హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

IIT Hyderabad: ఐఐటీ హైదరాబాద్​లో కొత్తగా 7 ఆన్​లైన్​ పీజీ కోర్సులు.. ఇలా దరఖాస్తు చేసుకోండి  

IIT Hyderabad: ఐఐటీ హైదరాబాద్​లో కొత్తగా 7 ఆన్​లైన్​ పీజీ కోర్సులు.. ఇలా దరఖాస్తు చేసుకోండి  

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

సైన్స్ అండ్​ టెక్నాలజీ, లైబ్రరీ ఆర్ట్స్​లో విద్యార్థులకు విస్తృతమైన అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ కోర్సును ప్రారంభిస్తున్నట్లు ఐఐటీ హైదరాబాద్​ స్పష్టం చేసింది. ఈ ఆన్‌లైన్ ఎంటెక్​/ ఎండిజైన్​ ప్రోగ్రామ్స్​ను ఐఐటీ హైదరాబాద్​కి చెందిన వేర్వేరు విభాగాలు అందిస్తున్నాయి.

ఇంకా చదవండి ...

మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యా వ్యవస్థలోనూ మార్పులు వస్తున్నాయి. మార్కెట్​ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు కొత్త కోర్సులను ప్రారంభిస్తున్నాయి విద్యా సంస్థలు. ఈ క్రమంలోనే ప్రతిష్టాత్మక ఐఐటీ హైదరాబాద్ ఏడు కొత్త ఆన్‌లైన్ ఎంటెక్​ ప్రోగ్రామ్‌లను ప్రారంభించింది. విద్యార్థుల కోసం ఏడు ఎంటెక్​, వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం ఒక ఎం-డిజైన్ ప్రోగ్రామ్​లను రూపొందించింది. సైన్స్ అండ్​ టెక్నాలజీ, లైబ్రరీ ఆర్ట్స్​లో విద్యార్థులకు విస్తృతమైన అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ కోర్సును ప్రారంభిస్తున్నట్లు ఐఐటీ హైదరాబాద్​ స్పష్టం చేసింది. ఈ ఆన్‌లైన్ ఎంటెక్​/ ఎండిజైన్​ ప్రోగ్రామ్స్​ను ఐఐటీ హైదరాబాద్​కి చెందిన వేర్వేరు విభాగాలు అందిస్తున్నాయి.

ఈ కోర్సులు క్రెడిట్ సిస్టమ్​పై ఆధారపడి ఉంటాయి. తద్వారా విద్యార్థులు తమకు నచ్చిన కోర్సుకు మారే అవకాశం ఉంటుంది. కోర్సులో భాగంగా కోర్, ఎలక్టివ్, ప్రాజెక్ట్ వర్క్​లు ఉంటాయి. కాగా, ఇండస్ట్రియల్​ మెటలర్జీ, ఈవీ టెక్నాలజీ, కంప్యుటేషనల్ మెకానిక్స్, ఇంటిగ్రేటెడ్ కంప్యూటేషనల్ మెటీరియల్స్ ఇంజనీరింగ్, కమ్యూనికేషన్ అండ్ సిగ్నల్స్ ప్రాసెసింగ్ (CSP), పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ పవర్ సిస్టమ్ (PEPS), మైక్రోఎలక్ట్రానిక్స్ అండ్​ వీఎల్​ఎస్​ఐ (ME & VLSI) వంటి ఏడు ఎంటెక్​ ప్రోగ్రామ్స్​లో విద్యార్థులకు దేనికైనా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆన్​లైన్​ ఎంటెక్​ ప్రోగ్రామ్​ను విద్యార్థుల కోసం రూపొందించగా.. ఆన్‌లైన్ ఎండిజైన్​ ప్రోగ్రామ్​ని మాత్రం వర్కింగ్​ ప్రొఫెషనల్స్​ కోసం రూపొందించారు. జూలై 7 లోపు ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవాలి. ఈ ప్రోగ్రామ్స్​పై ఐఐటి హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిఎస్ మూర్తి మాట్లాడుతూ “గతేడాది మేము ఆరు ఇండస్ట్రీ ఓరియంటెడ్ ఎంటెక్ ప్రోగ్రామ్‌లను ప్రారంభించాం. ఈ ఏడాది మరో ఏడు ఆన్‌లైన్ ఎంటెక్​, ఒక ఎండిజైన్​ ప్రోగ్రామ్​ను ప్రారంభిస్తున్నాం. వీటికి అదనంగా, బిటెక్ విద్యార్థుల కోసం టెక్నో-ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో డ్యూయల్ డిగ్రీ ఎంటెక్ ప్రోగ్రామ్‌ను కూడా ప్రారంభించనున్నాం. విద్యార్థులను నిపుణులుగా తీర్చిదిద్ది టెక్నాలజీ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడమే మా లక్ష్యం” అని వివరించారు.

ఆగస్టులో క్లాసులు ప్రారంభం..

రెండేళ్ల ఎంటెక్ కోర్సుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత విభాగాల్లో మొదటి శ్రేణిలో బీఈ/ బీటెక్​ పూర్తి చేసి ఉండాలి. దీనితో పాటు వారికి రెండేళ్ల ఇండస్ట్రియల్​ ఎక్స్​పీరియన్స్​ కూడా ఉండాలి. ఇక, ఎండిజైన్​ కోర్సు విషయానికి వస్తే.. బీఈ/ బీటెక్​/బీఎస్​/బీడిజైన్​/ బీఆర్క్​ డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు రెండేళ్ల ఇండస్ట్రియల్​ ఎక్స్​పీరియన్స్​ ఉండాలి. అయితే, అభ్యర్థులు సంబంధిత ఆర్ట్స్ / హ్యుమానిటీస్ లేదా సమానమైన డిగ్రీలో కనీసం 55 శాతం ఉత్తీర్ణత సాధించాలి. ఈ కోర్సులకు సంబంధించిన ఆన్​లైన్ క్లాసులు ఆగస్టు నెలలో ప్రారంభం కానున్నాయి.

First published:

Tags: IIT Hyderabad

ఉత్తమ కథలు