హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్ గురించి డౌట్స్ ఉన్నాయా..? అయితే, ఈ గోల్డెన్ ఛాన్స్ మీ కోసమే..

JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్ గురించి డౌట్స్ ఉన్నాయా..? అయితే, ఈ గోల్డెన్ ఛాన్స్ మీ కోసమే..

JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్ గురించి డౌట్స్ ఉన్నాయా..? అయితే, ఈ గోల్డెన్ ఛాన్స్ మీ కోసమే..

JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్ గురించి డౌట్స్ ఉన్నాయా..? అయితే, ఈ గోల్డెన్ ఛాన్స్ మీ కోసమే..

JEE Advanced: మంచి ర్యాంక్ వచ్చాక ఏ ఐఐటీలో చేరాలి, ఏ కోర్సును ఎంచుకోవాలి.. అని విద్యార్థులకు చాలా డౌట్స్ వస్తుంటాయి. ఈ కీలక విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోతే వారు మంచి కాలేజీలో చేరే అవకాశాన్ని కోల్పోతారు. అలాంటి వారి కోసమే ఈ గోల్డెన్ ఛాన్స్.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఐఐటీలలో బీటెక్ (B.Tech) కోర్సుల్లో చేరాలనుకునే కోరిక చాలా మంది విద్యార్థుల్లో ఉంటుంది. ఆ కోరికను జేఈఈ అడ్వాన్స్‌డ్‌ (JEE Advanced) ఎగ్జామ్‌ ద్వారా నెరవేర్చుకునేందుకు విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు. అయితే మంచి ర్యాంక్ వచ్చాక ఏ ఐఐటీలో చేరాలి, ఏ కోర్సును ఎంచుకోవాలి.. అని విద్యార్థులకు చాలా డౌట్స్ వస్తుంటాయి. ఈ కీలక విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోతే వారు మంచి కాలేజీలో చేరే అవకాశాన్ని కోల్పోతారు. ఫలితంగా అనుకున్న స్థాయిలో బీటెక్ కోర్సుల్లో రాణించలేకపోతారు. అయితే ఇలాంటి పరిస్థితి ఏ విద్యార్థికీ రాకూడదనే ఉద్దేశంతో ఒక గొప్ప ఆలోచన చేశారు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (IIT, Madras) పూర్వ విద్యార్థులు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ గురించి విద్యార్థుల సందేహాలన్నీ తీర్చేందుకు 'AskIITM.com' అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించారు.

తాజా పోర్టల్ గురించి మరిన్ని వివరాలు వెల్లడించారు ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్. V. కామకోటి. జేఈఈ అభ్యర్థులు పరీక్షలు, కాలేజీ ఛాయిస్ వంటి సంబంధిత సమాచారాన్ని ఇంటర్నెట్ లేదా సోషల్ మీడియాలో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ ఆ సమాచారమంతా ఎలాంటి స్పష్టత లేకుండా ఉండి విద్యార్థులను మరింత గందరగోళానికి గురి చేస్తుందని తెలిపారు. వారందరికీ నమ్మదగిన సమాచారం తెలుసుకునేందుకు ఒక సోర్స్ ఉండటం ఇప్పుడు అత్యావశ్యకంగా మారిందన్నారు. ఇదే లోటును తమ ఐఐటీ పూర్వ విద్యార్థులు గుర్తించి AskIITMను డిజైన్ చేశారని పేర్కొన్నారు.

* ఎలా హెల్ప్ అవుతుంది?

ఐఐటీ మద్రాస్ ఇన్‌స్టిట్యూట్‌కు సంబంధించిన ప్రశ్నలను అభ్యర్థులు అడగడానికి ఆస్క్ ఐఐటీఎం.కాం (AskIITM.com) వెబ్‌సైట్ ఉపయోగపడుతుంది. ఈ ప్రశ్నలకు ఐఐటీ పూర్వ విద్యార్థులు, విద్యార్థి వాలంటీర్ల బృందం 48 గంటల్లో సమాధానం ఇస్తుంది. క్వశ్చన్స్ అడిగిన ప్రతి ఒక్కరికీ ఈ-మెయిల్/ వాట్సాప్ ద్వారా సమాధానమిస్తుంది. ఇతరులకు కూడా ఇదే సందేహం వస్తే వారికి సమాధానం వెంటనే తెలిసేలా కొత్త ప్రశ్నను, దానికి సమాధానాన్ని సైట్‌లో పోస్ట్ చేస్తుంది.

* ఉద్యోగాల గురించి కూడా..

ఇదే సైట్‌ ద్వారా జేఈఈ అడ్వాన్స్‌డ్‌ అభ్యర్థులు నేరుగా ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థులను కాంటాక్ట్ చేసి IIT మద్రాస్‌లో ప్లేస్‌మెంట్లు ఎలా ఉంటాయో తెలుసుకోవచ్చు. అలాగే ఈ సంస్థలోని ఫ్యాకల్టీ, విద్యావేత్తలు, క్యాంపస్ సంస్కృతి వంటి అనేక రకాల విషయాల గురించి అడిగి తెలుసుకోవచ్చు. ఒక విద్యార్థి ఐఐటీ మద్రాస్ లో ఎందుకు చేరాలి? అనే వివరాలన్నింటినీ పూర్వ విద్యార్థులు వివరంగా అందిస్తారు.

ఇది కూడా చదవండి : నిరుద్యోగులకు అలర్ట్.. ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు త్వరలో ముగియనున్న దరఖాస్తు ప్రక్రియ..

www.askiitm.com ద్వారా చాలా ప్రశ్నలు, వాటికి సమాధానం తెలుసుకొని ఈ సంస్థ గురించి పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకోవచ్చు. ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే ఈ వెబ్‌సైట్‌లో సొంతంగా ప్రశ్నలు వేయొచ్చు. పూర్వ విద్యార్థులు నిర్వహించే ఈ వెబ్‌సైట్ IIT మద్రాస్‌లో చేరాలనుకునే అభ్యర్థులకు బాగా ఉపయోగపడుతుంది. ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థులు అప్‌కమింగ్ ఈవెంట్లను కూడా నిర్వహించనున్నారు. వాటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు https://www.askiitm.com/events విజిట్ చేయవచ్చు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Career and Courses, IIT Madras, Jee, JOBS

ఉత్తమ కథలు