IIT Recruitment 2021: ఐఐటీ హైద‌రాబాద్‌లో ఉద్యోగాలు.. అర్హ‌త‌లు ఇవే

IIIT-Hyderabad (ఫైల్ ఫోటో)

ఐఐటీ హైద‌రాబాద్(Hyderabad)లో ప‌లు పోస్టుల భర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఐఐటీ రిక్రూట్‌మెంట్ 2021 నోటిఫికేష‌న్ ద్వారా 24 ఖాళీల‌ను భ‌ర్తీ చేస్తుంది. దరఖాస్తు చేసుకోవడానికి అర్హతలు.. దరఖాస్తు విధానం తెలుసుకోండి.

 • Share this:
  Govt Jobs 2021Govt Jobs 2021ఐటీ హైద‌రాబాద్ ప‌లు పోస్టుల భర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఐఐటీ రిక్రూట్‌మెంట్ 2021 నోటిఫికేష‌న్ ద్వారా 24 ఖాళీల‌ను భ‌ర్తీ చేస్తుంది. ముఖ్యంగా వివిధ క్యాట‌గిరిల‌తోపాటు నాన్ టీచింగ్ విభాగంలోనూ ఖాళీల‌ను ఈ నోటిఫికేష‌న్ ద్వారా రిక్రూట్ చేసుకొంటుంది. అన్నివిభాగాల‌కు క‌లిపి 24 ఖాళీలు ఉన్నాయి. అర్హ‌త‌లు.. ద‌ర‌ఖాస్తు విధానం పూర్తిగా నోటిఫికేష‌న్‌లో పేర్కొన్నారు. (నోటిఫికేషన్ కోసం క్లిక్  చేయండి)

  అర్హ‌త‌లు, పోస్టుల వివ‌రాలు..

  పోస్టు పేరు అర్హతలు ఖాళీల సంఖ్య
  ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) గుర్తింపు పొందిన యూనివర్సిటీలో బీఈ, బీటెక్ చేసి ఉండాలి.  వృత్తి ప‌ర‌మైన అనుభ‌వం ఉండాలి. 1
  సీనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ ప‌వ‌ర్ ఎల‌క్ట్రానిక్స్‌లో, ప‌వ‌ర్ సిస్ట‌మ్‌లో ఎంఈ, ఎంటెక్ ఇన్‌ లేదాఇన్‌స్ట్రుమెంటేషన్ లో బీఈ, బీటెక్‌తోపాటు అనుభ‌వం ఉండాలి. 1
  జూనియర్ మెడికల్ ఆఫీసర్ 55 శాతం మార్కులతో  ఎంబీబీఎస్ పూర్తి చేసి ఉండాలి. లేదా  పీజీ స్పెషలైజేషన్ ఉండాలి. అనుభవం అవసరం 1
  జూనియర్ సైకలాజికల్ కౌన్సిలర్ గుర్తింపు పొందిన యూనివర్సిటీలో 55శాతం మార్కులతో సైకాలజీ చదివి ఉండాలి. 1
  జూనియర్ ఇంజనీర్ (సివిల్) ఫస్ట్ క్లాస్ మార్కులతో సివిల్  ఇంజనీరింగ్ లో బీఈ, బీటెక్ పూర్తి చేసి ఉండాలి. 2
  జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ లో  బీఈ, బీటెక్ పూర్తి చేసి ఉండాలి. 2
  టెక్నికల్ సూపరింటెండెంట్ బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎమ్మెస్సీ, ఎంఈ చేసి ఉండాలి 7
  జూనియర్ టెక్నీషియన్ బీఈ, బీటెక్, ఎంసీఏ, డిప్లమా చేసి ఉండాలి 8
  మల్టీ స్కిల్ అసిస్టెంట్ గ్రేడ్-ఎల్ (ఎలక్ట్రికల్) ఫస్ట్ క్లాస్ లో  ఐటీఐ పాస్ కావాలి, 5  ఏళ్ల వృత్తి ప‌ర‌మైన అనుభ‌వం ఉండాలి. 1

  AIIMS Bibinagar Recruitment 2021: ఎయిమ్స్ బీబీన‌గర్‌లో ఉద్యోగాలు.. ఇంట‌ర్వ్యూ ద్వారానే ఎంపిక‌


  అప్లే చేసుకొనే విధానం..
  - కేవ‌లం ఆన్‌లైన్ ద్వారానే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
  - ముందుగా అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లాలి. (వెబ్‌సైట్ కోసం క్లిక్ చేయండి)
  - ద‌ర‌ఖాస్తు ఫాంలో మీ పూర్తి స‌మాచారం అందించండి.
  - అనంత‌రం ఫీజు చెల్లించాలి.
  - ఫీజు రూ.500, ఎస్సీ,ఎస్టీ,ఈడ‌బ్ల్యూఎస్‌, పీడ‌బ్ల్యూడీ, మ‌హిళ‌ల‌కు వారికి ఫీజు మిన‌హాయింపు.
  Published by:Sharath Chandra
  First published: