IIT Kanpur: ఒలింపియాడ్‌లకు అర్హత సాధించిన విద్యార్థులకు నేరుగా ఐఐటీల్లోకి ప్ర‌వేశం..

ప్రతీకాత్మక చిత్రం

IIT Kanpur : కాన్పూర్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (Indian Institute of Technology) విద్యార్థుల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. ఒలింపియాడ్‌లలో పాల్గొన్న విద్యార్థులకు పోటీలో వారి పనితీరు ఆధారంగా నేరుగా అడ్మిషన్లు అందించడాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.

 • Share this:
  కాన్పూర్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (Indian Institute of Technology) విద్యార్థుల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. ఒలింపియాడ్‌లలో పాల్గొన్న విద్యార్థులకు పోటీలో వారి పనితీరు ఆధారంగా నేరుగా అడ్మిషన్లు అందించడాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా అంతర్జాతీయ ఒలింపియాడ్‌లకు అర్హత సాధించిన విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్ (JEE Advanced) ప్రవేశ పరీక్షను రాయ‌కున్నా.. నేరుగా IIT లలో ప్రవేశం పొందే అవ‌కాశాన్ని క‌ల్పించ‌నుంది. చాలా మంది విద్యార్థులు అంత‌ర్జాతీయ స్థాయిలో ఒలంపియాడ్‌ల‌లో ప్ర‌తిభ చూపేందుకు ఎంతో మెరుగ్గా త‌మ మేథ‌ను పెంచుకొంటారు.. చాలా క‌ఠిన‌మైన ఎంపిక ప్ర‌క్రియ‌ల‌ను దాటి ముందుకు వెళ్తుంటారు. ఈ విద్యార్థులు చాలా మంది విదేశాల్లో చ‌దువుకొంటున్నారు. ఈ టాలెంట్‌ను దేశంలోనే నిలుపుకోవాల‌ని ఐఐటీ కాన్పూర్ భావిస్తోంది. వారికి ఐఐటీ (IIT)ల్లో ప్ర‌త్యేక ప్ర‌వేశానికి మార్గం ఏర్పాటుకు యోచిస్తోంది.

  ప్ర‌త్యేకంగా ద‌ర‌ఖాస్తులు..
  ఒలింపియాడ్‌లకు అర్హత సాధించిన విద్యార్థులు తమ ప్రత్యేక సబ్జెక్టుల విభాగానికి దరఖాస్తు చేసుకోవచ్చు, అయితే, IITలోని వివిధ విభాగాల నిర్ణయాధికార సంస్థలు ఈ నిర్ణయానికి ఇంకా అనుమతి ఇవ్వలేదు.

  Andhra Pradesh Jobs: ఆంధ్ర‌ప్ర‌దేశ్ హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో 3,393 ఉద్యోగాలు.. ప‌రీక్ష లేకుండానే ఎంపిక‌


  ప్రోగ్రామ్ రివ్యూ కమిటీ చైర్‌పర్సన్ నితిన్ సక్సేనా IIT ప్రిన్సిపల్ అగ్రిమెంట్ ఆధారంగా ప్రత్యామ్నాయ యంత్రాంగాన్ని ప్రవేశపెట్టింది. ఈ అభ్యర్థుల ప్రవేశానికి సంబంధించి ఎటువంటి హామీ లేద‌ని అన్నారు. ఓ ప్ర‌ముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సక్సేనా మాట్లాడారు. ఈ మార్గం ద్వారా అత్యంత అర్హత కలిగిన అభ్యర్థులు మాత్రమే ఇన్‌స్టిట్యూట్‌లోకి ప్రవేశించేలా అనేక చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీని ద్వారా మెరుగైన విద్యార్థులు ఐఐటీలో ప్ర‌వేశాన్ని పొంద‌గ‌ల‌ర‌ని అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు.

  అదే బాట‌లో ఐఐటీ బాంబే..
  2018లో, IIT-బాంబే కూడా అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్‌కు అర్హత సాధించిన అభ్యర్థులను BSc మ్యాథమెటిక్స్ కోర్సుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా అనుమతించింది. ఐఐటీ ఈ మార్గంలో అందించడానికి సిక్ సీట్లను కేటాయించింది.

  ఒలంపియాడ్‌లు అంటే..
  ఒక నిర్దిష్ట‌మైన స‌బ్జెక్టులో విద్యార్థి లోతైన ప‌రిజ్ఞానాన్ని అంచ‌నా వేసే ప‌రీక్ష‌లే ఒలంపియాడ్‌లు. అయితే అయితే, జేఈఈలో అడ్వాన్స్‌డ్ విద్యార్థులు మూడు అంశాలపై ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి - గణితం, కెమిస్ట్రీ, ఫిజిక్స్. ప్రతి సంవత్సరం, JEE మెయిన్ ఫలితాల్లో టాప్ 2.5 లక్షల ర్యాంక్ హోల్డర్లు JEE అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కావును ప‌రిమిత సంఖ్య‌లోనే ఒలంపియాడ్ స్టూడెట్ల‌ను అనుమ‌తిచ్చే అవ‌కాశం ఉంద‌ని అంచనా.. జేఈఈ అడ్వాన్స్‌డ్‌తో పాటు, ఇతర ప్రవేశాలలో గేట్, క్యాట్, CSIR నెట్, JAM, HSCEE, AAT లను క్రాక్ చేయడం ద్వారా విద్యార్థులు IIT లలో చదువుకోవచ్చు. ఇటీవ‌ల IITలు కూడా ఆన్‌లైన్ కోర్సుల ద్వారా డిగ్రీలు, సర్టిఫికేట్‌లను అందిస్తోంది.
  Published by:Sharath Chandra
  First published: