హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

IIT Kharagpur: టాప్ 100 జేఈఈ అడ్వాన్స్‌డ్ ర్యాంకర్లకు... ప్రత్యేక​ స్కాలర్​షిప్

IIT Kharagpur: టాప్ 100 జేఈఈ అడ్వాన్స్‌డ్ ర్యాంకర్లకు... ప్రత్యేక​ స్కాలర్​షిప్

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

దేశంలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థ అయిన ఇండియన్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఖరగ్‌పూర్ కొత్త స్కాలర్​షిప్​లను ప్రకటించింది. ఐఐటీ ఖరగ్​పూర్​ను స్థాపించి 71 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఫుల్​ రైడ్ పేరుతో​ స్కాలర్​షిప్​ను ప్రారంభించింది.

ఇంకా చదవండి ...

దేశంలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థ అయిన ఇండియన్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఖరగ్‌పూర్ కొత్త స్కాలర్​షిప్​లను ప్రకటించింది. ఐఐటీ ఖరగ్​పూర్​ను స్థాపించి 71 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఫుల్​ రైడ్ పేరుతో​ స్కాలర్​షిప్​ను ప్రారంభించింది. రాబోయే 2021–22 విద్యా సంవత్సరం నుంచి టాప్ 100 జేఈఈ అడ్వాన్స్‌డ్ ర్యాంకర్స్​కు ఈ స్కాలర్​షిప్​ అందజేస్తామని తెలిపింది. ఇందులో భాగంగా బీటెక్​ కోర్సు మొత్తానికి అయ్యే ఖర్చులను భరిస్తామని పేర్కొంది.

దీనిపై ఐఐటీ ఖరగ్‌పూర్ డైరెక్టర్ ప్రొఫెసర్ వీరేంద్ర కుమార్ తివారీ మాట్లాడుతూ ‘‘2021 ఆగస్టు 18 నాటికి ఐఐటీ ఖరగ్‌పూర్ స్థాపించి 71 ఏళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఫుల్​ రైడ్ స్కాలర్‌షిప్​ను ప్రారంభిస్తున్నాం. 2021–22 విద్యాసంవత్సరం నుంచి ఇది అమల్లోకి వస్తుంది. జేఈఈ అడ్వాన్స్​డ్​లో టాప్ 100 ర్యాంకర్లకు మాత్రమే దీన్ని అందజేస్తున్నాం. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ప్రతిభ కనబర్చిన విద్యార్థుల చదువుకు మద్ధతివ్వడం కొరకు దీన్ని ప్రారంభించాం. అయితే తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. 20 లక్షల కంటే తక్కువ ఉన్న విద్యార్థులకే ఈ స్కాలర్​షిప్​ అందజేస్తాం” అని తెలిపారు.

ఆర్థికపరమైన అడ్డంకుల కారణంగా ఏ ఒక్క మెరిటోరియస్ విద్యార్థి ఇబ్బంది పడకూడదని, వారికి ఆర్థిక చేయూతనివ్వాలనే ఉద్దేశ్యంతో ఈ స్కాలర్​షిప్​ను ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. ‘‘ప్రతిభావంతులైన విద్యార్థులందర్నీ ఉన్నత విద్య వైపు ప్రోత్సహించడం మా బాధ్యతగా భావిస్తున్నాం. ఈ స్కాలర్‌షిప్​ను పండిట్ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ (ఈశ్వర్ చంద్ర బందోపాధ్యాయ్) పేరు మీద ఏర్పాటు చేశాం. సంస్కృతం, భారతీయ తత్వశాస్త్రంలో అపారమైన జ్ఞానంతో అనేక అవార్డులు పొందిన విద్యాసాగర్​ పేరుతో దీన్ని ప్రారంభించడం సంతోషంగా ఉంది. ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ కులం, మతం, లింగంతో సంబంధం లేకుండా పురుషులు, మహిళలు అందరికీ సమాన విద్యను అందించడానికి అంతులేని కృషి చేశారు” అని తివారీ వివరించారు.

స్కాలర్‌షిప్ కింద చెల్లించే ఫీజులు ఇవే..

ఉన్నత విద్యకు పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు అవుతుంది. అయితే చాలా మంది విద్యార్ధులకు ప్రతిభ ఉన్నప్పటికీ, ఆర్థిక పరిస్థితుల కారణంగా ఉన్నత చదువులకు దూరమవుతుంటారు. వారికి అండగా నిలిచేందుకు ఐఐటీ ఖరగ్​పూర్​ ఈ స్కాలర్​షిప్​ను ప్రారంభించింది. దీని కింద కేవలం ట్యూషన్ ఫీజులు మాత్రమే కాకుండా, పుస్తకాలు, రవాణా, ఆహారం, బస ఇలా విద్యార్థికి అయ్యే ఖర్చులన్నింటినీ ఐఐటీ ఖరగ్​పూర్​ భరిస్తుంది.

Published by:Krishna Adithya
First published:

Tags: IIT, JEE Main 2021

ఉత్తమ కథలు