హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

IIT JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష దరఖాస్తుల ప్రక్రియ వాయిదా.. తాజా షెడ్యూల్ ఇదే.. పూర్తి వివరాలు..

IIT JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష దరఖాస్తుల ప్రక్రియ వాయిదా.. తాజా షెడ్యూల్ ఇదే.. పూర్తి వివరాలు..

ఐఐటీ ఖరగ్‌పూర్‌

ఐఐటీ ఖరగ్‌పూర్‌

ఐఐటీలో ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2021 ( JEE Advanced 2021) ప‌రీక్ష‌కు ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ వాయిదా పడింది.

  ఐఐటీలో ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2021 ( JEE Advanced 2021) ప‌రీక్ష‌కు ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ వాయిదా పడింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేటి(సెప్టెంబర్ 11) నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే జేఈఈ మెయిన్‌ ర్యాంకుల వెల్లడిలో ఆలస్యం కావడంతో ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను వాయిదా వేశారు. ఈ మేరకు ఈ పరీక్ష నిర్వహించనున్న ఐఐటీ ఖరగ్‌పూర్( IIT Kharagpur)శుక్రవారం సాయంత్రం ప్రకటన చేసింది. ఈ మేరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ షెడ్యూలులో మార్పులు చేసినట్టు ఐఐటీ ఖరగ్‌పూర్‌ తెలిపింది. ఈ నెల 13వ తేదీ మధ్యాహ్నం రిజిస్ట్రేషన్లు మొదలు కానున్నాయి. ఈ నెల 19వ తేదీ సాయంత్రం 5 గంటలకు రిజిస్ట్రేషన్లు ముగియనున్నాయి. ఫీజు చెల్లింపునకు ఈ నెల 20 వ తేదీ సాయంత్రం 5 వరకు అవకాశం ఉంటుంది. అక్టోబర్ 3న పరీక్ష యథాతథంగా జరగనుంది. అభ్య‌ర్థుల హాల్‌టికెట్‌లు, ప‌రీక్ష కేంద్రాలపై స‌మాచారం సెప్టెంబ‌ర్ 27 త‌ర్వాత విడుద‌ల అయ్యే అవ‌కాశం ఉంది.

  వాస్తవానికి జేఈఈ మెయిన్ సెషన్ 4 ఫలితాలు(JEE Main 2021 session 4 results) శుక్రవారం వెలువడతాయిన అభ్యర్థులు ఎదురు చూశారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ ఫలితాలు.. ఆదివారం సాయంత్రం గానీ, సోమవారం ఉదయం కానీ వెల్లడయ్యే అవకాశం ఉంది. అయితే ఫలితాలపై ఎన్‌టీఏ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. JEE మెయిన్ సెషన్ 4 రిజల్ట్స్ 2021 ఆలస్యం కావడంపై పరీక్షకు హాజరైన విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలువురు విద్యార్థులు ట్విట్టర్ వేదికగా తమ అసంతృప్తిని వెల్లడిస్తున్నారు.

  ఈ ద‌ర‌ఖాస్తుకు జేఈఈ మెయిన్స్‌లో మొదటి 2.5 లక్షల ర్యాంకుల్లో సీటు పొందిన అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఆస‌క్తిగ‌ల అభ్య‌ర్థులు అధికారిక వెబ్‌సైట్ jeeadv.ac.in ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. జీఈఈ అడ్వాన్స్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి అభ్య‌ర్థులు క‌చ్చితంగా అక్టోబర్ 1, 1996 త‌ర్వాత జ‌న్మించి ఉండాలి. షెడ్యూల్డ్ కులాలు, తెగ‌లు, దివ్యాంగుల‌కు అక్టోబర్ 1, 1991 త‌ర్వాత జ‌న్మించి ఉండాలి. ఈ ప‌రీక్ష‌కు ద‌ర‌ఖాస్తు చేసుకొనే వారు జేఈఈ మెయిన్‌లో 2,50,000 లోపు ర్యాంకు(Rank) పొంది ఉండాలి. ద‌ర‌ఖాస్తుకు సంబంధిత డాక్యుమెంట్‌తోపాటు ఫీజు చెల్లించాలి.

  ఇక, జేఈఈ మెయిన్స్‌ సెషన్ 4కు హాజరైన అభ్యర్థులు.. ఫలితాలు విడుదలయ్యాక jeemain.nta.nic.in, nta.nic.in, ntaresults.nic.in, nta.ac.in సైట్స్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. స్కోర్, కటాప్, మెరిట్ లిస్ట్‌ వివరాలను ఈ సైట్స్ ద్వారా పొందవచ్చు.

  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: IIT, JEE Main 2021

  ఉత్తమ కథలు