మాస్టర్స్ కోసం జాయింట్ అడ్మిషన్ టెస్ట్ (Joint Admission Test for Masters) 2022 ప్రవేశ పరీక్షకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ మూడు రోజుల్లో ముగుస్తోంది. అంటే అక్టోబర్ 14, 2021. ఇంకా దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు ఎవరైన ఉంటే అధికారిక వెబ్సైట్ jam.iitr.ac.in ను సందర్శించాలి. ఈ పరీక్షకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియను ఆగస్టు 25 నుంచి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) రూర్కీ నిర్వహిస్తోంది. ఐఐటీ JAM 2022 పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులు జనవరి 4, 2022న విడుదల అవుతాయి. పరీక్ష ఫిబ్రవరి 13, 2022న నిర్వహిస్తారు. పీహెచ్డీ, ఎంఎస్సి, ఎంఎస్సి-పిహెచ్డీ అండ్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఇతర సాంకేతికత) అందించే ఇతర పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ప్రోగ్రామ్‌ల ప్రవేశాల కోసం ఈ పరీక్ష నిర్వహిస్తారు.
బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) లో ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ ప్రోగ్రామ్‌లు. అనేక నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT లు) మరియు సెంట్రల్ ఫండెడ్ టెక్నికల్ ఇనిస్టిట్యూట్లు (CFTI లు) కూడా తమ MSc ప్రోగ్రామ్‌ల ప్రవేశానికి ఈ JAM పరీక్ష స్కోర్‌ను అంగీకరిస్తాయి.
IBPS Clerk 2021 : ఇలా చేస్తే బ్యాంక్ కొలువు మీదే.. ఐబీపీఎస్ ప్రిపరేషన్ ప్లాన్
ఈ సంవత్సరం, బయోటెక్నాలజీ (BT), కెమిస్ట్రీ (CY), ఎకనామిక్స్ (EN), జియాలజీ (GG), మ్యాథమెటిక్స్ (MA), మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ (MS) మరియు ఫిజిక్స్ (PH) సహా ఏడు పేపర్లకు పరీక్ష నిర్వహించబడుతాయని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
అర్హతలు..
- ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండాలి.
- గతంలో దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు బ్యాచిలర్ డిగ్రీలో కనీస అర్హత మార్కు 55 శాతం లేదా 5.5 CGPA గా ఉండేది. కానీ ఇప్పుడు అది పూర్తయింది.
- దరఖాస్తు దారులు కచ్చితంగా మార్క్‌షీట్ ఉండాలి.
- మార్క్‌షీట్ లేకుండా ప్రమోటైన విద్యార్థులు (Students) ప్రమోటెడ్ సర్టిఫికెట్ (Promoted Certificate) సమర్పించాలి.
JEE Advanced 2021 : జేఈఈ స్కోర్‌తో ఐఐటీల్లోనే కాదు.. ఈ టాప్ యూనివర్సిటీల్లోనూ చేరవచ్చు
దరఖాస్తు విధానం
Step 1: దరఖాస్తు పూర్తిగా ఆన్లైన్ ద్వారా ఉంటుంది.
Step 2: దరఖాస్తు చేసుకోవడానికి అధికారిక వెబ్సైట్ https://jam.iitr.ac.in/ ను సందర్శించాలి.
Step 3: ప్రధాన పేజీలో JAM 2022: Apply Online లింక్‌ను క్లిక్చేయాలి.
Step 4: దరఖాస్తుకు అవసరమైన సమాచారన్ని అంత అందించి ఫాంను పూర్తి చేయాలి.
Step 5: దరఖాస్తు పూర్తయిన తరువాత ఆన్లైన్ విధానంలో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు కోసం అభ్యర్థులు రూ .600 చెల్లించాలి.
Step 6: అనంతరం అప్లికేషన్ సబ్మిట్ చేసి. ఫాంను డౌన్లోడ్ చేసుకోవాలి.
Step 7: దరఖాస్తుకు అక్టోబర్ 14, 2021 వరకు అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.