హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

IIT Kanpur: ఐఐటీ కాన్పూన్, సింప్లీలెర్న్ ఒప్పందం..సైబర్ సెక్యూరిటీపై సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌..

IIT Kanpur: ఐఐటీ కాన్పూన్, సింప్లీలెర్న్ ఒప్పందం..సైబర్ సెక్యూరిటీపై సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఐఐటీ కాన్పూర్  సైబర్ సెక్యూరిటీలో కొత్త కోర్సును ఆఫర్ చేస్తోంది. ఎథికల్ హ్యాకింగ్, పెనెట్రేషన్ టెస్టింగ్‌‌పై ప్రొఫెషనల్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌ను లాంచ్ చేసింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

IIT Kanpur : ఇటీవల కాలంలో హ్యాకింగ్(Hacking) సమస్య తీవ్రమైంది. విలువైన డేటాను హ్యాకర్స్ చోరీ చేస్తున్నారు. దీంతో సైబర్ సెక్యూరిటీ(Cyber security) నిపుణులకు డిమాండ్ బాగా పెరిగింది. అవకాశాలు కూడా పుష్కలంగా ఉండడంతో ఈ రంగంలో కొత్త కోర్సులను తీసుకురావడానికి ఇన్‌స్టిట్యూట్స్ ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా ఐఐటీ కాన్పూర్(IIT Kanpur) సైబర్ సెక్యూరిటీలో కొత్త కోర్సును ఆఫర్ చేస్తోంది. ఎథికల్ హ్యాకింగ్, పెనెట్రేషన్ టెస్టింగ్‌‌పై ప్రొఫెషనల్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌ను లాంచ్ చేసింది. ఈ కోర్సు డెలివరీ కోసం ప్రముఖ ఎడ్‌టెక్ సంస్థ సింప్లీలెర్న్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.

అర్హత ప్రమాణాలు

ఈ ప్రోగ్రామ్ కోసం అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు సంబంధిత రంగంలో బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి. సైబర్ సెక్యూరిటీ అండ్ ప్రోగ్రామింగ్‌పై బేసిక్ నాలెజ్డ్ తప్పనిసరిగా ఉండాలి. వల్నరబులిటీ అసెస్‌మెంట్, పెనెట్రేషన్ టెస్టింగ్‌, ఎథికల్ హ్యాకింగ్ ద్వారా సిస్టమ్ సెక్యూరిటీని అనలైజ్ చేయడానికి అవసరమైన స్కిల్ సెట్‌ను ఈ కోర్సు ద్వారా పొందవచ్చు. ప్రస్తుత రియల్-వరల్డ్‌లో అవసరమైన స్కిల్స్‌ను హ్యాండ్ -ఆన్ ట్రైనింగ్ ద్వారా ఈ కోర్సు కల్పిస్తుంది.

కవర్ కానున్న స్కిల్స్, టూల్స్

ఈ ప్రోగ్రామ్ ఎథికల్ హ్యాకింగ్, క్రిప్టోగ్రఫీ కాన్సెప్ట్స్, నెట్‌వర్క్ సెక్యూరిటీ, వల్నరబిలిటీ అసెస్‌మెంట్, పెనెట్రేషన్ టెస్టింగ్, వెబ్ యాప్ థ్రెట్స్, జనరేటింగ్ పేలోడ్, ఎక్స్‌ఫ్లోయిటింగ్ అండ్ గెయినింగ్ యాక్సెస్, ఆనాయిమిటీ కాన్సెప్ట్స్ వంటి స్కిల్స్‌ను ఈ కోర్సు కవర్ చేయనుంది. Burpsuite, గూగుల్ డార్క్, ఎంఎక్స్ టూల్‌బాక్స్, రోబో టెక్స్, Nmap వంటి టూల్స్ కూడా ఈ కోర్సులో కవర్ కానున్నాయి.

సింప్లీలెర్న్ జాబ్ అసిస్ట్‌లో ఎన్‌రోల్

ఈ కోర్సులో భాగంగా ఐఐటీ కాన్పూర్ ఫ్యాకల్టీ నుంచి మాస్టర్‌క్లాసెస్, ఇండస్ట్రీ రిలవెంట్ యూజ్ - కేసెస్‌పై క్యాప్‌స్టోన్‌తో హ్యాండ్-ఆన్ ఎక్స్ పీరియన్స్, లైవ్ ఆన్‌లైన్ క్లాసెస్‌లో ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్‌తో 8x హయర్ ఇంటరాక్షన్స్, జాబ్ -రెడీ కోసం స్కిల్స్ బిల్డింగ్, సింప్లిలేర్న్ ఇంటిగ్రేటెడ్ ల్యాబ్‌లతో యాక్సెస్ వంటి సౌకర్యాలను అభ్యర్థులకు కల్పించనున్నారు. IIT కాన్పూర్, సింప్లిలేర్న్ నుంచి ప్రోగ్రామ్ కంప్లీషన్ సర్టిఫికేట్ అందుకోనున్నారు. అంతేకాకుండా సింప్లీలెర్న్ జాబ్ అసిస్ట్‌లో ఎన్‌రోల్ కావచ్చు.

JEE Main 2023: జేఈఈ మెయిన్-2023 కటాఫ్ ఎంత ఉండొచ్చు..? గత నాలుగేళ్ల వివరాలివే..!

మొదటగా కోర్ కాన్సెప్ట్‌ ఓరియంటేషన్‌

Simplelarn's JobAssist ప్రోగ్రామ్‌ ద్వారా అభ్యర్థులకు ఆరు నెలల ఉచిత IIM జాబ్స్ ప్రో మెంబర్‌షిప్, రెజ్యూమ్-బిల్డింగ్ అసిస్టెన్స్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్, కెరీర్ మెంటర్‌షిప్ వంటివి ఫెసిలిటీస్ కల్పించనున్నారు. సైబర్‌ సెక్యూరిటీ ప్రొఫెషనల్‌గా మారడానికి అవసరమైన అన్ని కోర్ కాన్సెప్ట్‌లను కవర్ చేసే ఓరియంటేషన్‌తో మొదటగా ప్రోగ్రామ్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఐఐటీ కాన్పూర్ నుంచి ఎథికల్ హ్యాకింగ్, వల్నరబిలిటీ అసెస్‌మెంట్, పెనెట్రేషన్ టెస్టింగ్, సైబర్ సెక్యూరిటీ క్యాప్‌స్టోన్ ప్రాజెక్ట్, సైబర్ సెక్యూరిటీ అకడమిక్ మాస్టర్‌క్లాస్‌లపై తరగతులు ఉంటాయి.

సెక్యూరిటీని మరింత మెరుగ్గా..

సింప్లీలెర్న్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ ఆనంద్ నారాయణన్ మాట్లాడుతూ.. సమగ్ర వల్నరబిలిటీ అసెస్‌మెంట్, పెనెట్రేషన్ టెస్టింగ్ కారణంగా సెక్యూరిటీ టీమ్స్ క్రిటికల్ వల్నరబిలిటీలను అంచనా వేస్తున్నారని, దీంతో కంపెనీలు రెడ్-బ్లూ టీమ్ ఎక్స్‌ర్‌సైజ్ చేస్తూ తమ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీని మరింత మెరుగ్గా ప్లాన్ చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. ఐటీ కంపెనీలకు ఈ డొమైన్‌లోని నైపుణ్యాలు చాలా కీలకమన్నారు. ఎథికల్ హ్యాకింగ్, వల్నరబిలిటీ అసెస్‌మెంట్, పెనెట్రేషన్ టెస్టింగ్ అనేది ఇప్పుడు ఈ రంగంలో కెరీర్‌ను నిర్మించుకోవాలని చూస్తున్న అభ్యర్థులకు బెస్ట్ కెరీర్ ఆప్షన్ కానుందన్నారు.

First published:

Tags: Career and Courses, Cyber security, IIT

ఉత్తమ కథలు