మారుతున్న పోటీ ప్రపంచంలో నైపుణ్యాలు ఉన్నవారికే మంచి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. అందుకే మార్కెట్‌లో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా టాప్ ఇన్‌స్టిట్యూట్స్ సరికొత్త కోర్సులను ప్రవేశపెడుతూ, విద్యార్థుల్లో స్కిల్ సెట్‌ను మెరుగుపర్చుతున్నాయి. ఇందులో భాగంగా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇండోర్(IIT Indore) కొత్త కోర్సును ప్రారంభించింది. మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్‌పై బీటెక్ కోర్సును ఆఫర్ చేస్తోంది. ఐఐటీ ఢిల్లీ (IIT Delhi), ఐఐటీ గౌహతి, ఐఐటీ రోపర్ కూడా ఈ కోర్సును ఆఫర్ చేయడం గమనార్హం.
జేఈఈ అడ్వాన్స్‌డ్ స్కోర్ ఆధారంగా ఈ కోర్సులో ఐఐటీ ఇండోర్ ప్రవేశాలు కల్పించనుంది. గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి ఇంటర్ లేదా అందుకు సమానమైన కోర్సు పూర్తిచేసిన వారు మాత్రమే అప్లై చేసుకోవచ్చు.
* కోర్సు వివరాలు
యూజీలో మ్యాథమెటిక్స్‌తో పాటు కంప్యూటర్‌పై అధ్యయనం చేయాలనుకుంటున్న విద్యార్థులకు ఈ కోర్సు బాగా ఉపయోగపడుతుంది. ఈ ప్రోగ్రామ్ కోసం ఐఐటీ ఇండోర్ మొత్తం 40 సీట్లు అందుబాటులో ఉంచింది. ఇది నాలుగేళ్ల ఫుల్‌టైమ్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్. కోర్సును 8 సెమిస్టర్స్‌గా విభజించారు. ప్రతి సెమిస్టర్‌లో అభ్యర్థులు ఎలక్టివ్ ఆప్షన్‌లతో పాటు 6 నుంచి 7 సబ్జెక్టులను తప్పనిసరిగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది.
* కెరీర్ స్కోప్
ఈ యూజీ ప్రోగ్రామ్‌లో ఇతర విభాగాల నుంచి ఎలక్టివ్ కోర్సులను ఎంచుకునే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. దీంతో మల్టీ డైమెన్షియల్ నాలెడ్జ్ సంపాదించిన విద్యార్థులు, అనేక రంగాల్లో ఉపాధి అవకాశాలు పొందవచ్చు. ప్రధానంగా కంప్యూటేషనల్ ఇంజనీర్స్, డేటా అనలిట్స్, ఎకనమిస్ట్స్, ఫైనాన్షియల్ అనలిస్ట్స్‌గా కెరీర్‌లో స్థిరపడవచ్చు. ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్స్, బ్యాంక్‌ల్లో ఉద్యోగాలు పొందవచ్చు.
* థిరిటికల్, ప్రాక్టికల్ ట్రైనింగ్
కంప్యూటర్ సైన్స్ అండ్ మ్యాథమెటికల్ ఫైనాన్స్ ఆఫ్ స్టడీలో విద్యార్థులకు థిరిటికల్, ప్రాక్టికల్ ట్రైనింగ్ అందించడానికి ఈ కోర్సును డిజైన్ చేశారు. మ్యాథమెటిక్స్ అనేది వివిధ యూనివర్సల్ మోడలింగ్‌ను వివరించే లాంగ్వేజ్‌ల స్టడీ-అప్లికేషన్. కంప్యూటింగ్ అనేది మ్యాథ్స్ ప్రాబ్లమ్స్‌కు సమర్ధవంతంగా సొల్యూషన్స్ అందించే సబ్టెక్ట్. మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ కోర్సు ద్వారా నంబర్స్, ప్యాట్రన్స్ వంటి అబ్‌స్ట్రాక్ కాన్సెఫ్ట్స్‌పై పూర్తిస్థాయి అనాలిసిస్, డీప్ స్టడీ చేయవచ్చు.
ఇది కూడా చదవండి : సమయం లేదు మిత్రమా..ముగుస్తున్న గడువు.. ఈ జాబ్స్ కి అప్లై చేశారో లేదో చెక్ చేయండి!
* పరస్పరం సంబంధం ఉన్న అంశాలు
మ్యాథమాటిక్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ లేదా మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఇన్ టెక్నాలజీ స్టడీస్ వంటి అనేక అంశాల్లో మ్యాథమెటిక్స్, కంప్యూటింగ్ పరస్పర సంబంధం కలిగి ఉంటాయి. ఆల్జీబ్రా, స్టాటిస్టిక్స్, బైనరీ మ్యాథ్, కాలిక్యులస్ వంటి అప్లికేషన్‌తో కంప్యూటింగ్ స్టడీకి చెందిన ప్రతి అంశంలో మ్యాథమెటిక్స్ భాగమవుతుంది. కాగా, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ సబ్జెక్ట్‌కు ఇటీవల డిమాండ్ పెరగడంతో ఐఐటీ ఇండోర్‌తో పాటు అనేక ఇతర యూనివర్సిటీలు, కాలేజీలు ఈ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, EDUCATION, IIT, JOBS, New course