హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

IIT Hyderabad: ఐఐటీ హైదరాబాద్ నుంచి స్పెషల్ ప్రోగ్రామ్.. ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు కూడా..

IIT Hyderabad: ఐఐటీ హైదరాబాద్ నుంచి స్పెషల్ ప్రోగ్రామ్.. ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు కూడా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

IIT Hyderabad: ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో నాలుగేళ్ల బీటెక్ కోర్సును ఆఫర్ చేస్తోంది ఐఐటీ హైదరాబాద్. ప్రధానంగా ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ (IC) డిజైన్ అండ్ టెక్నాలజీపై ఈ కోర్సు  దృష్టి సారించనుంది. 

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా దేశంలో సెమీకండక్టర్ల (Semi Conductors) కొరత తీవ్రంగా ఏర్పడింది. దీంతో ఈ ప్రభావం తయారీ రంగంపై తీవ్రంగా పడింది. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కడానికి దేశీయంగానే వీటిని తయారు చేయడం కోసం భారత ప్రభుత్వం (Indian Government) సెమీకండక్టర్ మిషన్‌ను ప్రారంభించింది. దీనికి అనుగుణంగా ఐఐటీ హైదరాబాద్ (IIT Hyderabad) ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌(Electrical Engineering)లో నాలుగేళ్ల బీటెక్ కోర్సును ఆఫర్ చేస్తోంది. ప్రధానంగా ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ (IC) డిజైన్ అండ్ టెక్నాలజీపై ఈ కోర్సు దృష్టి సారించనుంది. భారత్ సెమీకండక్టర్ ఉత్పత్తిలో సాధికారతను సాధించడానికి ఫ్యాబ్లస్ చిప్ డిజైన్, తయారీకి సంబంధించిన సూత్రాలు, పద్ధతుల ద్వారా ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ డిజైన్, తయారీలో నిపుణులకు శిక్షణ ఇవ్వడం ప్రోగ్రామ్ లక్ష్యమని ఇన్‌స్టిట్యూట్ పేర్కొంది.

ఐసీ డిజైన్ అండ్ టెక్నాలజీ స్పెషలైజేషన్‌తో బ్యాచిలర్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ కోర్సు సరైన సమయంలో ఇన్‌స్టిట్యూట్‌లో ప్రారంభమవుతోందన్నారు ఐఐటీ హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీలో R&D గ్రూప్ కోఆర్డినేటర్ సునీతా వర్. సెమీకండక్టర్ డిజైన్ ఏరియాలో భారతదేశాన్ని గ్లోబల్ టాలెంట్ హబ్‌గా మార్చడమే ఈ కోర్సు లక్ష్యమని పేర్కొన్నారు. అండర్ గ్రాడ్యుయేట్ లెవల్‌లో ఇండస్ట్రీ-రెడీ డిజైన్ డిజైనర్లను సిద్ధం చేయడంపై ఈ కోర్సు దృష్టి సారించనుందని చెప్పారు.

* ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు కూడా..

మార్కెట్ డిమాండ్‌లను తీర్చడంలో విద్యార్థులకు సహాయపడేలా..ఈ ప్రోగ్రామ్ సమ్మర్ అండ్ సెమిస్టర్-లాంగ్ ఇండస్ట్రీ ఇంటర్న్‌షిప్‌లను అందించాలని ఐఐటీ హైదరాబాద్ యోచిస్తోంది. IC డిజైన్ అండ్ తయారీ రంగంలో అధ్యాపకుల అకడమిక్ ఎక్స్‌పీరియన్స్, వరల్డ్ వైడ్ ఇండస్ట్రీ ప్రాక్టికల్ స్కిల్స్, ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ల ద్వారా విద్యార్థులు ఎంతో ప్రయోజనం పొందనున్నారు. ఈ మేరకు ఐఐటీ హైదరాబాద్ ఓ ప్రకటన జారీ చేసింది.

ఐఐటీ హైదరాబాద్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్ హెడ్ శివ గోవింద్ మాట్లాడుతూ.. చిప్ డిజైన్ అండ్ సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ల్యాబ్‌లలో శిక్షణ ఇవ్వడం ఈ ప్రోగ్రామ్ ప్రధాన USPs అన్నారు. సమ్మర్ అండ్ సెమిస్టర్-లాంగ్ ఇండస్ట్రీ ట్రైనింగ్‌తో బలమైన ప్రాక్టికల్ ఎక్స్‌పోజర్‌ను అందించడం ఈ కోర్సు అదనపు మెరిట్ అని అభిప్రాయపడ్డారు.

ఇది కూడా చదవండి : నిరుద్యోగులకు అలర్ట్.. ఈవారం అప్లై చేసుకోవాల్సిన జాబ్ లిస్ట్ చెక్ చేయండి..

* సమర్థమైన మానవ వనరుల కోసం..

ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి మాట్లాడుతూ.. ఇంజినీరింగ్ సంస్థలు పరిశ్రమకు సిద్ధంగా ఉన్న మానవ వనరులను ఉత్పత్తి చేయడానికి కృషి చేయాలన్నారు. భారతదేశం సెమీకండక్టర్ల తయారీ రంగంలోకి వేగంగా దూసుకుపోతున్నందున, ఈ రంగంలో సమర్థమైన మానవ వనరులను ఉత్పత్తి చేయడం ఎంతైనా అవసరం ఉందన్నారు.

ఇందుకోసం IC డిజైన్ అండ్ టెక్నాలజీపై ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ కోర్సును ప్రవేశపెడుతున్నట్లు ఆయన తెలిపారు. గ్లోబల్ ప్లేయర్‌గా మాత్రమే కాకుండా, సెమీకండక్టర్ డిజైన్ అండ్ ప్రొడక్ట్ డెవలప్‌మెంట్‌లో అగ్రగామిగా మారాలనే భారతదేశ మిషన్‌కు అనుగుణంగా ఈ కోర్సు ఉంటుందన్నారు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Career and Courses, EDUCATION, IIT Hyderabad, JOBS

ఉత్తమ కథలు