IIT Kanpur: వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు గుడ్ న్యూస్.. తమ కెరీర్ కొనసాగిస్తూనే ఎగ్జిక్యూటివ్-ఫ్రెండ్లీ ఇ-మాస్టర్స్ (eMasters Programmes) డిగ్రీ ప్రోగ్రామ్స్ చేయడానికి దేశంలోని టాప్ ఇన్స్టిట్యూట్లలో ఒకటైన ఐఐటీ కాన్పూర్ అవకాశం కల్పిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ఐదు కొత్త ఇ-మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్‌లను ప్రారంభించింది. ఎకనామిక్స్ అండ్ ఫైనాన్స్ ఇన్ బిజినెస్.. ఎకనామిక్స్, ఫైనాన్స్ అండ్ డేటా అనాలసిస్.. ఎకనామిక్స్, ఫైనాన్స్ అండ్ పబ్లిక్ పాలసీ.. డేటా సైన్స్ అండ్ బిజినెస్ అనలిటిక్స్.. ఫైనాన్షియల్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ వంటి ఐదు కోర్సులను ఆఫర్ చేస్తోంది.
మొదటి మూడు ప్రోగ్రామ్‌లను ఐఐటీ కాన్పూర్‌కు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ సైన్సెస్ ఆఫర్ చేయగా, మిగిలిన రెండు ప్రోగ్రామ్‌లను డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ మేనేజ్మెంట్ ఇంజినీరింగ్ అందిస్తోంది. ఈ ప్రోగామ్స్ జనవరి 2023 నుంచి ప్రారంభం కానున్నాయి. అర్హులైన అభ్యర్థులు 2022 డిసెంబర్ 4లోపు అప్లై చేసుకోవాలి.
గేట్ స్కోర్ తప్పనిసరి కాదు..
ఇ-మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్‌లకు దరఖాస్తు చేసుకోవడానికి గేట్ స్కోర్ తప్పనిసరి కాదు. ప్రొఫెషనల్ కెరీర్ పాజ్ చేయకుండానే అభ్యర్థులు ఈ కోర్సులను పూర్తి చేయవచ్చు. ఇందు కోసం 1-3 సంవత్సరాల మధ్య కోర్సులను పూర్తి చేసే ఫ్లెక్సిబులిటీ ఉండడం ఈ కోర్సుల ప్రత్యేకత.
హై-ఇంపాక్ట్ ఫార్మాట్లో..
ఈ ప్రోగ్రామ్స్ వీకెండ్- లైవ్ ఇంటరాక్టివ్ క్లాసెస్‌తో పాటు సెల్ఫ్-పేస్డ్ లెర్నింగ్‌తో హై-ఇంపాక్ట్ ఫార్మాట్లో డెలివరీ చేయనున్నారు. 60-క్రెడిట్, 12-మాడ్యూల్ ఇండస్ట్రీ-పోకస్డ్ రియల్-వరల్డ్‌తో పాఠ్యాంశాలను ఐఐటీ కాన్పూర్ ఫ్యాకల్టీ, పరిశోధకులు భోదించనున్నారు. ఉన్నత విద్య (M.Tech/PhD) కోసం గరిష్టంగా 60 క్రెడిట్ పాయింట్స్ ట్రాన్స్ఫర్ చేసుకునే సౌకర్యాన్ని కూడా ఐఐటీ కాన్పూర్ అందిస్తోంది.
కోర్సుల ప్రయోజనాలు
ఎకనామిక్స్ అండ్ ఫైనాన్స్ ఇన్ బిజినెస్ ప్రోగ్రామ్ అనేది.. బిజినెస్ ఫైనాన్స్‌లో ప్రధానంగా ఫైనాన్షియల్ కాన్సెప్ట్స్, ఎకనామిక్ టూల్స్, ప్రైసింగ్ మెకానిజం వంటి వాటిపై లోతైన అవగాహన కల్పిస్తుంది. ఎకనామిక్స్, ఫైనాన్స్ అండ్ డేటా అనలిటిక్స్‌లో ఇ-మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్ అనేది.. క్వాంటిటేటివ్ ఎకనామిక్స్ అండ్ డేటా అనాలిసిస్‌కు బలమైన ఎక్స్‌పోజర్‌తో ఎకనామిక్స్ అండ్ ఫైనాన్స్‌పై ప్రొఫెషనల్స్‌కు మరింత అవగాహన కల్పించడంలో కీలకంగా వ్యవహరిస్తుంది.
Weight Lose: డైటింగ్, ఎక్సర్‌సైజులతో పని లేదు..ఈ ఐదు చిట్కాలతో ఈజీగా బరువు తగ్గే అవకాశం..
ఇక, ఎకనామిక్స్, ఫైనాన్స్ అండ్ పబ్లిక్ పాలసీ ప్రోగ్రామ్ అనేది డైనమిక్ పాలసీ ప్లానింగ్, అమలు ప్రక్రియకు సమగ్రమైన నాలెడ్జ్, సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి ప్రొఫెషనల్స్‌కు ఎంతో ఉపయోగపడనుంది.
డేటా సైన్స్ అండ్ బిజినెస్ అనలిటిక్స్‌లో ఇ-మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్ అనేది బిజినెస్ అనలిటిక్స్ కోసం కటింగ్-ఎడ్జ్ డేటా సైన్స్ టూల్స్‌పై ప్రొఫెషనల్స్‌కు లోతైన పరిజ్ఞానాన్ని అందిస్తుంది. చివరిదైన ఫైనాన్షియల్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అనేది ప్రొఫెషనల్స్‌లో థిరిటికల్ అండ్ ప్రాక్టికల్ సామర్థ్యాలను పెంపొందించడానికి, ఆర్థిక విప్లవాన్ని నావిగేట్ చేయడానికి, వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడానికి, తద్వారా సంస్థను వృద్ధిలోకి తీసుకోవడానికి వీలు కల్పిస్తుంది.
ఈ eMasters డిగ్రీ ప్రోగ్రామ్స్ అనేవి అభ్యర్థులకు IIT కాన్పూర్ ప్లేస్మెంట్ సెల్, ఇంక్యుబేషన్ సెల్, పూర్వ విద్యార్థుల నెట్‌వర్క్‌కు యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తాయి. దీంతో గొప్ప కెరీర్ పురోగతి, నెట్వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అందిస్తుంది. అలాగే IIT కాన్పూర్ క్యాంపస్‌ను విజిట్ చేయవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, IIT