ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, జీఎఫ్‌టీఐ లాంటి విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ 2021 (JEE advanced 2021) ఫలితాలు (results) నేడు విడుదల అయ్యాయి. ఈ మేరకు ఐఐటి ఖరగ్‌పూర్ (IIT Kharagpur) ఫలితాలు విడుదల చేసింది. జేఈఈ ఫలితాల్లో జైపూర్‌కు చెందిన మృదుల్ అగర్వాల్ (mridul Agarwal) అత్యధిక మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలిచాడు. అతను 360 మార్కులకు 348 మార్కులు సాధించాడు. ఇక బాలికల (girls) విభాగంలో కావ్య చోప్రా (Kavya chopra) టాపర్‌గా నిలిచింది. ఢిల్లీ (Delhi)కి చెందిన కావ్య 360 కి 286 మార్కులు సాధించింది. పరీక్ష రాసిన అభ్యర్థులు http,//jeeadv.ac.in/ వెబ్సైట్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
మృదుల్ అగర్వాల్ రికార్డు..
కాగా, మృదుల్ గత పదేళ్ల JEE అడ్వాన్స్డ్ పరీక్షలో అత్యధిక పర్సంటైల్ సాధించిన విద్యార్థిగా రికార్డు సృష్టించాడు. మృదుల్ మొత్తం 360 మార్కులకు 348 మార్కులు సాధించి 96.66 % సాధించాడు. 2011 నుంచి ఇప్పటివరకు JEE అడ్వాన్స్డ్ పరీక్షలో విద్యార్థులు సాధించిన అత్యధిక పర్సంటైల్ (highest percentile) ఇది. JEE మెయిన్ 2021 లో మృదుల్ సెషన్ 1, సెషన్ 2 లలో 300 స్కోర్‌తో 100 శాతం స్కోర్ సాధించాడు. గత సంవత్సరం జేఈఈ అడ్వాన్స్డ్ టాపర్ (Topper) 396 మార్కులకు 352 మార్కులతో 88.88 శాతం మార్కులు సాధించిన విషయం తెలిసిందే.
వీరే కేటగిరీల వారీగా టాపర్లు..
ఆలిండియా ర్యాంక్ 1: మృదుల్ అగర్వాల్, OBC ర్యాంక్ 1: ప్రియాంశు యాదవ్,
EWS ర్యాంక్ 1: రామస్వామి సంతోష్ రెడ్డి, SC ర్యాంక్ 1: నందిగామ నిఖిల్,
ST ర్యాంక్ 1: బిజిలి ప్రచితన్ వర్మ, PwD ర్యాంక్ 1: అర్ణవ్ జైదీప్ కల్గుత్కర్,
EWS-PwD ర్యాంక్ 1: యువరాజ్ సింగ్, OBC- PwD Rank 1: గొర్లె కృష్ణ చైతన్య,
SC-PwD ర్యాంక్ 1: రాజ్ కుమార్, ST-PwD ర్యాంక్ 1: రవి శంకర్ మీనా.
JEE (అడ్వాన్స్డ్) 2021 లో 1 మరియు 2 పేపర్లకు మొత్తం 1,41,699 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 41,862 మంది అభ్యర్థులు JEE (అడ్వాన్స్డ్) 2021 అర్హత సాధించారు. అర్హత సాధించిన అభ్యర్థులలో 6452 మంది బాలికలు ఉన్నారు.
ఈ నెల 3వ తేదీన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్ 2 పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. పేపర్ 1, పేపర్ 2 ఒక్కో పేపర్ 180 మార్కుల చొప్పున రెండు పేపర్లు 360 మార్కులకు పరీక్ష నిర్వహించారు. ప్రతి సబ్జెక్టు నుంచి 19 ప్రశ్నల చొప్పున ఒక్కో పేపర్లో మొత్తం 57 ప్రశ్నలతో ప్రశ్నాపత్రం (Question paper) ఇచ్చారు. గత ఏడాదికి భిన్నంగా ప్రశ్నలు, మార్కులు ఉండటంతో గత ఏడాదితో పోల్చలేని పరిస్థితి నెలకొందని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే మొత్తంగా గత ఏడాది కంటే ఈసారి జేఈఈ అడ్వాన్స్డ్ ప్రవేశ పరీక్ష కఠినంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి సుమారు 25 వేల మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు హాజరయ్యారు.
జోసా (జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ) ఆధ్వర్యంలో శనివారం (అక్టోబర్ 16) నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. జోసా కౌన్సెలింగ్ ద్వారా దేశవ్యాప్తంగా 23 ఐఐటీలు, 31 ఎన్ఐటీలు, 20 జీఎఫ్‌టీఐ (గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్), 23 ట్రిపుల్ ఐటీల వంటి 97 విద్యా సంస్థల్లో సీట్ల భర్తీకి చేయనున్నారు.
జోసా కౌన్సెలింగ్ శనివారం ప్రారంభమై నవంబర్ 18 వరకు ఆరు విడతల్లో నిర్వహించనున్నారు. మొదటి విడత కౌన్సెలింగ్‌కు సంబంధించిన సీట్లను ఈ నెల 27న కేటాయిస్తారు. నవంబర్ 1న రెండో విడత సీట్లు, నవంబర్ 6న మూడో విడత, 10న నాలుగవ విడత, 14న ఐదు, 18న చివరి విడత సీట్లు కేటాయించనున్నారు. ఆఖరి విడతలో సీట్లు దక్కిన వాళ్లు నవంబర్ 20 నాటికి రిపోర్ట్ చేయాలి.
జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకులు వెలువడిన తర్వాత ఈ నెల 16 నుంచి 25 వరకు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకుని వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే అడ్మిషన్ కోల్పోవాల్సి వస్తుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి విద్యార్థి కళాశాలలను ఎంపిక చేసుకోవాలి. లేదంటే సీటు కేటాయించరు.
జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఏయే విద్యాసంస్థలో, ఏయే కోర్సుల్లో సీటు కావాలనుకుంటున్నారో ముందుగానే ఆన్లైన్లో ఆప్షన్లను నమోదు చేసుకోవాలి. ఎన్ని ఆప్షన్లు అయినా వరుస క్రమంలో ఇచ్చుకునే వెసులుబాటు ఉంటుంది. `
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IIT, Jee, JEE Main 2021, Results