హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Score Card Released: అభ్యర్థులకు అలర్ట్.. గేట్ స్కోర్ కార్డు విడుదల..

Score Card Released: అభ్యర్థులకు అలర్ట్.. గేట్ స్కోర్ కార్డు విడుదల..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మార్చి 16న IIT కాన్పూర్ (గేట్) 2023 ఫలితాలను ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించి పరీక్షకు హాజరైన అభ్యర్థులందరికీ స్కోర్ కార్డ్‌లు జారీ చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

మార్చి 16న IIT కాన్పూర్ (గేట్) 2023 ఫలితాలను ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించి పరీక్షకు హాజరైన అభ్యర్థులందరికీ స్కోర్ కార్డ్‌లు జారీ చేశారు. ఇన్‌స్టిట్యూట్ ప్రకటించిన పరీక్షల షెడ్యూల్ ప్రకారం.. GATE స్కోర్ కార్డ్‌లు 2023 మార్చి 21, మంగళవారం విడుదల చేస్తామని ప్రకటించగా.. షెడ్యల్ ప్రకారమే నేడు ఈ స్కోర్ కార్డులను విడుదల చేశారు.  IIT కాన్పూర్ విడుదల చేసిన నోటీస్ ప్రకారం.. అభ్యర్థులు తమ గేట్ స్కోర్ కార్డ్‌ని 31 మే 2023 వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ తేదీ తర్వాత ఎవరైన స్కోర్ కార్డును డౌన్‌లోడ్ చేసుకుంటే అభ్యర్థులు రూ. 500 రుసుము చెల్లించాలి. ఈ రుసుముతో.. మీరు 31 డిసెంబర్ 2023 వరకు స్కోర్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

గేట్ స్కోర్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేయడానికి ఈ విధానాన్ని అనుసరించండి

-అభ్యర్థులు ముందుగ అధికారిక వెబ్ సైట్ gate.iitk.ac.in ను సందర్శించండి.

-హోమ్ పేజీలో ఇచ్చిన లాగిన్ లింక్‌పై క్లిక్ చేయండి.

-కొత్త పేజీలో మీ వివరాలను (ఇమెయిల్ చిరునామా మరియు పాస్‌వర్డ్) సమర్పించండి.

-మీ గేట్ స్కోర్ కార్డ్ 2023ని డౌన్‌లోడ్ చేసుకోండి.

-ప్రింట్ తీసుకున్న తర్వాత, దాని సాఫ్ట్ కాపీని సేవ్ చేయండి.

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT కాన్పూర్) గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్ 2023) ఫలితాలను ఇటీవల ప్రకటించారు. ఈ సంవత్సరం ఇన్‌స్టిట్యూట్ 82 పేపర్లకు GATE 2023ని ఫిబ్రవరి 4, 5, 12 మరియు 13, 2023 తేదీలలో రెండు షిఫ్టులలో నిర్వహించారు.

TSPSC New Notification: అలర్ట్.. నేడు టీఎస్పీఎస్సీ(TSPSC) నుంచి మరో నోటిఫికేషన్..

అనేక సంస్థలు GATE పరీక్ష యొక్క స్కోర్‌ను గుర్తించి.. గేట్ లో మంచి మార్కులు వచ్చిన వారికి తమ కాలేజీల్లో అడ్మిషన్ కు అవకాశం ఇస్తాయి. చాలా చోట్ల GATE పాస్ అభ్యర్థులను మాత్రమే నియమించుకుంటారు. అయితే.. గేట్ పరీక్ష స్కోర్ ఆధారంగా ప్రవేశం పొందిన కొన్ని పెద్ద విద్యా సంస్థల గురించి మాట్లాడినట్లయితే.. వాటి పేర్లు ఈ విధంగా ఉన్నాయి. అందులో.. IIT బాంబే, IIT ఢిల్లీ , IIT గౌహతి, IIT కాన్పూర్, IIT ఖరగ్‌పూర్, IIT మద్రాస్, IIT రూర్కీ మరియు IISc బెంగళూరు ఉన్నాయి.

దేశంలోనిటాప్ ఇంజనీరింగ్(Engineering) కాలేజీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు ఈ ఎగ్జామ్‌ నిర్వహిస్తారు. ఈ ఏడాది గేట్‌ ఎగ్జామ్‌ను IITకాన్పూర్‌ (IIT Kanpur) నిర్వహిస్తోంది. జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ పరీక్ష స్కోరు ఉన్నత విద్యతో పాటు కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాల ఎంపికకు సైతం ఉపయోగపడుతుంది. ఐఐటీలు, నిట్‌ వంటి విద్యాసంస్థల్లో మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ కోర్సులు చేయడానికి గేట్‌ స్కోర్‌ తప్పనిసరి. పూర్తి వివరాలకుhttps://gate.iitk.ac.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

First published:

Tags: Career and Courses, Gate, Gate 2023, JOBS

ఉత్తమ కథలు