హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

IIT Jodhpur: ఐఐటీ జోధ్‌పూర్‌లో మాట్లాడే మొత్తం భాషలు 16.. భిన్నత్వంలో ఏకత్వం అంటే ఇదే!

IIT Jodhpur: ఐఐటీ జోధ్‌పూర్‌లో మాట్లాడే మొత్తం భాషలు 16.. భిన్నత్వంలో ఏకత్వం అంటే ఇదే!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

IIT Jodhpur: ఐఐటీ జోధ్‌పూర్‌ నిర్వహించిన భాషా వైవిధ్యం సర్వేలో ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. ఐఐటీ జోధ్‌పూర్‌లో దాదాపు 16 భాషలు వాడుకలో ఉన్నట్లు సర్వే తెలిపింది. భాషా వైవిధ్యం సర్వే గురించి, నివేదికలో పేర్కొన్న వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

దేశంలోని ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్లు భిన్నత్వంలో ఏకత్వానికి వేదికలుగా నిలుస్తున్నాయి. వివిధ రాష్ట్రాల్లోని ప్రముఖ ఐఐటీ (IIT)లకు దేశం నలుమూలల నుంచి విద్యార్థులు (Students) వస్తుంటారు. దీంతో వివిధ సంస్కృతులు, భాషలకు ఐఐటీలు చిరునామాగా ఉంటాయి. తాజాగా ఐఐటీ జోధ్‌పూర్‌ (IIT Jodhpur) నిర్వహించిన భాషా వైవిధ్యం సర్వే ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ఐఐటీ జోధ్‌పూర్‌లో దాదాపు 16 భాషలు వాడుకలో ఉన్నట్లు తెలిపింది. భాషా వైవిధ్యం సర్వే గురించి, నివేదికలో పేర్కొన్న వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

* 16 మాండలికాల్లో కమ్యూనికేట్‌

ప్రతి సంవత్సరం ఐఐటీ జోధ్‌పూర్ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం(International Mother Language Day) సందర్భంగా భాషా వైవిధ్యం సర్వేను నిర్వహిస్తుంది. ఈ సంవత్సరం నిర్వహించిన సర్వే ప్రకారం.. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జోధ్‌పూర్‌లో భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన స్టూడెంట్స్‌, రెసిడెంట్స్‌ ఉంటున్నారు. అందరూ క్యాంపస్‌లో చాలా రకాల భాషలు మాట్లాడుతున్నారు.

ఐఐటీ జోధ్‌పూర్ కమ్యూనిటీకి తుళుతో సహా 16 మాండలికాలలో కమ్యూనికేట్ చేసే నైపుణ్యం కూడా ఉంది. ఇక్కడి స్టూడెంట్స్, రెసిడెంట్స్‌లో రాజస్థానీ, మేవాడి, మార్వాడీ, మగధీ, లంబాడీ, హర్యాన్వి, భోజ్‌పురి, బ్రజ్ భాష వంటి మాండలికాలతోపాటు అరబిక్, డ్యుయిష్, ఫ్రెంచ్, జపనీస్, కొరియన్‌ వంటి విదేశీ భాషలలో కమ్యూనికేట్‌ అయ్యేవారు కూడా ఉన్నారు.

* 12 భాషలను రాయగలరు

ఐఐటీ జోధ్‌పూర్ (IIT Jodhpur) స్టూడెంట్స్‌, రెసిడెంట్స్‌ అందరూ కలిసి క్యాంపస్‌లో మాట్లాడే భాషలు 16 వరకు ఉన్నాయి. వీరు రాయగలిగే భాషల సంఖ్య 12 కంటే ఎక్కువగా ఉంది. ఇక్కడి వారు అందరూ కలిపి అర్థం చేసుకోగలిగే భాషల సంఖ్య 20 వరకు ఉన్నట్లు ఇన్స్టిట్యూట్ చేసిన కొత్త సర్వే పేర్కొంది. ఒక్కో వ్యక్తి భాషా పరిజ్ఞానాన్ని హైలెట్ చేయటం కాకుండా, అందరి లాంగ్వేజ్ స్కిల్స్‌ను కలిపి సర్వే ఈ వివరాలను అంచనా వేసింది.

ఇంగ్లీషు, హిందీతో పాటు ఉర్దూ, తెలుగు, తమిళం, సంస్కృతం, పంజాబీ, ఒడియా, మరాఠీ, మలయాళం, మైథిలీ, అస్సామీ, డోగ్రీ, బెంగాలీ, గుజరాతీ, నేపాలీ, కొంకణి, సింధీ, సంతాలి, కన్నడ మాట్లాడే స్టూడెంట్స్‌, రెసిడెంట్స్‌ ఐఐటీ జోధ్‌పూర్‌లో ఉన్నారని సర్వే రిపోర్ట్ పేర్కొంది.

* దేశాభివృద్ధికి ఐఐటీ జోధ్‌పూర్‌ కృషి

ఐఐటీ జోధ్‌పూర్‌లోని భాషా వైవిధ్యం గురించి ఐఐటీ జోధ్‌పూర్ డైరెక్టర్ ప్రొఫెసర్ శాంతను చౌదరి మాట్లాడుతూ.. ‘ఐఐటీ జోధ్‌పూర్ ఒక సమగ్రమైన, భాషాపరంగా విభిన్నమైన సమాజాన్ని సృష్టించింది. ఈ సమాజం దేశానికి కీర్తిని తీసుకురావడానికి కలిసి పని చేస్తోంది. భారతదేశాన్ని టెక్నాలజీ పరంగా అభివృద్ధి చేస్తూ, ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచేందుకు కృషి చేస్తోంది.’ అని చెప్పారు. తెలంగాణకు చెందిన బీటెక్ విద్యార్థి పులిపాటి సూర్య సాయి సాత్విక్ మాట్లాడుతూ.. ఇంటికి దూరంగా ఉన్న విద్యార్థులకు ఐఐటీ జోధ్‌పూర్ మరో ఇల్లు అని తెలిపాడు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Career and Courses, EDUCATION, IIT, JOBS

ఉత్తమ కథలు