హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

IIT Jodhpur: జేఈఈ స్కోరు లేకుండానే ప్రవేశాలు.. ఆ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం.. వివరాలిలా..

IIT Jodhpur: జేఈఈ స్కోరు లేకుండానే ప్రవేశాలు.. ఆ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం.. వివరాలిలా..

జేఈఈ స్కోర్​ లేకుండానే ప్రవేశాలు కల్పిస్తోంది ఐఐటీ జోధ్​పూర్​. ఈ సంస్థ తాజాగా డేటా ఇంజనీరింగ్, క్లౌడ్ కంప్యూటింగ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రామ్​ను ప్రారంభించింది.

జేఈఈ స్కోర్​ లేకుండానే ప్రవేశాలు కల్పిస్తోంది ఐఐటీ జోధ్​పూర్​. ఈ సంస్థ తాజాగా డేటా ఇంజనీరింగ్, క్లౌడ్ కంప్యూటింగ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రామ్​ను ప్రారంభించింది.

జేఈఈ స్కోర్​ లేకుండానే ప్రవేశాలు కల్పిస్తోంది ఐఐటీ జోధ్​పూర్​. ఈ సంస్థ తాజాగా డేటా ఇంజనీరింగ్, క్లౌడ్ కంప్యూటింగ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రామ్​ను ప్రారంభించింది.

  దేశంలోనే ప్రతిష్టాతకమైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT)ల్లో సీటు దక్కించుకోవాలంటే జేఈఈ పరీక్షలో మంచి స్కోర్​ సాధించాల్సిందే. అయితే జేఈఈ స్కోర్​ లేకుండానే ప్రవేశాలు కల్పిస్తోంది ఐఐటీ జోధ్​పూర్(Jodhpur)​. ఈ సంస్థ తాజాగా డేటా ఇంజనీరింగ్(Engineering), క్లౌడ్ కంప్యూటింగ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రామ్​ను ప్రారంభించింది. ఈ ప్రోగ్రామ్​ కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఐటీ, సాఫ్ట్‌వేర్(Software), టెక్నాలజీ ప్రొఫెషనల్స్(Professionals)​ కోసం ఈ సరికొత్త ప్రోగ్రామ్​ను డిజైన్​(Design) చేసింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు మార్చి 11లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రోగ్రామ్​ మొదటి బ్యాచ్ అదే నెలలో ప్రారంభమవుతుంది. ఈ పీజీ డిప్లొమా ప్రోగ్రామ్‌ కోసం రిజిస్ట్రేషన్​ చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఇంజనీరింగ్ లేదా సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని పాసై ఉండాలి. లేదా సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ, ఎంసీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కనీసం 50 శాతం స్కోరు/ 5.0 CGPA సాధించిన వారే దరఖాస్తుకు అర్హులు. విద్యార్హతకు అదనంగా, ఐటీ ఇండస్ట్రీలో కనీసం రెండు సంవత్సరాల పని అనుభవం ఉండాలి.

  మొత్తం 12 -నెలల ఇంటెన్సివ్ ప్రోగ్రామ్‌లో 600+ లెర్నింగ్ అవర్స్​ పాటు క్లాసులుంటాయి. ఈ ఆన్​లైన్​ క్లాసులను ఐఐటీ జోధ్‌పూర్ ఫ్యాకల్టీ చేత నిర్వహిస్తారు. ఈ కోర్సులో ప్రతి సెమిస్టర్‌కు 18 క్రెడిట్‌ల చొప్పున మొత్తం 36 అకడమిక్ క్రెడిట్స్​ ఉంటాయి. కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులు ఐఐటీ జోధ్‌పూర్ పూర్వ విద్యార్థుల హోదాను కూడా అందుకుంటారు. వారిని పూర్వ విద్యార్థుల అల్యూమినీలో భాగస్వామ్యం చేస్తారు పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రామ్‌లో భాగంగా ప్రతి సెమిస్టర్‌కు 15 రోజుల పాటు క్యాంపస్ ఇమ్మర్షన్ సెషన్ కూడా ఉంటుంది.

  New Home Loan Scheme: కొత్త హోం లోన్ తో ఎన్నో ప్రయోజనాలు.. రూ.35 లక్షల నుంచి రూ.3.5 కోట్ల వరకు..


  డేటా ఇంజినీరింగ్​, క్లౌడ్​ కంప్యూటింగ్​కు ఫుల్​ డిమాండ్​..

  ఈ ప్రోగ్రామ్‌ను ప్రారంభించిన సందర్భంగా ఐఐటీ జోధ్​పూర్​లోని డిపార్ట్​మెంట్​ ఆఫ్ మ్యాథమెటిక్స్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్​ గౌరవ్ భట్నాగర్​ మాట్లాడారు. “ప్రస్తుత ఐటీ, టెక్ పరిశ్రమలో డేటా ఇంజనీరింగ్, క్లౌడ్ కంప్యూటింగ్​ నిపుణులకు ఫుల్​ డిమాండ్ ఉంది. అయితే, ఈ విభాగాల్లో నిపుణుల కొరత వేధిస్తోంది. అందుకే, నైపుణ్యం కలిగిన వర్క్‌ఫోర్స్​కు ఎక్కువ ప్యాకేజీలు ఇచ్చి మరీ రిక్రూట్​ చేసుకుంటున్నాయి. ఐటీ ఇండస్ట్రీలో డేటా ఇంజినీరింగ్​, క్లౌడ్​ కంప్యూటింగ్ నిపుణుల కొరత తీర్చడమే లక్ష్యంగా సరికొత్త పీజీ డిప్లొమా కోర్సును ప్రారంభించినందుకు మేము సంతోషిస్తున్నాం. ఈ ప్రోగ్రామ్​కు సహకరిస్తున్న మా ఆన్‌లైన్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ పార్టనర్ WileyNXTకి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ కోర్సు ద్వారా యువత నైపుణ్యాలను పెంపొందించుకోని వారి కెరీర్‌లో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు.” అని గౌరవ్ వెల్లడించారు.

  First published:

  Tags: Career and Courses, EDUCATION, IIT, Jee, JOBS

  ఉత్తమ కథలు