హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

IIT JEE: మ‌రొక్క అవ‌కాశం ఇవ్వండి.. ఐఐటీ విద్యార్థుల విన్న‌పం

IIT JEE: మ‌రొక్క అవ‌కాశం ఇవ్వండి.. ఐఐటీ విద్యార్థుల విన్న‌పం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

IIT JEE : ఈ ఏడాది జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (Joint Entrance Exam) అడ్వాన్స్‌డ్ ప‌రీక్ష ఫ‌లితాలు ఇప్ప‌టికే వ‌చ్చేశాయి. ఇక కౌన్సెలింగ్ ప్ర‌క్రియ పూర్తి కావాల్సి ఉంది. అయితే చాలా మంది IIT ప్రవేశం పొంద‌డానికి ప్ర‌య‌త్నించిన విద్యార్థులు మ‌రో అవ‌కాశం కావాల‌ని కోరుతున్నారు.

ఇంకా చదవండి ...

ఈ ఏడాది జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (Joint Entrance Exam) అడ్వాన్స్‌డ్ ప‌రీక్ష ఫ‌లితాలు ఇప్ప‌టికే వ‌చ్చేశాయి. ఇక కౌన్సెలింగ్ ప్ర‌క్రియ పూర్తి కావాల్సి ఉంది. అయితే చాలా మంది IIT ప్రవేశం పొంద‌డానికి ప్ర‌య‌త్నించిన విద్యార్థులు (Students) మ‌రో అవ‌కాశం కావాల‌ని కోరుతున్నారు. నిబంధ‌న‌ల ప్ర‌కారం ఐఐటీ ఎంట్రెన్స్ ప‌రీక్ష (Entrance Exam) రాయ‌డానికి రెండు సార్లు మాత్ర‌మే అవ‌కాశం ఉంటుంది. అయితే కొంతమంది విద్యార్థులు 12వ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన సంవత్సరం అయిన 2020లో చాలా మంది పరీక్షకు హాజరు కాలేకపోయారు. ఈ నేప‌థ్యంలో . కోవిడ్-19 మహమ్మారి కారణంగా తాము ఓ అవ‌కాశాన్ని కోల్పోయామ‌ని ఇప్పుడు అద‌నంగా మ‌రో అవ‌కాశం ఇవ్వాల‌ని కోరుతున్నారు. ఇందు కోసం జాయింట్ అడ్మిషన్ బోర్డ్ (JAB)కి లేఖ రాశారు.

కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఈ ఏడాది పరీక్షా నిబంధనలను మార్చాలని విద్యార్థులు JABని అభ్యర్థించారు. ఆన్‌లైన్ (Online) తరగతుల కార‌ణంగా సరైన మార్గదర్శకత్వం ల‌భించ‌లేదుని విద్యార్థులు వాపోతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు ప్రభావితమయ్యారని వారికి ఎక్కువ‌గా న‌ష్టం జ‌రిగింద‌ని వారు పేర్కొన్నారు. కోవిడ్ కార‌ణంగా మాన‌సిక‌, ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో ఇబ్బంది ప‌డ్డామ‌ని అందువ‌ల్ల స‌రిగా చ‌ద‌వ‌లేక పోయామ‌ని వారు పేర్కొన్నారు.

చాలా మంది పరీక్షలలో “సరైన అవకాశం” గురించి తమ డిమాండ్‌లను తెలియజేయడానికి #JEEAdvancedExtraAttempt మరియు #jeeadvanced3rdattempt అనే హ్యాష్‌ట్యాగ్‌లతో ట్విట్టర్‌లో ట్రెండ్ చేస్తున్నారు.


TCS Online Courses: రెజ్యూమె రైటింగ్ తెలియ‌ట్లేదా..? ఇంట‌ర్వ్యూ స్కిల్స్ నేర్చుకోవాల‌నుకొంటున్నారా? అయితే ఈ ఉచిత కోర్సులు ట్రై చేయండిఇదిలా ఉండగా, JEE అడ్వాన్స్‌డ్ 2021లో ఉత్తీర్ణత సాధించి, IITలకు కౌన్సెలింగ్ ప్రక్రియ కోసం నమోదు చేసుకున్న విద్యార్థుల కోసం JoSAA కౌన్సెలింగ్ కొనసాగుతోంది. అయితే ఐఐటీ (IIT) లలో చేరే వారు ఎక్కువ‌గా కంప్యూటర్ సైన్స్ విభాగాన్ని ఎక్కువ‌గా ఎంపిక చేసుకొంటున్నారు. CSE కాకుండా, మెకానికల్ ఇంజనీరింగ్, మెట్రోలాజికల్ మరియు మెటలర్జికల్ ఇంజనీరింగ్ కూడా డిమాండ్ త‌రువాతి స్థానంలో ఉన్నాయి.

First published:

Tags: EDUCATION, Engineering course, IIT

ఉత్తమ కథలు