీమ్‌ విద్యార్థులైనా కోర్సు కోసం నమోదు చేసుకోవచ్చు. వయోపరిమితి నిబంధనలు కూడా లేవు. 10వ తరగతిలో ఇంగ్లీష్, గణితం చదివిన వారు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. తరగతులు ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ఈ డేటా సైన్స్ ప్రోగ్రామ్ సెప్టెంబర్ 2022 టర్మ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్టు 19గా నిర్ణయించారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు onlinedegree.iitm.ac.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

 జేఈఈ స్కోర్ అవసరం లేదు

బీఎస్ డిగ్రీ ఆన్‌లైన్ కోర్సు కోసం జేఈఈ స్కోర్ అవసరం లేదు. దీంతో గ్రామీణ ప్రాంతాలు, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఇది ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది. అంతేకాకుండా అర్హులైన విద్యార్థులకు 100% వరకు స్కాలర్‌షిప్‌లను కూడా అందిస్తామని ఇన్‌స్టిట్యూట్ తెలిపింది. మల్టిపుల్ ఎంట్రెన్స్ అండ్ ఎగ్జిట్ ఆప్షన్‌తో ఈ కోర్సును రూపకల్పన చేశారు. దీంతో అభ్యర్థులు ఒక సర్టిఫికేట్, డిప్లొమా, డిగ్రీ పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే అది వారు కోర్సు నుంచి నిష్ర్కమించే స్థాయిని బట్టి ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ ద్వారా అభ్యర్థులు ఏమి నేర్చుకోవాలనుకుంటున్నారో ఎంపిక చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది.

ఇదీ చదవండి: Indian Villages: టూర్ ప్లాన్ చేస్తున్నారా ? నార్త్ లో ఈ ప్రాంతాలకు వెళ్తే.. ఎప్పటికీ మీరు మరచిపోలేరు..! విద్యార్థులు ఏం నేర్చుకుంటారు?

డేటాను మేనేజ్ చేయడంతోపాటు మేనేజరల్ ఇన్‌స్టైట్స్, మోడల్స్ రూపొందించడానికి అవసరమైన విజువల్ ప్యాట్రన్స్‌ను కోర్సు ద్వారా విద్యార్థులు నేర్చుకోనున్నారు. తద్వారా సమర్థవంతమైన వ్యాపార నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. విస్తృతమైన శిక్షణ, ఎక్స్‌పీరియన్స్ లెర్నింగ్ ద్వారా విద్యార్థులు పరిశ్రమ ప్రమాణాలకు అనుగుణంగా తర్పీదు పొందనున్నారు. ఈ ప్రోగ్రామ్‌లో డిప్లొమా లెవల్ పూర్తి చేసిన విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లు, ప్లేస్‌మెంట్‌లను కూడా సులభతరం చేస్తామని ఇన్‌స్టిట్యూట్ తెలిపింది.

కాగా, ఇప్పటికే 13వేలకు పైగా విద్యార్థులు ఈ ఆన్ లైన్ కోర్సు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఎక్కువ భాగం తమిళనాడు నుంచి వచ్చాయి. ఈ కోర్సులో అడ్మిషన్లు చేపట్టడానికి అర్హత పరీక్షను నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా 111 నగరాల్లో 116 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష జరగనుంది. అంతేకాకుండా యూఏఈ, బహ్రెయిన్, కువైట్, శ్రీలంకలో కూడా ఎగ్జామ్ సెంటర్స్ ఏర్పాటు చేయనున్నారు.

First published:

Tags: IIT Madras, Internship, JOBS, Online course

ఉత్తమ కథలు