హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

GATE 2023: అక్టోబర్ 20 వరకు గేట్‌ అప్లికేషన్ కరెక్షన్ విండో ఓపెన్.. ఆందోళన అక్కర్లేదు..!

GATE 2023: అక్టోబర్ 20 వరకు గేట్‌ అప్లికేషన్ కరెక్షన్ విండో ఓపెన్.. ఆందోళన అక్కర్లేదు..!

GATE 2023

GATE 2023

GATE 2023: గేట్ 2023 రిజిస్ట్రేషన్‌ సమయంలో వెబ్‌సైట్‌లో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయని విద్యార్థుల నుంచి ఆందోళన వ్యక్తమైంది. అయితే, విద్యార్దులకు గుడ్ న్యూస్ చెప్పింది ఐఐటీ కాన్పూర్.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఇంజనీరింగ్ మాస్టర్స్ ఎంట్రన్స్, రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్ GATE (గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌)-2023 నోటిఫికేషన్‌ ఇటీవల విడుదలైంది. దేశంలోని టాప్ ఇంజనీరింగ్(Engineering) కాలేజీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు ఈ ఎగ్జామ్‌ నిర్వహిస్తారు. ఈ ఏడాది గేట్‌ ఎగ్జామ్‌ను IIT కాన్పూర్‌ (IIT Kanpur) నిర్వహిస్తోంది. ప్రస్తుతం గేట్‌ రిజిస్ట్రేషన్‌ (Gate Registration) ప్రక్రియ కొనసాగుతోంది. అయితే గేట్ 2023 రిజిస్ట్రేషన్‌ సమయంలో వెబ్‌సైట్‌లో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయని విద్యార్థుల నుంచి ఆందోళన వ్యక్తమైంది. దీంతో దీనికి సంబంధించి ఐఐటీ కాన్పూర్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపింది.

* కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు

విద్యార్థుల నుంచి ఆందోళన వ్యక్తమైన తర్వాత.. ఐఐటీ కాన్పూర్‌ అధికారులు సమస్యను గుర్తించారు. ఐఐటీ కాన్పూర్ గేట్‌ 2023 అప్లికేషన్ విండోలోని రెక్టిఫికేషన్ పోర్టల్‌లో ప్రస్తుతం కొన్ని సమస్యలు ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు. వెబ్‌సైట్‌లో తలెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కొత్తగా మళ్లీ దరఖాస్తులు చేయాల్సిన అవసరం లేదని ఐఐటీ కాన్పూర్ అధికారులు కోరారు.

* అక్టోబర్‌ 7 వరకు రిజిస్ట్రేషన్లు

గేట్‌ 2023 అభ్యర్థులు పరీక్ష కోసం దరఖాస్తు చేసుకునేందుకు రిజిస్ట్రేషన్ విండో 2022 అక్టోబర్ 7 వరకు అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా గేట్‌ 2023 రిజిస్ట్రేషన్‌ను ఎటువంటి అదనపు ఆలస్య రుసుము లేకుండా సెప్టెంబర్ 30 వరకు పూర్తి చేయవచ్చు. ఆ తర్వాత కూడా విద్యార్థులకు వారం రోజుల సమయం ఉంటుంది. అయితే ఆలస్య రుసుమును చెల్లించాల్సి ఉంటుంది.

* అక్టోబర్‌ 20 వరకు కరెక్షన్లకు అవకాశం

రిజిస్ట్రేషన్ ముగిసిన తర్వాత.. గేట్‌ 2023 కరెక్షన్‌ విండో ఓపెన్‌ అవుతుంది. లోపాలను సరిదిద్దుకోవడానికి, ఎగ్జామ్‌ సెంటర్‌ను మార్చుకోవడానికి విద్యార్థులకు అవకాశం ఉంటుంది. కరెక్షన్‌ విండో అక్టోబర్ 20 వరకు అందుబాటులో ఉంటుందని ఐఐటీ కాన్పూర్ తెలిపింది. గేట్‌ 2023 పరీక్ష 2023 ఫిబ్రవరిలో నిర్వహించాలని నిర్ణయించారు.

ఇది కూడా చదవండి : తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. స్పెషల్ రిక్రూట్‌మెంట్ ద్వారా 2500 మందికి ఉద్యోగాలు ..

దానికి సంబంధించిన అడ్మిట్ కార్డ్‌లు 2022 జనవరి 3న gate.iitk.ac.inలో అందుబాటులోకి వస్తాయి. పరీక్షకు హాజరు కావడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయడం మేలని నిపుణులు సూచిస్తున్నారు. గేట్‌ స్కోర్ 5 సంవత్సరాల వరకు వ్యాలిడ్‌గా ఉంటుంది. గేట్‌ ఆధారంగా జరిగే రిక్రూట్‌మెంట్‌లకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు ఆ సంవత్సరం పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది.

* ఐఐటీ కాన్పూర్‌ నోటీసు

ఐఐటీ కాన్పూర్‌ వెబ్‌సైట్‌లో పెట్టిన నోటీసులో.. ‘అప్లికేషన్‌ విండో క్లోస్‌ అయిన తర్వాత, రెండు వారాల వరకు అంటే అక్టోబర్ 20 వరకు మిస్టేక్స్‌ను సరిదిద్దడానికి సమయం ఉంటుందని గమనించండి. దరఖాస్తులోని లోపాల కోసం మీరు కొత్త దరఖాస్తును సమర్పించాల్సిన అవసరం లేదని గమనించండి.’ అని పేర్కొంది.

First published:

Tags: Career and Courses, EDUCATION, Gate 2023, IIT, JOBS

ఉత్తమ కథలు