Home /News /jobs /

IIT JODHPUR LAUNCHES ENGINEERING LINKED FOUR YEAR BS PROGRAMS IN CHEMISTRY AND PHYSICS WITH SPECIALIZATION CHECK ALL DETAILS GH SRD

IIT Jodhpur: ఐఐటీ జోధ్‌పూర్ నుంచి కొత్త కోర్సులు.. వీటితో బోలెడు కెరీర్ అవకాశాలు..

IIT Jodhpur: ఐఐటీ జోధ్‌పూర్ నుంచి కొత్త కోర్సులు.. వీటితో బోలెడు కెరీర్ అవకాశాలు..

IIT Jodhpur: ఐఐటీ జోధ్‌పూర్ నుంచి కొత్త కోర్సులు.. వీటితో బోలెడు కెరీర్ అవకాశాలు..

IIT Jodhpur: వివిధ ఐఐటీలు సైన్స్ స్ట్రీమ్స్‌లో కూడా ఇంజనీరింగ్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ఈ జాబితాలో తాజాగా చేరింది ఐఐటీ జోధ్‌పూర్. కెమిస్ట్రీ, ఫిజిక్స్‌ స్పెషలైజేషన్‌తో ఇంజనీరింగ్-లింక్డ్ ఫోర్ ఇయర్ బీఎస్ ప్రోగ్రామ్స్‌ను సంస్థ లాంచ్ చేసింది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
ప్రస్తుత పోటీ ప్రపంచంలో వివిధ రంగాల్లో టెక్నాలజీ (Technology) అవసరం పెరుగుతోంది. దీంతో డిమాండ్‌కు తగ్గట్లు మోడ్రన్ టెక్నాలజీని సబ్జెక్ట్స్‌తో కలిపి కొత్త కోర్సులను అందిస్తున్నాయి ప్రముఖ విద్యా సంస్థలు (Educational Institutions). ముఖ్యంగా వివిధ ఐఐటీ (III's)లు సైన్స్ స్ట్రీమ్స్‌లో కూడా ఇంజనీరింగ్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ఈ జాబితాలో తాజాగా చేరింది ఐఐటీ జోధ్‌పూర్. కెమిస్ట్రీ, ఫిజిక్స్‌ స్పెషలైజేషన్‌తో ఇంజనీరింగ్-లింక్డ్ ఫోర్ ఇయర్ బీఎస్ ప్రోగ్రామ్స్‌ను సంస్థ లాంచ్ చేసింది. ఈ కోర్సుల మొదటి సంవత్సరంలో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌లో ఫండమెంటల్ నాలెడ్జ్‌‌పై అవగాహన కల్పించనున్నారు. రెండు, మూడో సంవత్సరంలో సంబంధిత ప్రోగ్రామ్‌లలో కెమిస్ట్రీ, ఫిజిక్స్ మోడ్రన్ కాన్సెప్ట్స్‌లో థిరిటికల్, ప్రాక్టికల్ విషయాలు నేర్పిస్తారు. ఇక కోర్సు చివరి సంవత్సరంలో విద్యార్థులు సైన్స్‌లోని కీలకమైన అంశాల్లో స్పెషలైజేషన్ చేయనున్నారు. * మల్టిపుల్ స్పెషలైజేషన్స్ సౌలభ్యం.. కోర్సుకు సంబంధించి బీఎస్ విద్యార్థులకు మరో అవకాశం కూడా కల్పించింది ఐఐటీ జోధ్‌పూర్. నాలుగేళ్ల బీ.ఎస్ ప్రోగ్రామ్‌ను.. సంబంధిత స్పెషలైజేషన్లతో ఐదేళ్ల బీ.ఎస్ -ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్‌గా కన్వర్ట్ చేసుకోవచ్చు. సైన్స్ బేస్డ్ ఇంజనీరింగ్ ఆవిష్కరణలకు దారితీసే ఎంటర్ ప్రెన్యూరల్ మార్గాన్ని అనుసరించడం కోసం ఇన్‌స్టిట్యూట్ ఈ కోర్సును ఆఫర్ చేస్తోంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-2020 అనుగుణంగా ఈ కోర్సు వివిధ స్పెషలైజేషన్‌లను ఎంపిక చేసుకునే సౌలభ్యాన్ని అందిస్తుంది. * ఈ రంగాల్లో కెరీర్ అవకాశాలు బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఫిజిక్స్ కోర్సు ద్వారా థియరీ, కంప్యూటేషన్, ప్రయోగాత్మక శిక్షణ ద్వారా ఇంటర్ డిసిప్లినరీ సబ్జెక్టుల అవగాహనతో ఫండమెంటల్, అప్లైడ్ ఫిజిక్స్‌లో థిరిటికల్ ఫౌండేషన్స్, ప్రాక్టికల్ నైపుణ్యాలను అందించడమే తమ లక్ష్యమని ఇన్ స్టిట్యూట్ పేర్కొంది. ఈ ప్రోగ్రామ్‌ ద్వారా గ్రాడ్యుయేట్‌లకు గ్రీన్ ఎనర్జీ అండ్ సస్టైనబుల్ ఎనర్జీ మెటీరియల్స్, ఫోటోనిక్స్ అండ్ టెరాహెర్ట్జ్ టెక్నాలజీ/కమ్యూనికేషన్స్, క్వాంటం టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్స్, క్వాంటం ఓపెన్ సిస్టమ్స్, ఫ్లెక్సిబుల్ ఎలక్ట్రానిక్స్, మల్టీఫంక్షనల్ మెటీరియల్స్ అండ్ స్మార్ట్ సిటీస్ వంటి రంగాల్లో కెరీర్ అవకాశాలు మెరుగుపడతాయని ఐఐటీ జోధ్‌పూర్ పేర్కొంది. ఇది కూడా చదవండి : ఐటీ కంపెనీలో భారీగా ఉద్యోగాలు.. ఎక్కడినుంచైనా పనిచేయవచ్చు.. భారతీయులే కావాలంట..! ఫార్మాస్యూటికల్స్, అగ్రోకెమికల్స్, మెటీరియల్స్ అండ్ డివైజెస్, ఎనర్జీ, హెల్త్‌కేర్ అండ్ ఎన్విరాన్‌మెంట్‌తో సహా విభిన్న రంగాలలో గ్రాడ్యుయేట్ చేసిన విద్యార్థుల కోసం ఈ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ కెమిస్ట్రీ ప్రోగ్రామ్‌ను డిజైన్ చేసినట్లు ఇన్‌స్టిట్యూట్ పేర్కొంది. కొత్త కోర్సుల లాంచింగ్ సందర్భంగా మాట్లాడారు ఐఐటీ జోధ్‌పూర్ డైరెక్టర్ ప్రొఫెసర్ శాంతను చౌదరి. బేసిక్ సైన్స్‌లో పరిశోధనల కారణంగా టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కుతుందన్నారు. క్వాంటం టెక్నాలజీ, సస్టైనబుల్ మెటీరియల్స్, టెరాహెర్ట్జ్ టెక్నాలజీ, జీన్ థెరపీ, గ్రీన్ ఎనర్జీ వంటివి సైన్స్ డ్రైవింగ్ టెక్నాలజీ ఆవిష్కరణలకు కొన్ని ఉదాహరణలన్నారు. ప్రాథమిక సైన్స్ ప్రోగ్రామ్‌లను పునరాలోచించాల్సిన సమయం ఇదేనని, అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీలకు వాటిని పునాదిగా మార్చడమే తమ లక్ష్యమన్నారు. ఇందు కోసం ఐఐటీ జోధ్‌పూర్ కొత్త BS ప్రోగ్రామ్‌లను ఆఫర్ చేస్తోందన్నారు.
Published by:Sridhar Reddy
First published:

Tags: Career and Courses, EDUCATION, IIT, JOBS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు